
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత పారదర్శకత తీసుకొస్తూ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయాల స్థాయిలోను సమాచారహక్కు(ఆర్టీఐ) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో సమాచారహక్కు చట్టం అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ జీవో నంబరు 437 జారీచేశారు.
ప్రతి గ్రామ సచివాలయంలో సమాచారహక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–ఏపీఐవో), సమాచార హక్కు సంబంధిత అధికారి(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–పీఐవో)లను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
గ్రామ సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఏపీఐవోగాను, పంచాయతీ కార్యదర్శి పీఐవోగాను కొనసాగుతారని కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాని వినతులపై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ అథారిటీగా ఆ మండల ఎంపీడీవో పనిచేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment