
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు ఐదో విడత ఉచిత సరుకులు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 29 లేదా 30 నుంచి సరుకులను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఈ దఫా కూడా కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యంతో పాటు కార్డుకు కిలో కందిపప్పు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న 1.48 కోట్ల కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు గోదాముల నుంచి రేషన్ షాపులకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
► మార్చి 29వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఇప్పటికే 4 విడతలుగా పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేశారు.
► వలంటీర్లు లబ్ధిదారులకు టైంస్లాట్‌తో కూడిన కూపన్లను జారీ చేస్తారు.
► ప్రస్తుతం ఉన్న 29 వేల రేషన్ షాపులకు అదనంగా మరో 15,331 కౌంటర్ల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు.
► కేంద్రనిబంధనల మేరకు లబ్ధిదారుల బయోమెట్రిక్ తప్పనిసరి. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment