ఈ-కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్‌ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తం.. | Civil Supplies Commissioner Kona Shashidhar Gives Clarity On EKYC Enrollment | Sakshi
Sakshi News home page

ఈ-కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్‌ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తం..

Published Wed, Aug 18 2021 10:08 PM | Last Updated on Wed, Aug 18 2021 10:12 PM

Civil Supplies Commissioner Kona Shashidhar Gives Clarity On EKYC Enrollment - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఈ–కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్‌ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని ఆయన వెల్లడించారు. 

ఈ-కేవైసీ చేసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్‌ తీసుకోవచ్చని, గ్రామ వాలంటీర్‌ ద్వారా ఈ-కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని, ప్రజలు.. ఆధార్, మీ–సేవ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో కోన శశిధర్‌ ఈ మేరకు స్పందించారు. 
చదవండి: లోకేశ్‌ హైడ్రామా.. పథకాలు పక్కదోవ పట్టించడానికే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement