Online Applications For Teachers Transfers In AP Till June 3rd - Sakshi
Sakshi News home page

AP: బదిలీలకు 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

Published Sat, May 27 2023 7:30 AM | Last Updated on Sat, May 27 2023 11:08 AM

Online Applications For Transfers In AP Till June 3rd - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్‌లైన్‌ పోర్టల్‌లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్‌ లక్ష్మీ శుక్రవారం శాఖ అధికారులతో సమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. 

సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచనున్నారు. ఆన్‌లైన్‌లో బదిలీల దరఖాస్తు నమోదు సమయంలో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉద్యోగుల బదిలీల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యే సమయానికి ముందే జిల్లాల వారీగా, ఉద్యోగ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెబ్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందులో భాగంగా శనివారం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో     వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 

బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ (జిల్లా పరిధిలో) ఇలా..
- జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేది :  మే 28 
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ : జూన్‌ 3 
- ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరి తేదీ : జూన్‌ 6 
- వెబ్‌ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేది : జూన్‌ 6 
- తిరస్కరించిన దరఖాస్తులు, తిరస్కరణ కారణంతో కూడిన జాబితా వెల్లడి : జూన్‌ 6 
- బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్‌ తేదీలు : జూన్‌ 8, 9, 10 
- బదిలీలో కొత్తగా కేటాయించిన సచివాలయ వివరాలతో బదిలీ సర్టిఫికెట్ల జారీ తేది : జూన్‌ 8, 9, 10 
- బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ : జూన్‌ 10 

వేరే జిల్లాకు బదిలీ కోరుకునే వారి కోసం.. 
- జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాలు నమోదు తేది :  మే 28 
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేది : జూన్‌ 3 
- వేరే జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేది : జూన్‌ 8 
(ఆ ఉత్తర్వులోనే బదిలీ చేసే మండలం లేదా పట్టణం వివరాలు నమోదు)
- బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్‌ తేదీ : జూన్‌ 8, 9, 10  
- కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ : జూన్‌ 8, 9, 10  
- బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేది : జూన్‌ 10. 

ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement