సాక్షి, విజయనగరం: ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించడానికి విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంటు సరఫరా విషయంలో సాంకేతిక అంశాలు ఉంటాయి. దానిని పట్టుకొని టీడీపీ, బాబు అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తోంది. చెత్త పన్ను మీద రాద్ధాంతం తగదు. క్లాప్ అనే ప్రోగ్రాం ద్వారా పారిశుధ్యం చేపట్టాం. పేదల నుండి పన్ను వసూలు చేయడం లేదు.
ఇళ్ల గురించి మేనిఫెస్టోలో ఏం చెప్పామో టీడీపీ నాయకులు చూసూకోవాలి. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతిని సరిచేసి ఇస్తున్నాం. పేదల ఇళ్ల విషయంలో అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు ఆడటం కరెక్ట్ కాదు. ఇళ్ల నిర్మాణంలో వైఎస్సార్ కాలం, టీడీపీ కాలం కంటే జగన్ ప్రభుత్వమే ఎక్కువ విస్తీర్ణం ఇస్తుంది. వాస్తవాలపై అచ్చెన్నాయుడు చర్చ చేయాలి. టిడ్కో పథకంలో ఒక్క ఇళ్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు ఇచ్చారా. ఎందుకు ఇవ్వలేదు. ఇళ్లనిర్మాణంలో కమిషన్ కోసమే నిర్మాణం చేసి వదిలేశారు.
చదవండి: (హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం)
టిడ్కో నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ చేసి ప్రభుత్వానికి నాలుగు వందల కోట్లు మిగిల్చాము. టిడ్కో ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కరెంట్, రోడ్‌లు, నీరు, మరుగుదొడ్లు వంటివి చంద్రబాబు నిర్మించకపోవడం వలన లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదార్లుకి అప్పగిస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment