
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలుపై రూ.1,637 కోట్లు రైతులకు చెల్లించామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇకపై రోజుకు రూ.200 కోట్ల వంతున రైతులకు చెల్లించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్రం నుంచి 3,299 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఫ్రీ ఆడిట్ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము చెల్లింపు ఏర్పాటు చేశామన్నారు.
బకాయిలపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రబీలో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 28 లక్షల 36వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తి చేసినట్లు కోన శశిధర్ చెప్పారు.
చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు
ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment