ఏపీలో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరాకు ఊపు... | gas supply to households success in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరాకు ఊపు...

Published Fri, Jan 20 2023 9:31 PM | Last Updated on Fri, Jan 20 2023 9:39 PM

gas supply to households success in andhra pradesh - Sakshi

సింగపూర్‌ కు చెందిన  ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్‌ పీ ప్రథాన్‌  కేంద్ర పెట్రోలియం బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొంది ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని నెలల క్రితం ఇంధన సరఫరా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏజీ అండ్‌ పీ ప్రధామ్ రీజనల్‌ హెడ్‌ సాక్షితో ముచ్చటించారు. నేచురల్‌ పైప్‌లైన్‌ గ్యాస్‌ సరఫరా ప్రగతి తదితర విశేషాలు ఆయన మాటల్లోనే...

ఏపీలో విస్తారంగా...
ఇండియాలో 30 ఏళ్లుగా సీఎన్జీ గ్యాస్‌ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. సౌత్‌తో పోల్చితే నార్త్‌లో ఎక్కువగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, హైదరాబాద్‌లలోనూ సీఎన్జీ యాక్టివిటీ ఎక్కువ. కాకినాడలోనే 50 వేల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపుగా 3 లక్షల మందికిపైగా  ఆంధ్రప్రదేశ్‌లో  సీఎన్జీని వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 120 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం కమర్షియల్‌ వినియోగానికే ఉన్నాయి. ఈ నేపధ్యంలో గృహావసరాలకు సంబంధించిన వినియోగాన్ని కూడా విస్తృతం చేయాల్సి ఉంది.
బహుళ ప్రయోజనాలు...
పైప్‌లైన్‌ గ్యాస్‌ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్‌ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలో లభిస్తుంది అంటే ప్రస్తుతం అవుతున్న  ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది.  ఈ నేచురల్‌ గ్యాస్‌ సంప్రదాయ సిలిండర్‌ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం, పర్యావరణ హితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్‌ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్‌ అవసరం లేదు. ఇక నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్‌ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్‌ గ్యాస్‌ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి.
వేగంగా ఇన్‌స్టలేషన్‌...
గూడూరు టౌన్‌లోనే కాకుండా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలో 9 సిఎన్జీ స్టేషన్స్‌ ఏర్పాటు చేశాం. నేషనల్‌ హైవే కావలితో పాటు నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి.. మొదలైన చోట్ల పైప్‌లైన్‌ యాక్టివిటీ జరుగుతుంటే హౌజ్‌హోల్డ్‌ ఇన్‌స్టాలేషన్‌ నాయుడుపేట, గూడురులలో జరుగుతోంది. సిఎన్జీ గ్యాస్‌ కనెక్షన్‌తో పాటే పంబ్లింగ్, స్టౌ వంటివన్నీ ఇందులో కలిపే ఉంటాయి. మొదటి నెలలో ఇన్‌స్టాలేషన్‌ చార్జ్‌ ఉంటుంది. తర్వాత నెల నుంచి ఉండదు. కాకపోతే ముందు 6 వేల రూపాయలసెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది.

ప్రతీ నెల గ్యాస్‌ వాడుకున్నదాన్ని బట్టి ఆ తర్వాత బిల్‌పే చేసే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా ఈ ఛార్జెస్‌ ఉంటాయి. గూడూరు టౌన్‌లో  ఇన్‌స్టాలేషన్‌ ఛార్జెస్‌ రూ. 800 ఉంటే నాయుడుపేట టౌన్‌లో రూ.2700  ఉంది. కమర్షియల్‌ రిజిస్ట్రేషన్స్‌ కు అంటే స్కూల్, బిజినెస్‌ ఇతరవాటికి ఒక విధంగా, రెసిడెన్సియల్‌కు ఒక విధంగా రేటు ఉంటుంది. పైప్‌లైన్‌ ప్రొవిజన్‌ బట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 10000ల రిజిస్ట్రేషన్స్‌ వచ్చాయి. ఒక్కో ఇంటికీ మ్యాగ్జిమమ్‌ రెండు కనెక్షన్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. వంటకు కావల్సిన గ్యాస్‌తో పాటు వాటర్‌ గీజర్‌కు కూడా కనెక్షన్‌ ఇస్తాం.
స్పందన బాగుంది...
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తోంది. అదే విధంగా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వారి  గైడ్‌లైన్స్‌ ప్రకారం మేం పనులు నిర్వహిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement