Civil Supplies Commissioner
-
TG: డిజిటల్ హెల్త్ కార్డులపై సివిల్ సప్లై శాఖ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్:డిజిటల్ హెల్త్ కార్డ్ దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా,పలు మాధ్యమాల్లో సర్య్కులేట్ అవుతున్న దరఖాస్తు అసలైనది కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.ఈ మేరకు కమిషనర్ కార్యాలయం సోమవారం(అక్టోబర్7) ఒక ప్రకటన విడుదల చేసింది.ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు డిజైన్ ఇప్పటివరకు ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న దరఖాస్తులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ‘హైడ్రా’ మాదిరిగా ‘నిడ్రా’ -
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులకు అండగా ఏపీ సర్కార్
-
ఈ-కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఈ–కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని ఆయన వెల్లడించారు. ఈ-కేవైసీ చేసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని, ప్రజలు.. ఆధార్, మీ–సేవ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో కోన శశిధర్ ఈ మేరకు స్పందించారు. చదవండి: లోకేశ్ హైడ్రామా.. పథకాలు పక్కదోవ పట్టించడానికే -
ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్‌లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
కొత్తగా కార్డులొచ్చేనా?
(సాక్షి, నెట్వర్క్) : రేషన్‌కార్డు అనగానే.. సరుకులు తీసుకునే మాట ఏమోగాని స్థానికతకు, ఇతర అర్హతలకు ఇదే ప్రధానం. ఒకప్పుడు దీనిపై ఐదారు రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటిరెండుతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుతం బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. తెలంగాణ జిల్లాల (హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా) నెలవారీ రేషన్ బియ్యం కోటా 1,52,128 మెట్రిక్ టన్నులు. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 71,51,150 రేషన్ కార్డులున్నాయి. ఇవికాక, అంత్యోదయ కార్డులు (నిరుపేదలకు నెలకు ఈ కార్డుపై 30 కిలోల వరకు బియ్యం ఇస్తారు) 4,71,125 కాగా, అన్నపూర్ణ కార్డులు (అనాథలు, నిరాదరణకు గురైన వారికి ఇచ్చే కార్డులు) 5,285. కొత్తగా రేషన్ కార్డుల కోసం 4,44,439 దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు మంజూరైనవి 1,62,591 మాత్రమే. మిగతావి వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయి. రేషన్ కార్డు కోసం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త రేషన్ దరఖాస్తులు ఎక్కువగా డీఎస్ఓ, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్థాయిల్లోనే ఆగిపోతున్నాయని సమాచారం. ప్రస్తుతం 2,81,848 మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వీటిపై నెలవారీ రేషన్ సరుకులు తీసుకునే అవసరం కంటే, రేషన్ కార్డు స్థానికతకు, ఇతర అర్హతలకు ఆధారంగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. -
నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ!
సాక్షి, మెదక్: కొత్తగా ఆహార భద్రత కార్డుల(ఎఫ్ఎస్సీ) జారీకి బ్రేక్ పడింది. దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి సుమారు రెండు నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. సివిల్ సప్లయ్ కమిషనర్ ఇటీవల అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా కార్డులందక నిరుపేద కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అర్జీలను రెండు నెలల క్రితం వరకు యుద్ధప్రాతిపదికన క్లియర్ చేసిన జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దరఖాస్తుల పరిశీలనపై ఏ ఒక్క అధికారి దృష్టిసారించడం లేదు. ఆరోగ్యశ్రీ, కుటుంబ వార్షిక ఆదాయ నిర్ధారణ, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉపకార వేతనాల జారీలో ఆహార భద్రత కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈ క్రమంలో సివిల్ సప్లయ్ కమిషనర్ కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేయొద్దని ఆదేశించడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటిన్నర నెలలుగా జిల్లాలో సుమారు వేలాదిగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పలువురు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. పెండింగ్‌లో 2,658 దరఖాస్తులు ఆహారభద్రత కార్డుల జారీకి సంబంధించి అధికారులు మూడంచెలుగా పరిశీలన చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా మండలాల వారీగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు(ఆర్ఐ), ఆ తర్వాత ఎమ్మార్వో, అనంతరం జిల్లా స్థాయిలో డీసీఎస్ఓ పరిశీలించి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని కమిషనర్‌కు పంపుతారు. అక్కడ పరిశీలించి అప్రూవల్ ఇస్తే.. ఆహార భద్రత కార్డులు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం జూన్ నెల నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు ఆర్ఐల వద్ద 1290, ఎమ్మార్వోల వద్ద 213, డీసీఎస్ఓ వద్ద 1,155.. మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మార్పు చేర్పుల అర్జీలు సైతం జిల్లాలో రేషన్ షాపులు 521 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు 2,14,165 ఉండగా.. ఇందులో అంత్యోదయ కార్డులు 13018, అన్నపూర్ణ కార్డులు 88, ఎఫ్ఎస్సీ కార్డులు 2,01,059 ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇదివరకు ఆహార భద్రత కార్డులు జారీ అయి కుటుంబ సభ్యులను అందులో చేర్చాల్సి(మెంబర్ అడిషన్) ఉన్న వారికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇలాంటి మార్పుచేర్పుల దరఖాస్తులను కూడా మూడంచెలుగా పరిశీలన చేయాల్సి ఉండగా.. ప్రక్రియ నిలిచిపోయింది. మెంబర్ అడిషన్‌కు సంబంధించి ఆర్ఐల వద్ద 1,765, ఎమ్మార్వో వద్ద 555, డీసీఎస్ఓ వద్ద 2,104.. మొత్తం 4,424 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీ నిలిచిపోవడంతో జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 20 శాతం మేర కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి ఆదేశాలు ఇవ్వాలని నిరుపేదలు కోరుతున్నారు. ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఆహార భద్రత కార్డుల జారీని నిలిపివేశాం. మళ్లీ మొదలు పెట్టాలని ఆదేశాలు వస్తే.. వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం. రెండు నెలల క్రితం వరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవు. ఒక్క మెదక్ జిల్లాలోనే క్లియర్‌గా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో పది వేలు, అంతకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. – సాధిక్, డీటీసీఎస్ -
టీ వాలెట్‌తో రేషన్ షాపుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో 1,700 రేషన్ షాపులను టీ వాలెట్‌తో అనుసంధానం చేస్తున్నామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన టీ వాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం అకున్ మాట్లాడుతూ.. ఈ సేవలను ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. రంగారెడ్డిలో రెండు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించామని తెలిపారు. ఇప్పటికే మీ సేవ, ఈ సేవ, పీఎస్సీ, దోస్త్, విజయా డెయిరీ వంటి సేవలు టీ వాలెట్‌తో లింక్ అయ్యాయని చెప్పారు. కొత్తగా రేషన్ షాపులకు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఏకైక టీ వాలెట్ ఇదే అని, డిజిటల్ పేమెంట్స్‌కు గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పారు. ఈ వాలెట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వీలును నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. నోట్లపై ఆధారపడకుండా డిజిటల్ ఉపయోగం పెంచాలని చూస్తున్నామని పేర్కొన్నారు. టీ వాలెట్ వాడకంలో ఎలాంటి చార్జీ ఉండదని తెలిపారు. -
సంస్కరణలతో రూ.855 కోట్లు ఆదా
పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ, సంస్థల్లో చేపట్టిన సంస్కరణల వల్ల రూ.855 కోట్లు ఆదా చేయగలిగామని పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ–పాస్ విధానాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించనున్నామని.. దానివల్ల ఏడాది కాలంలో మరో రూ.800 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖతో పాటు పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ తాను బాధ్యతలు చేపట్టి ఐదు నెలలైన సందర్భంగా... మంగళవారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్లో విలేకరులతో మాట్లాడారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లులు, గోదాంలు, పాఠశాలలు, వసతి గృహాలు, రవాణా వంటి వాటి పర్యవేక్షణ స్థాయి మెరుగుపడిందన్నారు. రేషన్ బియ్యం దారి మళ్లింపు, రీసైక్లింగ్ చేస్తున్న వారిని గుర్తించడం, క్రిమినల్ కేసుల నమోదు, బ్లాక్ లిస్టులో పెట్టడం, 6ఎ కేసులకు సంబంధం ఉన్న వారికి ధాన్యం ఇవ్వకుండా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేసే 1,150 వాహనాలకు జీపీఎస్ అమర్చినట్లు చెప్పారు. 2017లో పౌర సరఫరాల సంస్థ సామరŠాథ్యన్ని పెంచేందుకు మరో 5 విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని ఆనంద్ తెలిపారు. ఐటీ విభాగం, ఎన్ఫోర్స్మెంట్–టాస్క్‌ఫోర్స్, ఆర్థిక నిర్వహణ–పర్యవేక్షణ విభాగం, సాంకేతిక విభాగం, ఇంజనీరింగ్ విభాగాలను సమకూర్చుకుంటామని.. వాటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ మినహా ఇతర అన్ని నియామకాలు, పరీక్షలు, ఇంటర్వూ్యలను సీజీజీ చూసుకుంటుందన్నారు.