Kona Shashidhar
-
ఏపీకి 16 కేంద్ర అవార్డులు
సాక్షి, అమరావతి: ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16 దక్కించుకుని సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజును ప్రభుత్వాలు ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు/అధికారులకు ఈ నెల 24న అవార్డులు అందజేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పాలి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆన్లైన్ విధానం ద్వారా ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ అవార్డుల కింద కేంద్రం జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 నుంచి రూ.16 లక్షలు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. -
ఈ–కేవైసీపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు!
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ)పై కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. ఈ–కేవైసీపై రేషన్ లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కరపత్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. రేషన్ పంపిణీ చేసే వలంటీర్లు అవగాహన కల్పిస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ–కేవైసీ నమోదు బియ్యం కార్డుల తొలగింపు ప్రక్రియ కాదని, ఆధార్ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,102 ఆధార్ కేంద్రాలున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ–కేవైసీపై బియ్యం కార్డుదారులకున్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బియ్యుంకార్డులోని ప్రతి సభ్యుడూ కచ్చితంగా ఈ–కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా ఏమి పేర్కొన్నారంటే.. ► కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ–కేవైసీ చేయించుకున్న లబ్ధిదారులు నిత్యావసర రేషన్ వస్తువుల్ని దేశంలో ఎక్కడి నుంచి అయినా పొందవచ్చు. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనమూ పొందవచ్చు. ► వేలి ముద్రలు సరిగా పడని వారు వారి చౌక ధరల దుకాణం వద్ద ఈ–పోస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ► వలంటీర్, చౌక ధరల దుకాణాల వద్ద ఈ–కేవైసీ నమోదు కాకపోతే మాత్రమే ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాలి. ► ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన వారిలో దాదాపు 80 శాతం మంది గ్రామ, వార్డు వలంటీర్ వద్ద చేయించుకోవచ్చు. ► 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ–కేవైసీ అవసరం లేదు. 5 నుంచి 15 ఏళ్ల లోపు వారికి వచ్చే నెలాఖరు లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి ► మిగతావారందరూ ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి ► పరిస్థితిని బట్టి గడువు పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
ఎవరి బియ్యం కార్డూ రద్దు కాదు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ) కోసం హైరానా పడాల్సిన పని లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. బియ్యం కార్డుల్లోని పేర్ల అనుసంధానం కోసం ఆధార్ సెంటర్లకు పోవాల్సిన పని లేదని, సమీపంలోని వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదిస్తే సరిపోతుందని ఆయన బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. 80 శాతానికి పైగా సమస్యలు వలంటీర్లు, వీఆర్వోల వద్దనే పరిష్కారం అవుతాయని వివరించారు. ఎవరి కార్డులూ రద్దు కాబోవని, ఆధార్‌తో అనుసంధానం అయిన రోజు నుంచే బియ్యం తీసుకోవచ్చన్నారు. ఏ లబ్ధిదారుడికీ బియ్యం ఎగ్గొట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదించిన తర్వాతే ఆధార్ సెంటర్లకు వెళ్లాలని సలహా ఇచ్చారు. కొత్తగా ఆధార్ కార్డు కావాల్సిన వారో, ఇతరత్రా మార్పులు చేర్పులు చేయించుకోదలచిన వారు మాత్రమే ఆధార్ సెంటర్లకు వెళ్లాలన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆధార్ సెంటర్ల వద్ద జనం గుమికూడకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లాల జాయింట్ కలెక్టర్లను కోరినట్టు కోన శశిధర్ తెలిపారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులందరితో ఈకేవైసీ నమోదు చేయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, దానికనుగుణంగానే తామూ రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇప్పించి గడువు పెట్టామని వివరించారు. ‘రాష్ట్రంలో సుమారు 1.48 కోట్ల బియ్యం కార్డుల ద్వారా 4.31 కోట్ల మంది వరకు లబ్ధి పొందుతున్నారు. వీరిలో 85 శాతం మంది ఈ–కేవైసీ చేసుకున్నారు. ఇంకా 35 లక్షల మంది నమోదు చేయించుకోవాల్సి ఉంది. వీరిలో ఇప్పటికి 12 లక్షల మంది చేయించుకున్నారు. ఈ నెలాఖరులోగా మరికొంత మంది చేయించుకుంటారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉంది. పెద్దలు మాత్రం ఆగస్టు నెలాఖరులోగా చేయించుకోవాలి.’ అని శశిధర్ కోరారు. రేషన్ కార్డుల్లో పేర్లున్న వారికే ఆధార్‌తో అనుసంధానం అవసరమన్నారు. వేలి ముద్రలు పడని వారు కూడా ఆధార్ సెంటర్లకు పోవాల్సిన పని లేదని, సమీపంలోని చౌకధరల దుకాణం లేదా ఎంపీడీవోల వద్ద ఉండే ఈ–పాస్ యంత్రాల్లో వేలి ముద్రలు వేయవచ్చన్నారు. రెండు చేతులకూ కలిపి 70, 80 శాతం వేలి ముద్రలు సరిపోలితే చాలని వివరించారు. -
ఈ-కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఈ–కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని ఆయన వెల్లడించారు. ఈ-కేవైసీ చేసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని, ప్రజలు.. ఆధార్, మీ–సేవ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో కోన శశిధర్ ఈ మేరకు స్పందించారు. చదవండి: లోకేశ్ హైడ్రామా.. పథకాలు పక్కదోవ పట్టించడానికే -
రి‘కార్డు’ వేగం: దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా ఇంటికే రేషన్ కార్డులు
సాక్షి, అమరావతి: వివాహితుడైన వీర వెంకటశివ విడిగా రేషన్ కార్డు కావాలని గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా నిరాశే మిగిలింది. ఇప్పుడు 15 రోజుల్లోనే ఆయన చేతికి బియ్యం కార్డు వచ్చింది. రెండేళ్ల పాటు ప్రయత్నించి విసిగి వేసారిపోయిన స్వరూప వలంటీర్ సాయంతో సచివాలయంలో కార్డు అందుకుంది. అర్హులైనప్పటికీ మంజూరు కాక నిస్పృహకు గురైన ఎంతోమంది పేదలు ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దే బియ్యం కార్డులు అందుకోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతృప్త స్థాయిలో.. అర్హులైన ఎందరో పేదలు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుకు కూడా నోచుకోలేదు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ముడుపులు చెల్లించినా ఫలితం దక్కలేదు. వివాహం తరువాత విడిగా కాపురాలు ఉంటున్న లక్షల మంది గోడును టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఎంతసేపూ కార్డులను ఎలా తగ్గించాలనే అంశంపైనే దృష్టి పెట్టి పేదలకు పట్టెడన్నం పెడదామనే ఆలోచనే చేయలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇలాంటి కష్టాలను స్వయంగా చూశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ నవశకం ద్వారా వలంటీర్లతో ఇంటింటి సర్వేను నిర్వహించారు. బియ్యం కార్డు అర్హత ఆర్ధిక పరిమితి పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా బియ్యానికి ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేశారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో కొత్త బియ్యం కార్డులను మంజూరు చేశారు. అంతే కాదు.. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా వెంటనే పరిశీలించి బియ్యం కార్డు మంజూరు చేసేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు చేశారు. నిర్దిష్ట వ్యవధి నిర్ణయించి అమలు.. సంక్షేమ పథకాల అమల్లో గత ఏడాది జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా బియ్యం, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి స్థలం మంజూరుకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ధారించి పక్కాగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 13 నెలల వ్యవధిలో గత ఏడాది జూన్ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై 15వతేదీ వరకు 16.45 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులను మంజూరు చేశారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అర్హులకు బియ్యం కార్డు మంజూరు చేయాలనే నిబంధన అమలు చేస్తున్నారు. దీంతో పేదలకు కొత్త బియ్యం కార్డులతో పాటు పెళ్లి తరువాత వేరు కాపురం ఉంటున్న దంపతులకు కొత్త కార్డులు సకాలంలో మంజూరవుతున్నాయి. అలాగే వారికి పిల్లలు పుట్టినా లేదా తల్లిదండ్రులు గతంలో ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇప్పుడు వారి వద్దకు వచ్చినా సరే పేర్లను నమోదు చేస్తున్నారు. అర్హత ఉంటే చాలు కార్డు మంజూరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల గత రెండేళ్లపైగా ఎక్కడా రేషన్ కార్డు లేదని, ఇవ్వడం లేదనే మాటే వినిపించడం లేదు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అర్హులకు వారి గ్రామాల్లోనే సచివాలయాల్లో కార్డులు మంజూరు అవుతున్నాయి. పది రోజుల్లోనే... వివాహం కావడంతో రేషన్ కార్డు కోసం గ్రామ వలంటీరును సంప్రదించా. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు దరఖాస్తు అందచేసిన పది రోజుల్లోనే కార్డు మంజూరైందని తెలియడంతో ఆశ్చర్యం కలిగింది. రేషన్‌కార్డుతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ జాబ్ కార్డులు కూడా వారం వ్యవధిలోనే మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలా కార్డులు అందిన దాఖలాలు లేవని అంతా చెబుతున్నారు. –తామరి రాధాకృష్ణ, చింతలవీధి, పాడేరు మండలం, విశాఖ జిల్లా 15 రోజుల్లోనే వచ్చింది... నాకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు అబ్బాయిలు. గత ప్రభుత్వ హయాంలో మా కుటుంబానికి విడిగా రేషన్ కార్డు కోసం ఎంతో ప్రయత్నించా. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగినా పని కాలేదు. ఇప్పుడు వలంటీర్ మా ఇంటికి వచ్చి దరఖాస్తు చేయించారు. 15 రోజుల్లోనే రేషన్ కార్డు మంజూరు కావడంతో ఎంతో సంతోషంగా ఉంది. – గుర్రాల వీర వెంకట శివ, ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా రెండుసార్లు రాని కార్డు 27 రోజుల్లోనే.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 27 రోజుల్లోనే మంజూరైంది. టీడీపీ హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏడాది పాటు ప్రదక్షిణలు చేసినా రేషన్ కార్డు రాలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్ మా ఇంటికే వచ్చి దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసిన 27 రోజుల్లోనే సచివాలయంలో కార్డు అందుకున్నా. –ఈ. స్వరూప (జోగంపేట, నర్సీపట్నం నియోజకవర్గం, విశాఖ జిల్లా) అర్హులకు ఇవ్వకుండా ఎలా ఉండగలం? గతంలో ఎప్పుడూ వివాహం తరువాత వేరు కాపురం ఉంటున్న వారికి కొత్తగా కార్డులు మంజూరు చేయలేదు. దీనివల్ల ప్రభుత్వంపై భారం పడుతుందన్న వాదనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభేదించారు. వివాహం అయిన తరువాత విడిగా ఉంటున్న వారు అర్హులా.. కాదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హులేనని తెలియచేయడంతో వారికి కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారం పడుతోందనే సాకుతో అర్హులకు ఇవ్వకుండా ఎలా ఉంటామని సీఎం ప్రశ్నించారు. దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నాం. కంప్యూటర్ డేటా ప్రకారం పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. – కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
ధాన్యం రైతుకు డబ్బులు!
సాక్షి, అమరావతి: ధాన్యం రైతన్నలకు శుభవార్త! కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ అన్నదాతలకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1,600 కోట్లను విడుదల చేసింది. ధాన్యం కొనుగోలు చేసి 21 రోజులు దాటిన రైతుల ఖాతాలకు రూ.1,207 కోట్లను బుధవారం నుంచి జమ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. మిగిలిన రైతులకు కూడా సకాలంలో చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం బకాయిపడిన రూ.5,056.76 కోట్లను ఇంకా విడుదల చేయనప్పటికీ, కరోనా ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక సమస్యలున్నా రైతన్నలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేస్తుండటాన్ని రైతు సంఘాల నేతలు ప్రశంసిస్తున్నారు. కళ్లాల వద్దే కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర దక్కడంతోపాటూ రవాణా ఖర్చుల రూపంలో క్వింటాలుకు రూ.వంద వరకూ ఆదా అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రైతులకు బకాయిపడిన రూ.4,838.03 కోట్లను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేసుకుంటున్నారు. 35.40 లక్షల టన్నులు కొనుగోలు... రబీలో 21.75 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా భారీ ఎత్తున కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. ధాన్యాన్ని సాధారణ రకం టన్ను రూ.1,868, ఏ–గ్రేడ్ రకం రూ.1,888 చొప్పున కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం వల్ల మిల్లర్లు, వ్యాపారులు అదే ధరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కళ్లాల వద్దే 2,90,203 మంది రైతుల నుంచి 35,40,573.96 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం బకాయిలు విడుదల కాకున్నా.. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి బియ్యం రాయితీ రూపంలో పౌరసరఫరాల శాఖకు కేంద్రం రూ.5,056.76 కోట్లు బకాయిపడింది. రబీలో భారీ ఎత్తున రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, బకాయిలు విడుదల చేస్తే సకాలంలో చెల్లింపులు చేస్తామని జూన్ 11న ఢిల్లీలో కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. అయితే కేంద్రం నుంచి బకాయిల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ఖజానా నుంచి, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేశారు. రబీలో ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.6,628.34 కోట్లు కాగా ఇప్పటికే రూ.3,266.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించింది. ఇందులో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల లోపు జరిపిన చెల్లింపులు రూ.1,637 కోట్లు ఉండడం గమనార్హం. రైతన్నలు ఇబ్బంది పడకుండా.. ధాన్యం రైతులకు ఇంకా రూ.3,361.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ధాన్యం విక్రయించి 21 రోజులు పూర్తయిన రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,207 కోట్లు ఉంది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నాబార్డు నుంచి రుణం తీసుకుని రైతులకు చెల్లింపులు చేయాలని పౌరసరఫరాలశాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ.1,600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నాబార్డు నిధులను విడుదల చేయడంతో బుధవారం నుంచి రైతులకు చెల్లింపులు జరిపేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. నాడు దళారులు, మిల్లర్లు చెప్పిందే ధర.. టీడీపీ అధికారంలో ఉండగా జూన్ 2014 నుంచి మే 2019 వరకూ ఏనాడూ సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అరకొర కొనుగోళ్లకూ చెల్లింపులు చేయకుండా మూడు నుంచి ఆర్నెళ్ల పాటు జాప్యం చేసింది. దీంతో దళారులు, మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని సేకరించి రైతుల శ్రమను దోపిడీ చేశారు. 2018–19 రబీలో కొనుగోలు చేసిన 27.52 లక్షల టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.4,838.03 కోట్లను నాటి సీఎం చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించి రైతులను ముంచేశారు. ఆ బకాయిలను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక చెల్లించారు. రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల ధాన్యం కొనుగోలు.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రబీ, ఖరీఫ్‌తో కలిపి రూ.37,698.77 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనడం గమనార్హం. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు రైతులకు సకాలంలో రూ.32,009.45 కోట్లను చెల్లించింది. మిగతా రూ.3,361.64 కోట్లను కూడా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. -
ఉచిత బియ్యం పంపిణీతో రూ.2,100 కోట్ల భారం
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద జూలై నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,100 కోట్ల భారం పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన సార్టెక్స్ బియ్యం నిల్వలు సరిపడాలేవని.. ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. అయితే, సార్టెక్స్ బియ్యం, ఎఫ్‌సీఐ నుంచి నాన్ సార్టెక్స్ బియ్యం ఒకేసారి డోర్ డెలివరీ సాధ్యం కాదని కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సార్టెక్స్ బియ్యం, పంచదార, కందిపప్పు ఇంటి వద్దకే డోర్ డెలివరీ జూలై 1 నుంచి యథావిధిగా జరుగుతుందని.. ఏ మార్పు ఉండదన్నారు. అలాగే, ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసిన నాన్ సార్టెక్స్ బియ్యాన్ని నెలలో 15 నుంచి రేషన్ దుకాణాల వద్ద ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ విధానం నవంబర్ వరకు కొనసాగుతుందన్నారు. ఇక పీఎంజీకేఏవై పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత రేషన్ దుకాణాల వద్ద ఎటువంటి సరుకుల పంపిణీ జరగదని స్పష్టంచేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,100 కోట్ల వ్యయాన్ని భరించి పీఎంజీకేఏవై, ప్రజాపంపిణీ పథకాల ద్వారా బియ్యం, కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. ఈ ఏడాది మే, జూన్‌లో ఆహార భద్రతా చట్టం కార్డుల్లో ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున ఉచితంగా బియ్యమివ్వాలని కేంద్రం ఆదేశించిందని.. ఇందుకు రాష్ట్రం రూ.789 కోట్లు వ్యయం చేసిందన్నారు. -
ధాన్యం కొనుగోలు: రూ.1,637 కోట్లు రైతులకు చెల్లింపు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలుపై రూ.1,637 కోట్లు రైతులకు చెల్లించామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇకపై రోజుకు రూ.200 కోట్ల వంతున రైతులకు చెల్లించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్రం నుంచి 3,299 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఫ్రీ ఆడిట్ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము చెల్లింపు ఏర్పాటు చేశామన్నారు. బకాయిలపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రబీలో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 28 లక్షల 36వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తి చేసినట్లు కోన శశిధర్ చెప్పారు. చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ -
కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. కోవిడ్ ఉధృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ యంత్రాంగమే తమ ముంగిటకు వచ్చి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోతలు ముందుగా ప్రారంభమైన పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6,731 మంది రైతుల నుంచి రూ.181.07 కోట్ల విలువైన 96,916 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నెల్లూరు జిల్లాలో 3,398 మంది రైతుల నుంచి రూ.90.20 కోట్ల విలువైన 47,807 టన్నులు, ప్రకాశం జిల్లాలో 1,514మంది రైతుల నుంచి రూ.23.52 కోట్ల విలువైన 12,506 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. ఈ మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే రూ.294.79 కోట్ల విలువైన 1,57,229 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో వరి సాగు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో 23,61,937 ఎకరాల్లో వరి సాగయ్యింది. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున సుమారు 66.37 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో కనీసం 45లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న రబీ ధాన్యంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 48 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మాసూళ్లను పూర్తి చేసిన రైతులు ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ‘కృష్ణా’లో అత్యధికంగా 428 కేంద్రాలు ఇప్పటివరకు 50 వేల మంది రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోగా.. వీటికి అనుబంధంగా ఏర్పాటు చేసిన 1,552 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రేడ్–ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,880, కామన్ వెరైటీ ధాన్యానికి రూ.1,860 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేయగా, తూర్పు గోదావరిలో 373, పశ్చిమ గోదావరిలో 350, నెల్లూరు జిల్లాలో 183, ప్రకాశం జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 67, కడపలో 6, విజయనగరంలో ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా.. వరుసగా రెండో ఏడాది కూడా సాగునీరు పుష్కలంగా ఇవ్వడంతో గత రబీతో పోలిస్తే ఈ ఏడాది రబీలో సాగు విస్తీర్ణం పెరిగింది. మంచి దిగుబడులొస్తాయని అంచనా వేశారు. కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కొనుగోలు సమయంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా సాకుతో దళారులు చెప్పే మాయమాటల్ని నమ్మి రైతులెవరూ మోసపోవద్దు. కనీస మద్దతు ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు కూడా ఏ ఒక్కరూ ధాన్యాన్ని అమ్ముకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
రేషన్ లబ్ధిదారులకు కూపన్లు
సాక్షి, అమరావతి: ఇంటింటా రేషన్ పంపిణీ చేసేందుకు మొబైల్ వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగానే సమాచారం ఇచ్చేందుకు ఈ నెల నుంచి కూపన్లు జారీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల ఫోన్ నంబర్లకు ఒక రోజు ముందుగానే సమాచారం పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇంటింటా సరుకుల పంపిణీకి సంబంధించి లోటుపాట్లను తెలుసుకునేందుకు ఆయన సోమవారం విశాఖపట్నంలో పర్యటించారు. వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా ఇప్పటివరకు రేషన్ షాపు నుంచి ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత సరుకులు తీసుకునే సౌకర్యం ఉందన్నారు. అయితే దీనివల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి మంగళవారం నుంచి ఏ మొబైల్ వాహనం వద్దనైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద మ్యాపింగ్ కాని కార్డుదారులు కూడా వాహనాల వద్ద సరుకులు తీసుకోవచ్చన్నారు. కొన్ని చోట్ల ఇంటింటా వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి చోట్ల లబ్ధిదారులు ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు వచ్చి సరుకులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తగు సూచనలు జారీ చేశామన్నారు. పట్టణాల్లో పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. -
ఇంటికే రేషన్..
సాక్షి, అమరావతి/గుడివాడ రూరల్: గిరిజన ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలోని అన్నిచోట్లా పేదలకు ఇంటింటా సరుకులు పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా సరుకుల పంపిణీని ప్రారంభించలేమని ఆయా ప్రాంతాలకు మండలస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనూ గురువారం నుంచి ఇంటింటికీ రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎక్స్–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. పల్లెల్లోనూ ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పౌర సరఫరాల విభాగం సోమవారం రేషన్ వాహనాలను పల్లెలకు పంపడం ప్రారంభించింది. రాష్ట్రంలో 9,260 మొబైల్ వాహనాలుండగా మంగళవారం వరకు దాదాపు 8,533 వాహనాలు రోడ్డెక్కాయి. ఇప్పటివరకు 27 లక్షల కుటుంబాలకు ఇళ్ల వద్దే సరుకులు అందించారు. రేషన్ పంపిణీలో ఈ–పాస్ వినియోగంపై వాహనదారులకు డీలర్లు సహకరించాలని కోన శశిధర్ కోరారు. వారంలోగా లబ్ధిదారులందరికీ సరుకులు అందించేలా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా 9,260 మందికి సబ్సిడీపై మొబైల్ వాహనాలు పంపిణీ సమకూర్చారని చెప్పారు. మొబైల్ వాహనం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, లబ్ధిదారుల ప్రశంసలు పొందేలా సరుకులు పంపిణీ చేయాలని కోరారు. -
మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ పథకం కోసంవినియోగిస్తున్న మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. వాహనదారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విదితమే. ప్రస్తుతం పట్టణాల్లో ఈ పథకం అమలవుతోంది. అయితే పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవడంతోపాటు సరుకుల పంపిణీ స్పీడును మరింత పెంచాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. లోపాలను వెంటనే సరిదిద్దుకునేలా వాహనదారులకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో 29,783 రేషన్ షాపులుండగా.. వీటిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న 7,426 షాపుల పరిధిలోనే ప్రస్తుతం ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 13.08 లక్షల కుటుంబాలకు 2.14 కోట్ల కిలోల నాణ్యమైన బియ్యం, 12.09 లక్షల కిలోల చక్కెర, 7.09 లక్షల కిలోల కందిపప్పు పంపిణీ చేశారు. ‘ఇంటింటికీ రేషన్’పై తీర్పు వాయిదా ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తన తీర్పును వాయిదా వేశారు. అంతకుముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇంటింటికీ రేషన్ పథకాన్ని పట్టణ ప్రాంతంలో అడ్డుకోలేదని తెలిపారు. ఈ పథకం కింద నిత్యవసరాల పంపిణీ కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాల రంగులపై ఫిర్యాదు అందాయని, వాటిని పరిశీలించి, తటస్థ రంగులను వేయాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. పేదలకు నిత్యావసర సరుకులను అందించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనిని కమిషన్ అడ్డుకోవడం సరికాదన్నారు. పేదలకు నిత్యావసరాలు అందించడం చాలా ముఖ్యమని సింగిల్ జడ్జి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. -
‘ఇంటింటికీ రేషన్’ ఆపడమే ఎస్ఈసీ ఉద్దేశం
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఇంటింటికీ రేషన్ కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాలకు అధికార పార్టీ రంగులు కాకుండా తటస్థ రంగును ఉపయోగించడంతో పాటు ఆ వాహనాలపై సీఎం జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మలను తొలగించాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసేంత వరకు తటస్థ రంగులను ఇలాగే ఉంచాలంటూ ఎన్నికల కమిషనర్ ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ డీవీఎస్ సోమయాజులు విచారణ జరపనున్నారు. పిటిషన్లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. ఈ పథకం పాతదే.. ‘ఇంటింటికీ రేషన్’పథకాన్ని 2019 జూన్‌లోనే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం సంచార వాహనాల ద్వారా సరుకుల పంపిణీకి నిర్ణయించి.. 9,260 వాహనాలను సమకూర్చాం. కోవిడ్ వల్ల ఈ పథకాన్ని 2020లోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కాలేదు. 2021 జనవరిలో వాహనాలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. జనవరి 21న ఈ వాహనాలను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మొదలు పెట్టిన పథకాలను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా.. వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులున్నాయంటూ ఇంటింటికీ రేషన్ పంపిణీని నిలిపి వేస్తూ ఎన్నికల కమిషనర్ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. పథకం అమలు ఎందుకు అవసరమో ఆధారాలతో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను 48 గంటల్లో ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై 5 రోజుల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్‌కు ఫిబ్రవరి 1న వినతిపత్రం సమర్పించాం. అన్ని వివరాలను తెలియజేసి.. పథకం ఎంత అవసరమో వివరించాం. వాహనాలపై ఉండే రంగులు అధికార పార్టీ రంగులు కాదని, వాటిని ఏ రాజకీయ పార్టీకి ఆపాదించవద్దని వివరించి పథకం అమలుకు అనుమతివ్వాలని కోరాం. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ఈ పథకం అమలుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులిచ్చారు. దీనిని బట్టి ముందుగానే తీసుకున్న నిర్ణయం ఆధారంగానే కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారనే విషయం స్పష్టమవుతోంది అని కోన శశిధర్ ఆ పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. -
1,00,000 టన్నుల రంగుమారిన ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: ధాన్యం రంగు మారినా దిగులు పడవద్దని రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. పంట దెబ్బతిందనే బాధ లేకుండా వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోంది. అకాల వర్షాలతో ఈసారి వరిపంట నీటమునిగి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు రెండు బృందాలను పంపి పంట నష్టాన్ని అంచనా వేయించింది. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో.. రంగుమారి, పాడైన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇటీవల నిబంధనలను కూడా సడలించింది. ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ సేకరించింది. నిబంధనల మేరకు వాటికి మద్దతు ధర కూడా కల్పించడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రైతులపై రవాణా భారం పడకుండా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ‘ఏ’ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,880, సాధారణ రకానికి రూ.1,868గా మద్దతు ధర నిర్ణయించిన విషయం తెలిసిందే. పది రోజుల్లోగా బిల్లులు ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రూ.2,827.93 కోట్ల విలువైన 15.11 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించింది. ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల వరకు రంగుమారిన, పాడైపోయిన ధాన్యం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) తప్పనిసరిగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. రైతుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేందుకు ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారిలో 70 వేలమంది రైతులకు సంబంధించిన బిల్లులు రూ.1,090 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమచేశారు. ధాన్యం విక్రయించిన పదిరోజుల్లోగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు రైతులెవ్వరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్లతో మాట్లాడుతున్నాం. సేకరించిన ధాన్యానికి సకాలంలో బిల్లులు చెల్లించేందుకు నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నాం. త్వరలోనే రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోదాముల్లో నిల్వ చేస్తున్నాం. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ -
దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించింది. తుపాను కారణంగా తడిసిన, రంగు మారిన, పాడైపోయిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి సేకరించి కష్టకాలంలో అండగా నిలవాలని నిర్ణయించింది. సడలించిన నాణ్యత ప్రమాణాలకు మించి పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ప్రత్యేక గోదాములలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 1,993 గ్రామాల్లో 2,92,689 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు కేంద్ర బృందంతో కలిసి పర్యటించి నివేదిక తయారు చేశారు. ధాన్యాన్ని విక్రయించడంలో ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తెచ్చేందుకు రైతు భరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రతి 20 కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించారు. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు రూ.701.05 కోట్ల విలువ చేసే 3.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సడలించిన నిబంధనలు ఇలా.. తడిసిన, రంగుమారిన, పాడైపోయిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని గ్రేడ్లవారీగా గుర్తించి మద్దతు ధర తగ్గించి చెల్లిస్తారు. తడిసిన, రంగుమారిన ధాన్యం 5 – 6 శాతం ఉంటే ధరలో ఒక శాతం, 6 – 7 శాతం ఉంటే ధరలో 2 శాతం, 7 – 8 శాతం ఉంటే ధరలో 3 శాతం, 8 – 9 శాతం ఉంటే ధరలో 4 శాతం, 9 – 10 శాతం ఉంటే మద్దతు ధరలో 5 శాతం తగ్గించి చెల్లిస్తారు. సడలించిన నిబంధనలు రాష్ట్రం అంతటా వర్తిస్తాయి. పూర్తిగా దెబ్బతిన్న ధాన్యాన్నీ కొంటాం... ‘నాణ్యత ప్రమాణాలకు మించి పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ధర చెల్లిస్తాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రత్యేక గోదాముల్లో నిల్వ చేస్తాం. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం’ – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావంతో తడిసిన, మొలకెత్తిన, పురుగు పట్టిన..ఇలా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ బుధవారం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు పౌరసరఫరాల శాఖ అధికారులు వెళ్లారన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని, ఒక బృందం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, రెండో బృందం తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాడైపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,578 ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6,643 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 4,46,000 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని, రైతుల కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయం: 18004251903 పశ్చిమగోదావరి: 08812 230448 తూర్పుగోదావరి: 08886613611 కృష్ణా: 7702003571, గుంటూరు: 8331056907 -
ఉచిత సరుకులు అర్హులందరికీ అందాలి
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ఉచితంగా ఇస్తున్న సరుకులు అర్హులందరికీ అందాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వర్ పని చేయలేదనే సాకు చెబుతూ షాపులు మూసేసి తప్పించుకునేందుకు వీల్లేదని హెచ్చరించింది. ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా రేషన్ డీలర్లు షాపుల వద్దే వేచి ఉండాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. దీంతో చాలావరకు డీలర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 5.30 గంటలకు, పట్టణ ప్రాంతాల్లో 6 గంటలకే ఈ–పాస్ మిషన్ ఆన్ చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ఉచిత సరుకులు పంపిణీ చేస్తున్నారు. మోసాలకు చెక్ పెట్టడంతో షాపులకు తాళం లాక్డౌన్ పరిస్థితుల్లో నెలకు రెండుసార్లు చొప్పున రాష్ట్రంలో పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలతో ఒక్కో కార్డుదారుడికి ప్రతిసారీ కేజీ శనగలు/కందిపప్పు, కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కేజీల బియ్యం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 16వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే చాలామంది డీలర్లు కందిపప్పు/శనగలు పంపిణీ చేయకుండా పేదలను మోసం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మోసాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో లబ్ధిదారుల నుండి బియ్యం ఇచ్చినప్పుడు ఒకసారి, కందిపప్పు/శనగలకు మరోసారి బయోమెట్రిక్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సరుకుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో కొందరు డీలర్లు షాపులను సరిగా ఓపెన్ చేయకుండా.. ఈ–పాస్ యంత్రాలు పని చేయడం లేదని, నెట్వర్క్ సమస్య ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. లబ్ధిపొందిన కుటుంబాల వివరాలు.. సర్కారు హెచ్చరికలతో దారికి.. ఈ–పాస్ మిషన్లు ఉదయం 5.30 గంటలకే ఆన్ చేయాలని, ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించడంతో డీలర్లు దారికొచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన హెచ్చరికల కారణంగా.. పంపిణీ ప్రారంభించిన రెండురోజుల్లోనే 30.38 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు అందాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 4,07,857 కుటుంబాలకు పంపిణీ చేశారు. రేషన్ డీలర్లు సహకరించాలి ఉచితంగా పంపిణీ చేస్తున్న సరుకులు కార్డున్న ప్రతి ఒక్కరికీ అందాల్సిందే. రెండుసార్లు బయోమెట్రిక్‌తో కొంత ఇబ్బంది ఉన్నా.. సరుకులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పేద ప్రజల ప్రయోజనం దృష్ట్యా రేషన్ డీలర్లు కూడా సహకరించాలి. –కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
పేదలకు ఉచితంగా గోధుమలు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏప్రిల్ నెల కోటా నుంచి నెలకు రెండుసార్లు చొప్పున బియ్యంతో పాటు శనగలు లేదా కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా ఇప్పటికి 15 విడతలు పంపిణీ చేసింది. ఇక చివరిసారిగా ఈ నెల 19 నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించాలని రాష్ట్రస్థాయి అధికారులు ఆదేశించారు. అయితే ఈసారి పేదలకు మరింత పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గోధుమలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు నెలకు రెండుసార్లు చొప్పున ప్రతి బియ్యం కార్డుదారుడికి కేజీ శనగలు లేదా కందిపప్పు, కార్డులోని ఒక్కో సభ్యుడికి ఐదు కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడతలో కుటుంబానికి కిలో బియ్యం తగ్గించి ఆ మేరకు గోధుమలు ఇవ్వనున్నారు. శ్రీకాకుళం మినహా.. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో కార్డుకు కిలో చొప్పున గోధుమలు ఇస్తారు. ఇప్పటికే 10 వేల టన్నులను జిల్లాలకు తరలించారు. ఆహారపు అలవాట్లలో భాగంగా కొందరు చపాతీ తింటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గోధుమలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,52,70,217 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రతా చట్టం కింద 89,40,407 కార్డులు, ఆ చట్టం పరిధిలోకి రానివి 63,29,810 కార్డులు ఉన్నాయి. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం మోస్తూ పేదలకు ఉచితంగా సరుకులు ఇస్తోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క బియ్యంపైనే దాదాపు రూ.1,700 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కనీసం 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నెలకు రెండుసార్లు చొప్పున పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేయడం రికార్డు. గోధుమల పంపిణీతో పేదలకు ప్రయోజనం... గోధుమలు ఉచితంగా పంపిణీ చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం. 16వ విడత పంపిణీ తర్వాత ఇక ఉచితం ఉండదు. డిసెంబర్ నెల నుంచి బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపైనే ఇస్తాం. జనవరి నుండి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తాం. – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
15వ విడత ఉచిత సరుకులు 5 నుంచి పంపిణీ
సాక్షి, అమరావతి: 15వ విడత ఉచిత సరుకుల పంపిణీ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఉచిత సరుకుల పంపిణీ అక్టోబర్ 31 వరకు 14 విడతల్లో కార్డులో పేరు నమోదైన ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం, కార్డుకు కిలో కందిపప్పు/కిలో శనగలను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. బియ్యానికి ఒకసారి పప్పుకు మరోసారి బయోమెట్రిక్ వేస్తే మోసాలను అరికట్టవచ్చని భావించి అక్టోబర్‌లో రెండవ విడత పంపిణీ నుంచి అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు. దీంతో పక్కాగా లబ్ధిదారులకు సరుకులు అందాయి. 2సార్లు బయోమెట్రిక్ వేయడం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 14వ విడతలో 1.19 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ఆయా కుటుంబాలకు 18.80 కోట్ల కిలోల బియ్యం, 1.19 కోట్ల కిలోల శనగలు పంపిణీ చేశారు. -
రైతుల చేతికి ముందే కూపన్లు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ పక్కా ఏర్పాట్లు చేసింది. వరి పండించిన రైతులకు ఈసారి ముందుగానే కూపన్లు పంపిణీ చేస్తారు. కూపన్లో అన్ని వివరాలు నమోదు చేసి.. సంబంధిత ఉద్యోగి సంతకం చేయాల్సి ఉంటుంది. కూపన్లో పేర్కొన్న వివరాల ఆధారంగా రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,868 చొప్పున రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తారు. రబీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.53 చొప్పున ధర పెరిగింది. ఈ–క్రాప్ ఆధారంగా.. రైతులు దళారులు, వ్యాపారులను ఆశ్రయించి ధర, తూకాల్లో మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు. సాగు వివరాలను ఈ–క్రాప్ ద్వారా ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ద్వారా వెంటనే నమోదు చేయించుకోవాలి. ఈ–క్రాప్ నమోదు కోసం వెళ్లే రైతులు ఆధార్ కార్డు, సెల్ ఫోన్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అవసరమైతే పొలానికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్ తప్పనిసరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే వాహనాలకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ ఉండాలి. ధాన్యంలో 17 శాతం తేమ, దెబ్బతిన్నవి లేదా మొలకెత్తిన గింజలు 5 శాతం, కుచించుకుపోయిన గింజలు 3 శాతానికి మించి ఉండకూడదు. తేమ శాతం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని ఎండబెట్టేందుకు అవసరమైన యంత్రాలు, జల్లెడ వంటి వాటిని మార్కెటింగ్ శాఖ సమకూరుస్తుంది. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎవరైనా మోసం చేస్తున్నట్టు గుర్తించినా లేదా ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1902 లేదా 1800–425–1903కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కువ ధర వస్తే బయట అమ్ముకోవచ్చు రైతులు తమ వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని.. కూపన్ పొందినా మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తే బయట మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసేందుకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులకు ముందుగానే కూపన్లు ఇస్తాం. ఆ తర్వాత రైతుల పొలం వద్దకే వెళ్లి ధాన్యం కొంటాం. – కోన శశిధర్, ఎక్స్–అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
ఏపీలో హమాలీల చార్జీలు పెంపు
సాక్షి, అమరావతి: హమాలీలకు చెల్లించే చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా మండల స్థాయి స్టాకు (ఎంఎల్ఎస్) పాయింట్ల నుండి రేషన్ షాపులకు సరుకులను తరలించేందుకు (లోడింగ్, అన్లోడింగ్ కింద) హమాలీలకు చెల్లించే చార్జీలను క్వింటాల్‌కు రూ.19 నుండి 22లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన చార్జీలు ఈ ఏడాది జనవరి నుండి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.9.09 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అమరావతి: ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్ ముందుకు వచ్చిందని స్కిల్ డెవలప్మెంట్ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్తవ్వ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)తో మంగళవారం ఎంవోయు కుదుర్చుకున్నారని తెలిపారు. దీని ప్రకారం డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు, అధ్యాపకులకు ఎక్స్ఎల్ఆర్ సంస్థ శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు. -
అక్టోబర్ 31 వరకు ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేందుకు వీలుగా నెల్లూరు జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తడిసిన ధాన్యంతో పాటు మిగిలిన ధాన్యం సేకరించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తడిచిన ధాన్యం పరిశీలనకు కేంద్ర పౌరసరఫరాలశాఖ అధికారులు ఎం.జెడ్.ఖాన్(పాట్నా), యతేంద్ర జైన్(పూనా) ఈనెల 21న రాష్ట్రానికి రానున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 82 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. నాట్లు ఆలస్యంగా వేయడం, వర్షాలు అధికంగా రావడం వల్ల చాలా వరకు ధాన్యం తడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖకు స్పందించి అనుమతులు ఇస్తూ కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి రాసిన లేఖ ఇందులో ఎన్‌ఎల్‌ఆర్– 3354 రకం ధాన్యం ఎక్కువగా తడిచిపోయింది. తడిచిన, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ కేంద్రానికి లేఖ రాశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఆహార శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కేంద్రం శుక్రవారం అనుమతులు జారీ చేసింది. ప్రతి గింజా కొనుగోలు చేస్తాం రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తడిచిన, మిగిలిన ధాన్యాన్ని అక్టోబర్ 31లోగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దు. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
ఖరీఫ్ లక్ష్యం 62 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గతేడాది ఖరీఫ్‌లో 1,706 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.55 లక్షల మంది రైతుల నుంచి రూ.8,705 కోట్ల విలువ చేసే 47.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 16.30 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుండగా.. దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున 62 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆహార శాఖ దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకెళ్లారు. 1.50 కోట్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సంబంధిత రకాల ధాన్యాన్ని విడిగా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తద్వారా బియ్యంలో కల్తీ లేకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. గన్నీ బ్యాగులతో సమస్య.. ► దాన్యం కొనుగోలు, బియ్యం సరఫరాకు గన్నీ బ్యాగ్‌ల సమస్య వెంటాడుతోంది. ► వెంటనే 4.30 కోట్ల (86 వేల బేళ్ల) గన్నీ బ్యాగ్‌ల కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ► గన్నీ బ్యాగ్‌లను పశ్చిమ బెంగాల్ నుంచి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆహార శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► ప్రస్తుతానికి ఇబ్బందులు రాకుండా పాత గన్నీ బ్యాగ్‌లను రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్ల నుంచి సేకరించాలని నిర్ణయం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివీ.. ► ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల నివారణకు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు. ► కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి విక్రయించకుండా సరిహద్దుల వద్దే అడ్డుకుంటారు. ► ప్రతి రైతుకూ మద్దతు ధర కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు. ► ఈ–క్రాప్ డేటా ఆధారంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోళ్లు. ► కౌలు రైతులు, పట్టాదారుల పేర్లు ఈ–క్రాప్ ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లచే నమోదు. ► మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా, తూకాల్లో మోసం చేస్తున్నట్టు అనుమానం వచ్చినా రైతులు 1902 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ► ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,728 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ. భారీగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గన్నీ బ్యాగ్‌ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,728 కోట్ల పాత బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే లేఖ రాశాం. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
పేదలకు వరం.. వన్ నేషన్.. వన్ రేషన్
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం పేదలు ఏ రాష్ట్రానికి వెళ్లినా వారికి అక్కడే సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ పథకం ద్వారా అంతర్రాష్ట్ర రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానాన్ని దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణలో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన వారికి కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత సరుకులు అందాలనే ఉద్దేశంతో అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ నెల నుంచి పకడ్బందీగా అమలు చేయాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. ► వలస కూలీలు ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది. ► వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్ పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణలో ఉచితంగా సరుకులు అందుకున్నారు. ► అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వంద మందికి పైగా తెలంగాణలోని వివిధ రేషన్ షాపుల్లో మంగళవారం ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేసి బియ్యంతో పాటు కందిపప్పు తీసుకున్నారు. ► మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పోర్టబిలిటీ త్వరలో అందుబాటులోకి రానుంది. ► రాష్ట్రంలో తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీలో భాగంగా మంగళవారానికి దాదాపు 1.12 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ► రాష్ట్ర పరిధిలో పోర్టబిలిటీ ద్వారా వివిధ జిల్లాల్లో 32.56 లక్షల కుటుంబాలు సరుకులు తీసుకున్నారు. పోర్టబిలిటీతో అక్కడే... మన రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువ మంది తెలంగాణలో ఉంటున్నారు. గతంలో ఇలాంటి వాళ్లు సొంతూళ్లకు వచ్చి సరుకులు తీసుకునే వారు. ఇప్పుడు వాళ్లు అక్కడే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులు సరుకులు తీసుకోవచ్చు. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
కొత్తగా 1,04,796 బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,04,796 బియ్యం కార్డులను మంజూరు చేశారు. దేశంలోనే తొలిసారి నిర్ధిష్ట కాల పరిమితిలో అర్హులైన వారికి ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. దరఖాస్తు చేసిన పది పని దినాల్లో అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్డుల కోసం గ్రామ సచివాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేస్తున్నారు. దరఖాస్తు వచ్చిన 10 రోజుల్లోగా 18,576 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన 86,220 కార్డులను వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. తిరస్కరిస్తున్న దరఖాస్తులకు కారణాలు కూడా వెల్లడిస్తున్నారు.