అధికారులతో సమావేశమైన పుణే డిప్యూటీ సీఈవో మలిందే టొనపే తదితరులు
తిరుపతి అర్బన్: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరును మహారాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించింది. పుణే డిప్యూటీ సీఈవో మలిందే టొనపే నేతృత్వంలో మహారాష్ట్ర ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో కూడిన బృందం శనివారం తిరుపతిలో చిత్తూరు జిల్లా అధికారులతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వాటి ద్వారా జిల్లావ్యాప్తంగా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు? తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు ఎలా మారాయనే అంశాలపై అధ్యయనం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, పనితీరును కూడా తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు మంచి వ్యవస్థను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బృందం సభ్యులు అభినందించారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment