(అనంతపురం) గుంతకల్లు టౌన్: మనిషి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. నిరుపేదలకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాలను కేటాయించిన దేశచరిత్రలో నూతన అధ్యాయానికి తెర లేపారని కొనియాడారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద గుంతకల్లులో టిడ్కో ఇల్లు మంజూరైన 2,160 మంది లబ్దిదారుల పేరిట మంగళవారం మున్సిపల్ కౌన్సిల్‌హాల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ఆయన ప్రారంభించి, మాట్లాడారు.
ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేలా చేస్తామంటూ గత ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొండిగోడలకే పరిమితమైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించడమే కాక, ఆయా కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి పరిచినట్లు వివరించారు. రోజూ 50 నుంచి 100 మంది లబ్దిదారుల పేరిట టిడ్కో ఇళ్ల రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, మాజీ చైర్మన్ ఎన్.రామలింగప్ప, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టిడ్కో డీఈ రంగారావు, మద్దయ్య, ఏసీపీ కేఎండీ.ఇషాక్, ఆర్‌ఓ నాసిర్, మెప్మా టీపీఆర్వో మోహన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment