
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాలకు అలవాటుపడిన టీడీపీ నాయకులు ఇంకా మోసాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఫైరయ్యారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమని జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాగా, వరుదు కళ్యాణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీతో చంద్రబాబు సెల్ప్ గోల్‌లో పడ్డారు. టిడ్కో ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది. రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 50వేల టిడ్కో ఇళ్లు ఇచ్చాం. రెండు నెలల్లో మరో 40వేల టిడ్కో ఇళ్లు ఇస్తాం. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిన క్యాన్సర్ గడ్డ మీరు కాదా?. ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చింది మీరు కాదా?. మ్యానిఫెస్టోను చెత్తబుట్టతో వేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment