సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం వంట గ్యాస్ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ విధానంలో మార్పు చేశాయి. డోర్ డెలివరీకి బదులు ‘గేట్ డెలివరీ‘గా మార్చాయి. డోర్ డెలివరీ విధానంలో డెలివరీ బాయ్స్ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరమైనందున ‘గేట్ డెలివరీ’గా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
సిబ్బంది, ప్రజలకు రక్షణ కోసం ఐఓసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చేస్తున్నాం. సిబ్బందికి, కస్టమర్ అటెండెంట్లకు స్టెరిలైజ్డ్ గ్లౌజులు, మాస్కులు , శానిటైజర్లు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే వాహనాలకు డిస్‌ఇన్‌ఫెక్టెడ్ రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం
– ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ హెడ్ ఆర్ శ్రావణ్ ఎస్ రావు
మొదట్లోనే ఆదేశించాం
గ్యాస్ డెలివరీ బాయ్స్ శానిటైజ్డ్ గ్లౌజులు, మాస్కులు ధరించాలని, ఇళ్లలోకి సిలిండర్లు తీసుకెళ్లకుండా బయటే ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయిల్, గ్యాస్ కంపెనీల రాష్ట్రస్థాయి కమిటీ (ఎస్‌ఎల్‌సీ) సమన్వయ కమిటీ సమావేశంలో మొట్టమొదటే
సూచనలు ఇచ్చాం.
– రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్
ప్రజల కోసమే నిర్ణయం
వినియోగదారులు, ప్రజల మేలు కోరే ఈ గేట్ డెలివరీ విధానం. డెలివరీ బాయ్స్‌కు వైరస్ సోకితే శరవేగంగా ఎక్కువమందికి వ్యాపించే ప్రమాదం ఉంది. బాయ్స్‌కు వైరస్ నుంచి రక్షణ కోసం స్టెరిలైజ్డ్ గ్లౌజులు, మాస్కులు సరిపడా ఇచ్చాం.
– భారత్ గ్యాస్ ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment