సాక్షి, నెల్లూరు: రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థపై బాబు విషయం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బాధ్యత వాలంటీర్లది కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నెల్లూరుకు వచ్చారంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు చంద్రబాబు ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కమీషన్ల కోసమే టిడ్కో ఇళ్ల నిర్మించారని.. సిగ్గులేకుండా టిడ్కో ఇళ్ల వద్ద నిలబడి బాబు సెల్ఫీ దిగారని ధ్వజమెత్తారు. సంగం, నెల్లూరు బ్యారేజీల వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.
ఈ మేరకు శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ. ‘దరిద్రం, కరువులకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు రాష్ట్రానికి దరిద్రం అని సొంత మామే చెప్పారు. పంచాయితీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తోక ముడిచి వెళ్ళిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతానని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా?
పార్టీని నడపలేని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ తన పక్కనే ఉన్నారని చెప్పిన చంద్రబాబు 23 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు? చివరికి కొడుకును కూడా గెలిపించుకొలేకపోయారు. రౌడీయిజం గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదం. బాబు లాంటి వ్యక్తి సమాజంలో జీవించే అర్హత ఉందా’ అని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు.
చదవండి: సీఎం జగన్ పెట్టిన పేరును పవన్ కల్యాణ్ సార్థకం చేస్తున్నాడా! కాకపోతే..
Comments
Please login to add a commentAdd a comment