సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ సత్యాన్ని వధించి, అసత్యమనే సిరాతో తన ఈనాడు పత్రికలో మరో తప్పుడు కథనాన్ని వండివార్చారు. ‘ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు’ శీర్షికన విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో పరిస్థితి ఇదంటూ టీడీపీ పాలనలో చేసిన మోసాలను కప్పిపుచ్చి, ప్రస్తుత ప్రభుత్వంపై తప్పుడు రాతలతో విషం చిమ్మారు.
వాస్తవం ఏమిటంటే..
2019 ఎన్నికల్లో ఎలా అయినా గెలుపొందాలనే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తెరపైకి తీసుకొచ్చింది. కేవలం 6,500 ఇళ్లు (ఫ్లాట్లు) మాత్రమే నిర్మించేందుకు భూమిని సేకరించింది. టిడ్కో ఇళ్లు ఇస్తామంటూ ఏకంగా 11,917 మంది పేదల నుంచి రూ.38.33 కోట్లు వసూలు చేసింది. మరో వైపు టీడీపీ కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల దరఖాస్తులను బ్లాకులో విక్రయించారు. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు.
లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు
టీడీపీ చేసిన మోసాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివ్వెరపోయింది. పక్కాగా దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన 5,341 మంది బాధితులకు వారు చెల్లించిన నగదును వెనక్కి ఇవ్వడంతో పాటు, వారి పూర్తి అంగీకా రంతో ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. టిడ్కో ఇళ్ల కోసం 5,341 మంది లబి్ధదారులు డీడీల రూపంలో టిడ్కోకు రూ.16 కోట్లు జమ చేశారు. ఆ డబ్బును లబి్ధదారులకు తిరిగి చెల్లిస్తున్నారు.
నిర్మించని ఇళ్లకు నంబర్లు వేసి మరీ మోసం
పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో 12 వేల ఇళ్ల నిర్మాణానికి 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే షాబాద గ్రామంలో 74 ఎకరాలు మాత్రమే తీసుకుంది. అది కొండ ప్రాంతం కావడంతో అధికారులు, ఇంజినీర్లు అహరి్నశలూ శ్రమించి చివరకు 6,576 ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన 11,917 మందికి ఇళ్లు కావాలంటే మరో 100 ఎకరాల వరకు అవసరం. ఎకరం రూ.కోటి చొప్పున 100 ఎకరాలు కొనేందుకు నాడు సర్వేలు చేపట్టిన చంద్రబాబు ఆ రూ.100 కోట్లను రైతులకు చెల్లించకుండానే చేతులు ఎత్తేశారు. కొండ ప్రాంతంలో 6,576 ఇళ్ల నిర్మాణమే సాధ్యమని తెలిసినా.. ఎన్నికల్లో గెలుపొందాలనే దురాశతో 11,917 మంది లబి్ధదారులకు ఏకంగా ఇంటి నంబర్లతో స్లిప్పులు తయారు చేయించారు. ఇళ్లు నిర్మించకుండా, సరిగ్గా ఎన్నికల ముందు 2019 జనవరి 17వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి, ఆ స్లిప్పులు పంపిణీ చేసి మోసగించారు.
ఇది ఈనాడుకు కనిపించదా?
విజయవాడ నగరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు ఇప్పిస్తామని, పేదల నుంచి టీడీపీ కార్పొరేటర్లు, వారి అనుచరులు నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో నమ్మించి నగదు వసూలు చేశారు. రెండు వేల మందికిపైగా లబ్ధిదారుల నుంచి రూ.70 కోట్లు వసూలు చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ టీడీపీ నాయకులు మోసం చేశారంటూ స్పందన కార్యక్రమంలో ఎనీ్టఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ వ్యవహా రంపై ఈనాడు పెన్నెత్తి ఒక్క వార్తా రాయదు.
మేలు చేసిన ప్రభుత్వంపై విషం
టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసిందనే విషయం ఏ బాధితుడిని అడిగినా చెబుతారు. ‘ఈనాడు’కు ఆ విషయా లేవీ కనబడకపోవడం, బాధితుల గోడు వినబడకపోవడం విడ్డూరంగా ఉంది. లబి్ధదారులు చెల్లించిన ప్రతి రూపాయి సహా లెక్కలు సేకరించిన ఆ పత్రికకు, ఆ డబ్బులు నాడు ఎలా మాయమయ్యాయి, టీడీపీ కాజేసిన ఆ డబ్బుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లించింది, బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించి ఎలా బాసటగా నిలిచింది అన్న వాస్తవాలు కనబడకపోవడం సిగ్గుచేటు. టీడీపీకి కొమ్ముకాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇలా అవాస్తవాలతో విషం చిమ్మడం, సత్యం ముందు బొక్కబోర్లాపడి ప్రజా కోర్టులో దోషిగా నిలిచి నవ్వులపాలవడం ఆ పచ్చ పత్రికకు సర్వసాధారణమైంది.
లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాం
ఇప్పటికే లాటరీ ద్వారా 6,576 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటా యించాం. గతంలో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక లేకుండానే 11,917 మంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇప్పటికే ఇళ్లు కేటాయించగా, మిగిలిన వారు నష్టపోకుండా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం చేపడు తున్నాం. వారు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తున్నాం. ఇప్పటికే రూ.13.5 కోట్లు వెనక్కు ఇచ్చాం. మరో రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఇందులోనూ రూ.1.5 కోట్లకు సంబంధించిన బిల్లులపై సంతకాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment