Gas supply
-
ఏపీలో ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు ఊపు...
సింగపూర్ కు చెందిన ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ కేంద్ర పెట్రోలియం బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొంది ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని నెలల క్రితం ఇంధన సరఫరా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏజీ అండ్ పీ ప్రధామ్ రీజనల్ హెడ్ సాక్షితో ముచ్చటించారు. నేచురల్ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రగతి తదితర విశేషాలు ఆయన మాటల్లోనే... ఏపీలో విస్తారంగా... ఇండియాలో 30 ఏళ్లుగా సీఎన్జీ గ్యాస్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. సౌత్‌తో పోల్చితే నార్త్‌లో ఎక్కువగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, హైదరాబాద్‌లలోనూ సీఎన్జీ యాక్టివిటీ ఎక్కువ. కాకినాడలోనే 50 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపుగా 3 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎన్జీని వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 120 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం కమర్షియల్ వినియోగానికే ఉన్నాయి. ఈ నేపధ్యంలో గృహావసరాలకు సంబంధించిన వినియోగాన్ని కూడా విస్తృతం చేయాల్సి ఉంది. బహుళ ప్రయోజనాలు... పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలో లభిస్తుంది అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం, పర్యావరణ హితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. ఇక నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. వేగంగా ఇన్స్టలేషన్... గూడూరు టౌన్లోనే కాకుండా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలో 9 సిఎన్జీ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. నేషనల్ హైవే కావలితో పాటు నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి.. మొదలైన చోట్ల పైప్‌లైన్ యాక్టివిటీ జరుగుతుంటే హౌజ్‌హోల్డ్ ఇన్స్టాలేషన్ నాయుడుపేట, గూడురులలో జరుగుతోంది. సిఎన్జీ గ్యాస్ కనెక్షన్‌తో పాటే పంబ్లింగ్, స్టౌ వంటివన్నీ ఇందులో కలిపే ఉంటాయి. మొదటి నెలలో ఇన్స్టాలేషన్ చార్జ్ ఉంటుంది. తర్వాత నెల నుంచి ఉండదు. కాకపోతే ముందు 6 వేల రూపాయలసెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది. ప్రతీ నెల గ్యాస్ వాడుకున్నదాన్ని బట్టి ఆ తర్వాత బిల్‌పే చేసే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా ఈ ఛార్జెస్ ఉంటాయి. గూడూరు టౌన్లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ రూ. 800 ఉంటే నాయుడుపేట టౌన్లో రూ.2700 ఉంది. కమర్షియల్ రిజిస్ట్రేషన్స్ కు అంటే స్కూల్, బిజినెస్ ఇతరవాటికి ఒక విధంగా, రెసిడెన్సియల్‌కు ఒక విధంగా రేటు ఉంటుంది. పైప్‌లైన్ ప్రొవిజన్ బట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 10000ల రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఒక్కో ఇంటికీ మ్యాగ్జిమమ్ రెండు కనెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వంటకు కావల్సిన గ్యాస్‌తో పాటు వాటర్ గీజర్‌కు కూడా కనెక్షన్ ఇస్తాం. స్పందన బాగుంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తోంది. అదే విధంగా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వారి గైడ్‌లైన్స్ ప్రకారం మేం పనులు నిర్వహిస్తున్నాం. -
Putin: అన్నంత పని చేసిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన. ఈ తరుణంలో.. రూబుల్స్‌లో చెల్లింపులకు నిరాకరించిన పోల్యాండ్, బల్గేరియాలకు గాజ్ప్రోమ్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేయించారు. రష్యా ఎనర్జీ దిగ్గజం గాజ్ప్రోమ్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోల్యాండ్(పీజీఎన్ఐజీ), బల్గేరియా(బల్గర్గ్యాజ్)లకు పూర్తిగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రూబుల్స్ రూపేణా బకాయిల చెల్లింపుల మూలంగానే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. కిందటి నెలలోనే పుతిన్ ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు చాలా దేశాలు తేలికగా తీసుకున్నాయి. పైగా యూరోప్ దేశాలు తమకు రూబుల్స్ ఎలాగ ఉంటుందో కూడా తెలియదంటూ సెటైర్లు వేశాయి. ఈ తరుణంలో పుతిన్ తొలిసారి గ్యాస్ సరఫరా నిలిపివేయించడం ఇదే ప్రథమం. ఇక హంగేరీ మాత్రమే రూబుల్స్‌లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో.. పుతిన్ ప్రతీకారంగా ఈ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా దేశాలకు ఇదే పరిస్థితి గనుక ఎదురైతే.. నష్టం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇది రష్యా ఆర్థికంపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని! -
Russia-Ukraine war: రష్యా గ్యాస్‌కు యూరప్ గుడ్‌బై!
బ్రసెల్స్: గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త ఒప్పందాలు: జర్మనీ బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది. తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని, ఆచరణసాధ్యం కాదని జర్మనీ చాన్స్‌లర్ ఒలాప్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రకటించారు. రష్యాతో నిమిత్తం లేకుండా యూరప్ గ్యాస్ అవసరాలను అమెరికా, ఇతర దేశాలు తీర్చడం సా ధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే యూరప్‌కు భారీగా గ్యాస్ సరఫరా చేస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో అంతకుమించి సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధపడ్డా దాన్ని దిగుమతి చేసుకునే, పంపిణీ చేసే వ్యవస్థలు యూరప్‌లో ప్రస్తుతానికి లేవు. -
గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్ ఉక్కిరిబిక్కిరి
నేషనల్ డెస్క్, సాక్షి: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి యూరప్ దేశాలకు ప్రాణ సంకటంగా మారింది. యూరప్ సహజ వాయువు (గ్యాస్) అవసరాల్లో ఏకంగా 40 శాతం దాకా రష్యానే తీరుస్తోంది. జర్మనీకైతే 65 శాతం గ్యాస్ రష్యా నుంచే వస్తోంది. చెక్ రిపబ్లిక్ వంటి చిన్న దేశాలైతే పూర్తిగా రష్యా గ్యాస్ మీదే ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా రష్యా నుంచి సరఫరా ఆగిపోయి యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. పైగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ భవితవ్యం కూడా అనిశ్చితిలో పడింది. 1,100 కోట్ల డాలర్లతో తలపెట్టిన ఈ 1,222 కిలోమీటర్ల లైన్ రష్యా నుంచి బాల్టిక్ సముద్రం గుండా ఫిన్లాండ్, స్వీడన్, పోలాండ్ మీదుగా జర్మనీ వెళ్తుంది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నందుకు 2021లో యూరప్ దేశాలకు అదనపు గ్యాస్ సరఫరాలను రష్యా ఆపేసినందుకే విలవిల్లాడాయి. గ్యాస్ ధరలు ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగి ఆర్థికంగా కూడా దెబ్బ తిన్నాయి. ఈ భయంతోనే ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగకుండా రష్యాను ఏదోలా అనునయించేందుకు యూరప్ దేశాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ చివరిదాకా శతవిధాలా ప్రయత్నించాయి. చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?) ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కాలికి బలపం కట్టుకుని మరీ అమెరికా, రష్యా మధ్య తిరిగారు. తాజాగా కూడా బైడెన్, పుతిన్ చర్చలకు ఆయన రంగం సిద్ధం చేశారు. యుద్ధ నేపథ్యంలో అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవాలనుకున్నా అది ఆర్థికంగా పెను భారమే అవుతుంది. ఏడాదిన్నర క్రితంతో పోలిస్తే యూరప్ దేశాలు ఇప్పటికే గ్యాస్ కొనుగోళ్లపై ఎనిమిది రెట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. యూఎస్‌పై ఆధారపడాల్సి వస్తే ఇది ఏకంగా మరో రెండింతలు కావచ్చని అంచనా. అంతంత మొత్తాలు వెచ్చించేందుకు ఒకవేళ సిద్ధపడ్డా లాభం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడానికే అమెరికా ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం మరికొద్ది నెలల పాటు యూరప్‌కు గ్యాస్ సరఫరా చేసే పరిస్థితి లేనే లేదని చెబుతున్నారు. చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం) -
గ్యాస్ సిలిండర్... గేట్ డెలివరీ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం వంట గ్యాస్ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ విధానంలో మార్పు చేశాయి. డోర్ డెలివరీకి బదులు ‘గేట్ డెలివరీ‘గా మార్చాయి. డోర్ డెలివరీ విధానంలో డెలివరీ బాయ్స్ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరమైనందున ‘గేట్ డెలివరీ’గా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సిబ్బంది, ప్రజలకు రక్షణ కోసం ఐఓసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చేస్తున్నాం. సిబ్బందికి, కస్టమర్ అటెండెంట్లకు స్టెరిలైజ్డ్ గ్లౌజులు, మాస్కులు , శానిటైజర్లు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే వాహనాలకు డిస్ఇన్ఫెక్టెడ్ రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం – ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ హెడ్ ఆర్ శ్రావణ్ ఎస్ రావు మొదట్లోనే ఆదేశించాం గ్యాస్ డెలివరీ బాయ్స్ శానిటైజ్డ్ గ్లౌజులు, మాస్కులు ధరించాలని, ఇళ్లలోకి సిలిండర్లు తీసుకెళ్లకుండా బయటే ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయిల్, గ్యాస్ కంపెనీల రాష్ట్రస్థాయి కమిటీ (ఎస్ఎల్సీ) సమన్వయ కమిటీ సమావేశంలో మొట్టమొదటే సూచనలు ఇచ్చాం. – రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్ ప్రజల కోసమే నిర్ణయం వినియోగదారులు, ప్రజల మేలు కోరే ఈ గేట్ డెలివరీ విధానం. డెలివరీ బాయ్స్‌కు వైరస్ సోకితే శరవేగంగా ఎక్కువమందికి వ్యాపించే ప్రమాదం ఉంది. బాయ్స్‌కు వైరస్ నుంచి రక్షణ కోసం స్టెరిలైజ్డ్ గ్లౌజులు, మాస్కులు సరిపడా ఇచ్చాం. – భారత్ గ్యాస్ ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ -
గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు
అక్కిరెడ్డిపాలెం: సిలిండర్‌లో గ్యాస్ ఉండటం లేదు. అయితే సిలిండర్ బరువు మాత్రం ఎంత ఉండాలో అంతే ఉంది. కానీ నెలున్నర రోజులు రావాల్సిన ఇండియన్ గ్యాస్ సిలిండర్ కేవలం 10 రోజులు మాత్రమే వచ్చింది. అనుమానంతో స్థానిక మహిళలు సిలిండర్‌ను కదిపి చూడగా నీళ్లు ఉన్న శబ్ధం రావడంతో సిలిండర్‌ను తిరగేశారు. ఇంకేముంది సిలిండర్ హెడ్ నుంచి నీళ్లు బయటకు చిందాయి. అక్కిరెడ్డిపాలెంలో ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఘటన ఇది. తమ పేరు చెబితే గ్యాస్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తారని సంబంధిత బాధితులు వివరాలు వెల్లడించలేదు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదని, గ్యాస్ సరఫరా చేస్తున్న వారిని అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిశ్చింతకు నోచేదెన్నడు?
సఖినేటిపల్లి/ మలికిపురం :కోనసీమ గుండెల్లో గుబులు కొనసాగుతూనే ఉంది. కలుగుల్లోని కాల సర్పాల్లా.. అంతటా పరుచుకుని ఉన్న చమురు, సహజవాయువుల పైపులైన్ల ‘బుసబుసలు’ ఆ గడ్డ చెవుల్లో కఠోరంగా మార్మోగుతూనే ఉన్నాయి. ఆ బుసబుసలు శాశ్వతంగా సద్దుమణగాలని, కాలయముని క్రోధాగ్ని లాంటి కీలలు మరోసారి తమ సీమలో రగలరాదని కోనసీమవాసులు గాఢంగా కోరుతున్నారు. నగరం గ్రామంలో 22 మందిని పొట్టన పెట్టుకున్న గెయిల్ ప్రధాన పైపులైన్ విస్ఫోటం అనంతరం కొంత కాలం గ్యాస్ ఉత్పత్తి, సరఫరా నిలిపి వేశారు. కోనసీమలో 300కి పైగా బావులుండగా ప్రస్తుతం మోరి జీసీఎస్ పరిధిలోని 30 బావుల్లో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. విస్ఫోటం అనంతరమూ పలు చోట్ల గ్యాస్ లీక్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి నిలిపివేసిన బావుల్లో ఒత్తిడి కారణంగా లీకవుతున్నాయి. బావుల క్యాప్‌లు శిథిలస్థితికి చేరడంతో బావి నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాయి. బావుల నుంచి గ్యాస్ సరఫరా అవుతున్న చోట పైపులైన్లు శిథిలావస్థకు చేరడం వల్ల లీకేజీలు సంభవిస్తున్నాయి. అలాగే చమురు బావులు, పైపులైన్ల లీకేజీ సంఘనలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. నగరం పైప్‌లైన్ విస్ఫోటం అనంతరం కేశనపల్లి, మోరి, అడవిపాలెం, తాటిపాక జీసీఎస్ల పరిధిలో సుమారు ఆరు ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్ లీకేజీ సంఘటనలు జరిగాయి. పలు చోట్ల ఇవి తక్కువస్థాయికే పరిమితమయ్యాయి. మరో ఘోరం జరక్క ముందే మేలుకోండి.. కోనసీమ ఎన్నటికీ మరిచిపోలేని పీడకలలాంటి నగరం విస్ఫోటం అనంతరం కూడా ఓఎన్జీసీ అధికారులు ఈ ప్రాంత ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బావుల పర్యవేక్షణ సరిగా ఉండడం లేదని, వెల్ క్యాప్‌లు, ఇతర పరికరాలు, పైపులైన్లు శిథిలస్థితికి చేరాయని, అయినా వాటిని తక్షణం మార్చే పూనిక కానరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జరగరానిది మరోసారి జరగకముందే.. ఓఎన్జీసీతో పాటు ప్రభుత్వాధికారులూ మేలుకోవాలంటున్నారు. కంటికి కునుకును, మనసుకు నిశ్చింతనూ కరువు చేస్తున్న లీకేజీలను వెంటనే అరికట్టాలని, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం
సాక్షి, రాజమండ్రి :మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గత జూన్‌లో జరిగిన పైపులైను పేలుడు ఘటన అనంతరం, గ్యాస్ సరఫరాను క్రమేపీ పునరుద్ధరిస్తున్నట్టు గెయిల్ జనరల్ మేనేజర్ ఎంవీ అయ్యర్ చెప్పారు. రాజమండ్రిలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 5.2 మిలియన్ క్యూబిక్ మీటర్లకుగాను 4.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఇప్పటికే జీవీకే, స్పెక్ట్రమ్ తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సరఫరా పునఃప్రారంభమైందన్నారు. తమవద్ద నుంచి 37 చిన్న సంస్థలు గ్యాస్ సరఫరా పొందుతున్నాయని, వీటిల్లో 23 సంస్థలకు గ్యాస్ సరఫరాను తిరిగి ప్రారంభించామని చెప్పారు. వారం రోజుల్లో మరో నాలుగైదు కంపెనీలకు, 15 రోజుల్లో పూర్తిస్థాయిలోను గ్యాస్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. నగరం పరిసర ప్రాంతాల్లో స్థానికుల కోసం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నగరం పైపులైను పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైందని, బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు గెయిల్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తమ పైపులైన్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరిచేందుకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. 600 పాఠశాలల్లో మరుగుదొడ్లు సామాజిక బాధ్యతలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 600 బాలికల పాఠశాలల్లో రూ.12 కోట్లతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని అయ్యర్ తెలిపారు. రెండు జిల్లాల్లోనూ 40 ఆర్వో ప్లాంట్ల కోసం ప్రతిపాదన లు సిద్ధం చేశామన్నారు. నగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.50లక్షలు అందిస్తున్నామని, ఇందులో రూ.20లక్షలు ఇప్పటికే చెల్లించామని చెప్పా రు. సమావేశంలో గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎల్.ఆర్ముగం, ఆశిష్ యాదవ్, మరో అధికారి విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు. -
సిలిండర్ల సరఫరా లోపం వల్లే గ్యాస్ కొరత
కంప్లి : సిలిండర్ల సరఫరా లోపం వల్లే గ్యాస్ కొరత ఏర్పడుతోందని శరత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కే.రవికుమార్ అన్నారు. వినియోగదారులు చేస్తున్న ఆరోపణలపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ ఏజెన్సీ కింద 16,500 మంది వినియోగదారులున్నారని, ప్రస్తుతం ప్రధాన కేంద్రం నుంచి నెలకు 10 వేల సిలిండర్లు రావాల్సి ఉందన్నారు. 2013 ఆగస్టులో తమకు 10424 సిలిండర్లు అందగా, 2014 ఆగస్టు నాటికి వాటి సంఖ్య 7,700లకు త గ్గిందని, దీంతో సమస్య ఉద్భవించిందన్నారు. ప్రతి నెల కుటుంబానికి ఒక సిలిండర్ అందించాలనే ఆదేశాలుండగా దానికి అనుగుణంగా తమకు సరఫరా లేదన్నారు. ప్రస్తుతం తాము ప్రతి కుటుంబానికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలంటే మధ్యాహ్న భోజన పథకం హాస్టళ్లు, పాఠశాలలతో కలిపి 10 వేల సిలిండర్లు అవసరమవుతుండగా, కేవలం 7,700 సిలెండర్లు మాత్రమే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య అక్టోబర్ వరకు తప్పదని గ్యాస్ ప్రధాన కేంద్రం ప్రకటించిందన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా కోసం 180 లారీలు అవసరముండగా, ప్రస్తుతం 60 లారీలు మాత్రమే ఉన్నందున సిలిండర్లు సకాలంలో అందడం లేదన్నారు. లారీలతో సప్లయ్ చేసేందుకు ఆగస్టు 26న టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సుమారు ఒకటిన్నర నెలపడుతుందన్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్లే పంపిణీ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్‌లో సిలిండర్ల అమ్మకం చేసే ప్రశ్నే లేదన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు వినియోగదారులుంటారని, ఆ నలుగురికి తాము నాలుగు సిలిండర్లు పంపిణీ చేస్తామని, వారి వద్ద అదనంగా సిలిండర్లు ఉన్నందున వారు అమ్ముకుంటే దానికి తాము బాధ్యులమా? అని ఎదురు ప్రశ్నించారు. -
ఖరీఫ్ ఎరువుకు గ్యాస్ దెబ్బ
నగరం పేలుడుతో మూతపడ్డ ఓఎన్జీసీ బావులు.. నిలిచిన గ్యాస్ సరఫరా గ్యాస్ సరఫరా లేక ఎరువులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి 20 రోజులుగా బ్రేక్ ఒక్క నాగార్జున కర్మాగారంలోనే నిలిచిపోయిన రోజుకు 5,000 టన్నుల ఉత్పత్తి ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా6 రాష్ట్రాలకు ఆగిన యూరియా సరఫరా ఆగస్టు వరకు విదేశీ యూరియా దిగుమతులు రావడం కష్టమే.. దిగుమతి చేసుకున్న ఎరువులతో కేంద్రంపై పెరగనున్న భారం ఈ ఖరీఫ్‌లో వ్యవసాయానికి యూరియా కటకట తప్పదు: యూరియా సంస్థలు విద్యుత్ ప్లాంట్లకూ గ్యాస్ కొరత దెబ్బ - 750 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ కాకినాడ: కృష్ణా - గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బావులు మూతపడటంతో.. గ్యాస్ సరఫరా లేక ఎరువుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులకు తీవ్ర కొరత ఎదురుకానుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) గ్యాస్ పైపులైన్ పేలుడుతో సహజ వాయువు ఉత్పత్తి చేసే సుమారు 70 ఓఎన్జీసీ బావులు మూతపడి మూడు వారాలైంది. దాంతో సహజ వాయువు సరఫరా నిలిచిపోయి, గ్యాస్‌పై ఆధారపడ్డ విద్యుత్, ఎరువుల ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. బావుల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని పైపులైన్ల నాణ్యతపై సర్వే చేస్తున్న ‘ఇంజనీర్స్ ఇండియా’ అభిప్రాయపడుతోంది. గ్యాస్ సరఫరా లేక ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ మూమెంట్స్ ఆర్డర్ ఆధారంగా జరగాల్సిన యూరియా సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా అవసరాల్లో దాదాపు సగం యూరియా కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం తీరుస్తుంటుంది. గ్యాస్ సరఫరా లేక యూరియా ఉత్పత్తి నిలిచిపోగా మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా కూడా ఆగస్టు నెలాఖరు వరకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు... గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు: గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బ్లోఅవుట్‌కు కారకులెవరు?
తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే ఇంక పీఎస్‌యూ నిర్వాహకులకు వాటిపై ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అలసత్వం, నిర్లక్ష్యం పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు! తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్‌ను సరఫరా చేసే ‘గెయిల్’ పైప్‌లైన్ బద్దలై సంభవించిన భీకరమైన విస్ఫోటనంలో అనేకమంది నిండు ప్రాణాలు కోల్పోయారు. సహజవనరులతో, పాడిపంటలతో, సుందరమైన ప్రకృతికి ఆలవాలమైన జిల్లాలో కొన్ని గ్రామాలను ఈ ఘోరకలి దఫదఫాలుగా కబళించుతూ రాష్ట్రాభివృద్ధికి, పర్యావరణ రక్షణకు పెద్ద చేటుగా మారింది. 1993 నుంచి తాజాగా నగరం గ్రామ దుర్ఘటనతో కలుపుకుని ఒకే జిల్లాలో గత 21 సంవత్సరాలలో ఏకంగా ఏడుసార్లు బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజి సంఘటనలు సంభవించాయి. తెలుగు గ్రామసీమల్లో తొలికోడి మేలుకొలుపులతోనే రైతులు, వ్యవసాయ కూలీలు, గృహిణులూ, తమతమ నిత్యవ్యాపకాల్లో మునిగిపోవడం సహజం. కాఫీలకూ, వంటకాలకూ పొద్దుపొడవకముందే పొయ్యి అంటించుకోవడం పల్లెల్లో సాధారణ దృశ్యం. కాని నగరం గ్రామంలో జరిగిన ఘోరకలికి ప్రభుత్వరంగ చమురు సహజవాయువు ఉత్పత్తి కంపెనీ ఓఎన్జీసీ, ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను సరఫరా చేసే మరో ప్రభుత్వరంగ కంపెనీ ‘గెయిల్’ తమ నిర్వహణ లోపాలకు దేనికదే గ్రామస్తులపైకి నెట్టే పనిలో ఉన్నాయి! అసలు లీకేజీకి బాధ్యత తమది కాదన్నట్టుగా, ‘దాసుడి తప్పు దణ్ణంతో సరి’ అన్న చందంగా ఒక సామాన్య ‘టీ’ దుకాణదారుడు ‘స్టవ్’ వెలిగించినందువల్లనే ఈ పేలుడు సంభవించిందని చెప్పి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుతో సరిపెట్టుకుందామని ఈ సంస్థలు చూస్తున్నాయి! మాడి, మసైపోయిన కుటుంబాలకు పరిహార చెల్లింపులతో చేతులు దులుపుకోవడం ధనికవర్గ వ్యవస్థలో ఒక క్రూరమైన జోక్! అంతేగాని, తాజా ఘటనకు సంబంధించి గ్రామస్తులు గత రెండు మాసాలనాడే ఇదే పైప్‌లైన్‌వల్ల లీకేజీ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ లైన్‌ను తాత్కాలికంగా సర్దుబాటు చేసి వెళ్లారేగాని, మళ్లీ దానివైపు చూసిన పాపాన పోలేదనీ, ఫలితంగా అదే పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వెల్లడించారు. అంటే లీక్ అయిన గ్యాస్ క్రమంగా పరిసరాలలో వ్యాపించిపోయి ఉంది. ఆ సమయంలో ‘టీ’ దుకాణదారు ఇంట్లో ఉన్న పొయ్యికీ దీనికీ సంబం ధం లేదు. కాని ఆ సమయంలో పొయ్యి అంటించబోగా భగ్గుమని మంటలు రావడానికి కారణం అప్పటికే పైప్‌లైన్ నుంచి లీకయి వాతావరణంలో వ్యాపిం చిన గ్యాస్ వెంటనే అంటుకుందని అర్థమవుతుంది. పైగా పాశ్చాత్య దేశాల్లో గ్రామాల మధ్యనుంచో, గ్రామాలను ఆనుకునే గ్యాస్ పైప్లైన్లు వేయరనీ, గ్రామాలకు 5-6 కిలోమీటర్ల దూరంగా ఈ లైన్లు పరుస్తారని నిపుణులు చెపుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిమిత నష్టం పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు సంభవించవని కాదు. అయితే అవి ఎక్కువ భాగం కోస్తా తీరానికి దూరంగా సముద్రంతర వేదికలు ఆధారంగా డ్రిల్లింగ్‌లు, ప్రయోగాలు, లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో భారీ విస్ఫోటనాలు సంభవిస్తాయి. అలాంటివి ఆస్ట్రేలియా, నార్వే, నార్త్ సీ ప్రాంతాల్లో జరిగాయి. ఆ ప్రయోగాలు, డ్రిల్లింగ్లూ గ్రామాలనూ, కుటుంబాలనూ బూడిదపాలు చేయలేదు, శ్మశానవాటికలుగా మార్చలేదు. కాని ఇండియాలో మాత్రం ‘గెయిల్’, ఓఎన్జీసీ సంస్థలు ఇందుకు సంబంధించి అంతర్జాతీయ భద్రత, రక్షణ ప్రమాణాల నిబంధనలను పాటించడం లేదు. పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఆయిల్ పరిశ్రమ ‘‘భద్రతాధికార సంస్థ’’(ఓఐఎస్డీ) నిబంధనలనూ పాటించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ ప్రాధికార సంస్థ అయిన ‘సేఫ్టీ డెరైక్టరేట్’ పెట్రోలియం-గ్యాస్ మంత్రివర్గం కనుసన్నల్లోనే పనిచేయాలి! భద్రతా ప్రమాణాలు గాలికి 2009లో మరొక ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జైపూర్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో డజను మంది ఆహుతి అయినప్పుడు ఆయిల్ పరిశ్రమ తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ప్రత్యేక సదస్సు జరిగినా ఫలితం లేకపోయింది. ఆయిల్ పరిశ్రమల నిర్మాణం, నిర్వహణ సమయాలలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రూపొందించిన సాధికారమైన ప్రమాణాలను పాటించడంలో ప్రభుత్వరంగ సంస్థలు విఫలమవుతున్నాయని చమురు పరిశ్రమ నిపుణులు పలుసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ‘గెయిల్’, ఓఎన్జీసీ కంపెనీలు తరచుగా ఆ ప్రమాణాలను పాటించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వ విధానాల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. 1991లో ప్రపంచబ్యాంకు రుద్దిన ప్రజావ్యతిరేక సంస్కరణలను బేషరతుగా కేం ద్రం ఆమోదించింది లగాయతు నియంత్రణ వ్యవస్థ నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుని కేవలం దేశ, బహుళజాతి కంపెనీలకు ‘బ్రోకర్’గా పని చేయసాగింది. ఫలితంగా ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు అంతకుముం దు ‘నవరత్నాల’లో భాగంగా ఉన్నా, ఆ సంస్థలలోని ప్రభుత్వ, అంటే ప్రజల వాటా ధనాన్ని కాస్తా క్రమంగా విదేశీ కంపెనీలకు, లేదా రిలయ న్స్ లాంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలకు అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీలపై ప్రభుత్వానికి నియంత్రణ, అధికారాలు సడలిపోయాయి. ఆ సంస్థల లాభాలు కాస్తా ప్రైవేట్ కంపెనీల పరమవుతున్నాయి. విదేశీ దిగ్గజాలకు ఎర్రతివాచీ ప్రపంచంలో పెట్రోలియం, గ్యాస్ వనరులపై కన్నుపడడం అనేది ఓ భారీ వ్యాపారం. ఇందులో బహుళజాతి కార్పొరేట్ కంపెనీల పాత్ర పెద్దది. ఈ వనరుల కోసమే, వాటిమీద ‘భల్లూకపు’ పట్టు సాధించడం కోసమే అఫ్ఘానిస్థాన్, ఇరాక్, తదితర పశ్చిమాసియా, మధ్యాసియా గ్యాస్ నిల్వల కోసం యుద్ధాలే జరిగాయి, జరుగుతున్నాయి! అలాగే మన దేశం లోని ఆయిల్ సంపదపై విదేశీ కంపెనీల పెత్తనానికి ద్వారాలు తెరిచింది కాంగ్రెస్, యునెటైడ్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాలేనని మరచిపోరాదు. వీటిలో యూపీఏ, ఎన్డీఏలది ప్రధాన పాత్ర. ఈ రెండు ప్రధాన కూటములూ విదేశీ ఆయిల్ కంపెనీల ఒత్తిళ్లకు లొంగిపోయి, దేశీయంగా చమురు ఉత్పత్తికి గండికొట్టాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలను కుంటుపరిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. విదేశీ కంపెనీలకు, వారితో మిలాఖత్ అయిన రిలయన్స్ లాంటి ఒకటి రెండు దేశీయ కుబేర కంపెనీలు వాళ్ల ఇష్టమొచ్చినట్లు ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల ధరలను ఏకపక్షంగా నిర్ణయించి ప్రజలపై రుద్దే శక్తినీ ఇచ్చాయి! 1998లో కిరోసిన్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీలను ఉపసంహరించిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుదే. ‘గెయిల్’ కింద నిర్వహిస్తున్న ప్రధాన గ్యాస్ క్షేత్రాలలో షేర్లను 18 శాతం పైగా విదేశీ కంపెనీ ‘ఎన్రాన్’కు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్‌కు అమ్మేసింది బీజేపీయే. చివరికి గ్యాస్‌ను మండించడానికి సైతం ప్రపంచ బ్యాంకు నుంచి రుణంకోసం అంగలార్చిందీ ప్రభుత్వ ఆయిల్ సంస్థే! తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను ఇలా నిర్వీర్యం చేసి, వాటిలోని ప్రజాధనాన్ని కాస్తా తక్కువ శాతానికి వాటాల రూపంలో విదేశీ, స్వదేశీ గుత్త కంపెనీలకు ధారాదత్తం చేసిన తర్వాత ఇంక పీఎస్‌యూల నిర్వాహకులకు ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అల సత్వం, నిర్లక్ష్యం, పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
పచ్చని కోనలో ఆరని చిచ్చు
-
‘క్యాంపాకోలా’కు పెరుగుతున్న మద్దతు
సాక్షి, ముంబై: క్యాంపాకోలా వాసులకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడ అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లలో ఉంటున్నవారిని ఖాళీ చేయించేందుకు, వారికి నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరాను నిలిపివేసేందుకు బీఎంసీ అధికారులు శుక్రవారం క్యాంపాకోలా కాంపౌండ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వీరిని అడ్డుకునేందుకు ఆర్పీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శనివారం కూడా బీఎంసీ అధికారులు కాస్త హడావుడి చేసినా రాజకీయ నాయకులతోపాటు సామాజిక కార్యకర్తలు కూడా వచ్చి మద్దతు పలకడంతో అధికారులు రెండో రోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది. స్థానికులకు కొంత ఊరట లభించినట్లయింది. అయితే క్యాంపాకోలాపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన బీఎంసీ అధికారులను అడ్డుకున్నందుకుగాను పలువురిపై వర్లీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే బీఎంసీ అధికారులు వ్యవహరించినా, కోర్టు ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకోవడమంటే కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ముందునుంచి పక్కా ప్రణాళికతో ఉన్న క్యాంపాకోలావాసులు బీఎంసి అధికారులు లోపలికి చొరబడకుండా గేట్బయటే అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇలా విధులను అడ్డుకున్నందుకుగాను పలువురిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 143, సెక్షన్ 353ల ప్రకారం వర్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందునుంచే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించిన బీఎంసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం ఇక్కడ ఉధ్రిక్త వాతావరణం కనిపించింది. అయితే శనివారం పోలీసు బందోబస్తును ఉపసంహరించడంతో బీఎంసీ అధికారులు వెనక్కు తగ్గారని భావించారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం తమ ఆందోళనను కొనసాగించారు. వీరికి మద్దతు పలికేందుకు ముంబై మాజీ కమిషనర్ ఖైర్నార్తోపాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సైనా ఎన్సీ కూడా వచ్చారు. దీంతో ఆందోళనకారుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. సోమవారం వరకు నో టెన్షన్...? ఆదివారం సెలవుదినం కావడంతో బీఎంసీ అధికారులు వచ్చే అవకాశం లేదని, అయితే సోమవారం మాత్రం ఎలాగైనా ఖాళీ చేయించాలనే వ్యూహంతో అధికారులు రావొచ్చనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేశారు. దీంతో తామంతా పట్టుసడలించకుండా నివాసాలను కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉంటామని క్యాంపాకోలా వాసులు శనివారం ప్రతిజ్ఞ చేశారు. -
క్యూఐబీ ద్వారా జీవీకే 1,000 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ. 694 కోట్ల ఆదాయంపై రూ.235 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 500 కోట్ల ఆదాయంపై రూ. 171 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. తగినంత గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయకపోవడం, అధిక వడ్డీరేట్లు నష్టాలు పెరగడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది. 2013-14 పూర్తికాలానికి రూ. 2,820 కోట్ల ఆదాయంపై రూ. 369 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించగా, అంతక్రితం ఏడాది రూ. 2,608 కోట్ల ఆదాయంపై రూ. 336 కోట్ల నికర నష్టం వచ్చింది. ఎయిర్పోర్ట్ విభాగం తప్ప విద్యుత్, రహదారుల విభాగాలు నష్టాల్లోనే ఉన్నాయి. క్యూ4లో ఎయిర్పోర్ట్ విభాగం లాభాలు రూ. 155 కోట్ల నుంచి రూ. 211 కోట్లకు పెరిగింది. క్యూఐబీకి ఓకే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు వాటాలను విక్రయించడం ద్వారా గరిష్టంగా రూ. 1,000 కోట్ల వరకు మూలధనం సమీకరించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులోనే గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.500 కోట్లు సేకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. -
బుక్ చేసి 20 రోజులైనా సరఫరాకాని సిలిండర్లు
-
ఎన్టీపీసీ భారీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపైనా దృష్టిపెట్టింది. బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లనే కొంటామని, అందుకు తగినన్ని నిధులు ఉన్నాయని సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే... సోలార్ ప్లాంట్ల గురించి.... 12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే అండమాన్‌లోని పోర్ట్బ్లెయిర్లో మొదటిసారిగా 5 మెగావాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించాం. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ వద్ద మరో 5 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించాం. అదేవిధంగా రామగుండంతో పాటు ఒడిశ్సాలోని తాల్చేరు, ఉత్తరప్రదేశ్‌లోని ఉంచాహార్లో చెరో 10 మెగావాట్లు, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ వద్ద 50 మెగావాట్లు.. మొదలైనవి చేపడుతున్నాం. మొత్తంగా 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపై.... దేశంలో వివిధ దశల్లో ఉన్న ప్లాంట్ల కొనుగోలుపై దృష్టి పెడుతున్నాం. ఇందులో నిర్మాణం పూర్తై, నిర్మాణ దశలో ఉన్న వాటితో పాటు పాత విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. సుమారు 7 ప్లాంట్లపై దృష్టి సారించాం. ఇవన్నీ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లే. అయితే, ఏయే ప్లాంట్లు అన్న విషయాన్నీ ఇంకా ఈ సమయంలో బహిరంగపరచలేం. ఒక్కటి మాత్రం చెప్పగలను... బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తాం. ఇందుకు నిధుల కొరత సమస్య కాదు. గ్యాస్ సమస్యలపై... కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ సరఫరా తగ్గడం అందరికీ తెలిసిందే. మా మొత్తం సామర్థ్యం 42,500 మెగావాట్లలో గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 10%. గ్యాస్ కొరతతో వివిధ ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. కేవలం 8.47% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో నడుస్తున్నాయి. గ్యాస్ కొరతను తీర్చుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తాం. సొంతంగా గ్యాస్ బ్లాకులు ఉంటే ఎంతో ఉపయోగం. గ్యాస్ బ్లాకులను దక్కించుకునేందుకు నూతన అన్వేషణ విధానం(నెల్ప్) బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్నీ పరిశీలిస్తున్నాం. గ్యాస్ ధర పెరుగుదలతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. అలాంటి సమయంలో గ్యాస్ ఆధారిత విద్యు త్ చార్జీలను వినియోగదారులు భరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. సొంత బొగ్గు గనుల గురించి... ప్రస్తుతం మేం 50 మిలియన్ టన్నుల నుంచి 60 మిలియన్ టన్నుల మేరకు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటాం. సొంతంగా బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాం. జార్ఖండ్‌లో మాకు దక్కిన గనిలో బొగ్గు వెలికితీతకు అంతా సిద్ధంగా ఉంది. అయితే, స్థానిక సమస్యల కారణంగా బొగ్గును వెలికితీయలేకపోతున్నాం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందితే అది సాధ్యమవుతుంది. దీనిపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల విస్తరణపై.... ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విద్యుత్ ప్లాంట్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇందుకు మాకు అవసరమైన భూమి, నీరు ఉన్నాయి. అయితే, బొగ్గు సరఫరా ప్రధాన సమస్య. బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా వెంటనే చేపడతాం. విశాఖపట్నం సమీపంలో పూడిమడక వద్ద 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్లాంటుకు బొగ్గు సరఫరా లేదు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని ప్లాంటును నడిపేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగిలిన మూడు రాష్ట్రాలూ ఒప్పుకున్నాయి. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తాం. భూసేకరణ చేపట్టి ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.