
మోపిదేవి (అవనిగడ్డ): ఏపీలో వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తోంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలుకు చెందిన ఇద్దరు వృద్ధురాళ్లు అనారోగ్యంతో కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో పింఛన్లు అందుకుంటున్న వీరు ఈకేవైసీ నమోదు చేయాల్సి ఉంది.
మండవ బేబీ సరోజిని ఎల్‌బీ నగర్‌లో, మండవ రమాదేవి అశోక్‌నగర్‌లో ఉంటున్నారు. వారు స్వగ్రామం రాలేని పరిస్థితిలో వలంటీర్ కూనపులి సాయి మాలిక శ్రీ వైష్ణవి హైదరాబాద్ వెళ్లి ఈకేవైసీ నమోదు చేయించారు. తమకు ఈ కేవైసీ నమోదు చేయించిన వలంటీర్‌కు ఇద్దరు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.