buy grain
-
ధాన్యం కొనుగోలు: రూ.1,637 కోట్లు రైతులకు చెల్లింపు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలుపై రూ.1,637 కోట్లు రైతులకు చెల్లించామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇకపై రోజుకు రూ.200 కోట్ల వంతున రైతులకు చెల్లించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్రం నుంచి 3,299 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఫ్రీ ఆడిట్ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము చెల్లింపు ఏర్పాటు చేశామన్నారు. బకాయిలపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రబీలో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 28 లక్షల 36వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తి చేసినట్లు కోన శశిధర్ చెప్పారు. చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ -
ధాన్యం విక్రయించాక ధరలు పెంచుతారా!
మనుబోలు: ధాన్యం విక్రయించిన తర్వాత ధరలు పెంచితే రైతులకు ఒరిగేదేంటని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి రైతులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల కష్టాలు వింటుంటే ఈ ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వారిని ఇబ్బందులపాలు చేయడానికి మనసెలా వస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.210 పెంచామని చెప్పడం రైతులను భ్రమపెట్టడమేనన్నారు. సోమిరెడ్డి మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకుని వారితో కుమ్మక్కయ్యాడని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. అధికారులే దగ్గరుండి కేజీ తరగు తీసుకుంటున్నారని అన్నదాతలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. మనుబోలులో 8 వేల పుట్ల ధాన్యం పండిస్తే కొనుగోలు కేంద్రం ద్వారా 180 పుట్లు తీసుకున్నామని అధికారులే చెబుతుండటం సిగ్గుచేటన్నారు. రైతు బాంధవుడా? రైతులను బాధించే సోమిరెడ్డి రైతు బాంధవుడెలా అవుతాడని కాకాణి ప్రశ్నించారు. ఎకరాకు 4.50 పుట్లు పండించారని మంత్రే చెబుతుంటే 4 పుట్లకు మించి తీసుకోమని అధికారులు అంటున్నారని మిగిలిన అర పుట్టి ధాన్యాన్ని ఏం చేయాలి?, సోమిరెడ్డికి మామూలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. మూడువారాల నుంచి తాము చెబుతుంటే ఇప్పుడు మిల్లర్లపై దాడులు చేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకనలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గొట్లపాలెం లింక్ కెనాల్‌ను ఏడాదిలో పూర్తిచేసి ఓట్లు అడగాలన్నారు. లేకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఏడాదిలో దాన్ని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు రావుల అంకయ్యగౌడ్, బొమ్మిరెడ్డి వెంకురెడ్డి, మన్నెమాల సుధీర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చెందులూరు శ్రీనివాసులు, చేవూరు ఓసూరయ్య, మారంరెడ్డి ప్రదీప్ రెడ్డి, మోటుపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల తులసీరాం, ఆవుల వెంకటరమణయ్య, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, కుడమల వెంకరమణయ్య గౌడ్, దాసరి భాస్కర్ గౌడ్, దాసరి మహేంద్రవర్మ, నర్రా వెంకయ్య, సురేందర్ రెడ్డి, విష్ణు తదితరులున్నారు. -
మహిళా సంఘాలు భేష్
► వరి ధాన్యం కొనుగోలులో ఆదర్శం ► మామడలో రూ. 2 కోట్ల ధాన్యం కొనుగోలు నిర్మల్(మామడ) : రైతులు పండించిన దొడ్డురకం ధాన్యానికి మద్దతు ధరను అందించడంతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు కొనుగోలు చేయడంతో రైతులకు, స్వయం సహాయక సంఘాలకు మేలు జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోళ్లలో మహిళ సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మామడ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 14,289 క్వింటాళ్ల వరి ధాన్యంను ఈ ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చేసి రూ.2 కోట్లకు పైగా మాహిళ సంఘాలు వ్యాపారం చేశారు. ప్రతిఏటా కొనుగోళ్లు.. మండలంలోని 13 గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రెండువేల హెక్టార్లలో చెరువులు, కాలువులు, బోర్ల కింద రైతులు వరి సాగు చేశారు. మండలంలోని పొన్కల్, మామడ, కొరిటికల్, పరిమండల్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించారు. 635 మంది రైతులు వద్ద నుంచి 14,289 క్వింటాళ్ల ధాన్యంను కొనుగోలు చేశారు. రూ.2 కోట్ల14 లక్షల89వేల వ్యాపారం చేశారు. మండలంలో 680 మహిళ సంఘాలు ఉండగా 8160 మంది సభ్యులుగా ఉన్నారు. వరిధాన్యంను కొనుగోలు చేసినందున గ్రామ సమైఖ్య సంఘాలకు కమీషన్ డబ్బులను అందిస్తారు. క్వింటాల వరి ధాన్యంను కొనుగోలు చేస్తే, ఏ గ్రేడ్‌కు క్వింటాల రూ. 32రూపాయలను కమీషన్ గా అందిస్తారు. రూ. 4లక్షల యాభైవేల రూపాయలు ధాన్యంను కొనుగోలు చేసిన వీవో సంగాలకు అందుతుంది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరిధాన్యం విక్రయించేందుకు హమాలి ఖర్చులకు క్వింటాలకు రూ.22 రూపాయలు రైతులు భరించారు. ఇందులో నుంచి క్వింటాలకు రూ. 5రూపాయలు ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఐకేపీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలు ద్వారా కమీషన్ ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ సమైఖ్య సంఘాలకు అందిస్తాం. రైతులకు అందించాల్సిన హమాలీ డబ్బులు అందిన వెంటనే రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. – అరుణ ఐకేపీ, ఏపీఎం మామడ ఎక్కువ కొనుగోళ్లు చేశాం ఈ యేడాది వరి ధాన్యంను మా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేశాం. కమీషన్ డబ్బులు అందితే సద్వినియోగం చేసుకుంటాం. గతంలో కంటే కొనుగోళ్లు ఎక్కువ చేయడం సంతోషంగా ఉంది. కమీషన్ ను అందించాలి. –బుజ్వవ్వ, పొన్కల్, వీవో సంఘ సభ్యురాలు -
గ్రామైక్య సంఘాలకు కమీషన్లు ఇచ్చారా?
విజయనగరం ఫోర్ట్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎన్నో కష్టనష్టాలకోర్చి నిర్వహించిన గ్రామైక్య సంఘాలకు, కూలీలకు ఇప్పటివరకూ కమీషన్లు చెల్లించకపోవడం పట్ల జెడ్పీటీసీలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ 1, 2, 4, 7 స్థాయీ సంఘాల సమావేశం జెడ్పీ చైర్పర్సన్ శోభస్వాతిరాణి అధ్యక్షతన, 3, 5, 6 స్థాయీసంఘాలు వైస్‌చైర్‌పర్సన్ బలగం కృష్ణమూర్తినాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా జామి జెడ్పీటీసీ బండారు పెదబాబు మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మహిళలకు, కూలీలకు ఎంత చెల్లించాలని ఏపీడీ సుధాకర్‌ను ప్రశ్నించారు. రూ.7.50 కోట్లు మంజూరయిందనీ, వీటిని జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామైక్య సంఘాలకు అందజేస్తామని ఆయన సమాధానమిచ్చారు. పెదబాబు కలుగజేసుకుని జిల్లాసమాఖ్య, మండల సమాఖ్యలు ఎప్పుడో లాప్స్ అయిపోయాయని, కష్టపడుతున్న మహిళలకే డబ్బులు ఇవ్వాలని, నిధులు వచ్చినా ఇంతవరకు చెల్లించకపోవడం ఏంటని , తక్షణమే డబ్బులు చెల్లించకపోతే లోకాయుక్తలో కేసు వేస్తానని హెచ్చరించారు. బొండపల్లి జెడ్పీటీసీ బండారు బాలాజీ మాట్లాడుతూ స్వావలంబన రుణాల కోసం మహిళలు నుంచి డబ్బులు కట్టించుకుని, వారికి రుణాలు ఇవ్వలేదని అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎల్.కోట జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు పింఛన్లు సక్రమంగా రాకపోవడంపైనా... మక్కువ జెడ్పీటీసీ శ్రీధర్ ఇసుక లేకున్నా రీచ్‌లకు ఎలా వేలం నిర్వహించారనీ, పూసపాటిరేగ జెడ్పీటీసీ ఆకిరి ప్రసాద్‌రావు ఎన్ఆర్జీఎస్ పనులు మంజూరులో హడావుడి ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, పంచాయతీరాజ్ ఎస్ఈ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ గనియా రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు ని‘బంధనాలు’
తోటపల్లిగూడూరు: అన్నదాతకు కనీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల పేరుతో ప్రభుత్వం బిగించిన నిబంధనాల ఉచ్చులో రైతన్నలు విలవిల లాడిపోతున్నారు. విసిగిపోయిన అన్నదాతలు కల్లాల్లోనే ధాన్యాన్ని తక్కువ ధరకే దళారులకు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం జిల్లాలో 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అధికారులు ప్రస్తుతానికి 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలంటూ అధికారులు జిల్లా రైతాంగానికి ఉచిత సలహాలు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,400, పుట్టి(850కేజీలు)కి రూ.11,900, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కురూ.1,360, పుట్టికి రూ.11,560గా ప్రభుత్వం మద్దతుధర ప్రకటించింది. ఈ మద్దతు ధరను పొందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలంటూ అధికారులు పెట్టిన నిబంధనలు రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉండాలని, దుమ్ము, ధూళి, మట్టి, రాళ్లు, చెత్త, తాలు 1 శాతానికి మించకూడదని, దెబ్బతిన్న, రంగుమారిన, చెడిపోయిన, మొలకెత్తిన, పురుగులు పట్టిన ధాన్యం 5 శాతంలోపు ఉండాలని షరతులు విధించారు. అలాగే పరిపక్వానికి రాని, కుచించుకుపోయిన, వంకరపోయిన ధాన్యం 3 శాతానికి మించరాదని, కల్తీ, కేళి ఇతర తక్కువ రకాల ధాన్యం 6 శాతంలోపు ఉండాలని నిబంధన. సాధారణంగా శాంపిల్స్ ప్రక్రియలో ఆయా ప్రమాణాల్లో తేడా ఉంటే ఆ మేరకు ధర తగ్గించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే రైతులకు మిగిలేది ఏమీ ఉండదు. ఇలా నిబంధనల చట్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పోల్చుకుంటే దళారులకు అమ్మడం మేలనీ రైతులు భావిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దళారుల చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం దళారులు పుట్టికి రూ.10,500కు మించి కొనుగోలు చేయడం లేదు. 15 రోజుల్లో 834 పుట్లే కొనుగోలు! ప్రస్తుత సీజన్ రబీలో జిల్లావ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల పుట్ల ధాన్యం వస్తుందని ఓ అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 150 కొనుగోలుకేంద్రాల ద్వారా 1,21,990 మెట్రిక్ టన్నుల(1,43,528 పుట్లు) ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమైన పదిహేనురోజుల్లో రెండు లక్షల పుట్లకుపైగా బయటకు వచ్చింది. కాగా ఇప్పటివరకు 109 కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ప్రస్తుతానికి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యం 834 పుట్లు(709 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిల్లర్ల ద్వారా మరో 12,523 మెట్రిక్ టన్నుల(14,732 పుట్లు)ను కొనుగోలు చేశారు. ప్రారంభించిన 109 కొనుగోలు కేంద్రాల్లో 90 శాతం కేంద్రాల్లో ఇప్పటికీ గింజ కూడా చేరని పరిస్థితి. బయటకు వచ్చిన రెండ లక్షల పుట్లలో అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా 834 పుట్లను కొనుగోలు చేశారంటే ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారులు లేనిపోని సాకులు చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని స్థానిక రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. అడ్డమైన నిబంధనలు రైతు మెడకు చుట్టిన ప్రభుత్వం పునరాలోచించి వాటిని సడలిస్తేనే కొనుగోలు కేంద్రాలు ధాన్యపురాసులతో కళకళలాడుతాయి. -
పత్రాల మాటున పచ్చి మోసం!
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయి. ఇటు అధికారులు, అటు మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వ బొక్కసానికి పెద్దకన్నమే పెడుతున్నారు. నిన్న ట్రక్షీట్ల వ్యవహారం వెలుగుచూడగా, ఇప్పుడు కౌలురైతులకు ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రాలూ మిల్లర్ల చేతికి వెళ్లినట్టు సమాచారం. వాటి ఆధారంగా కొందరు మిల్లర్లు కౌలు రైతుల పేరుతో తమ జేబులు నింపుకొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ధాన్యం కొనుగోలు వ్యవహరంలో రోజుకో కొత్త అవినీతి వ్యవహారం బయటపడుతోంది. ట్రక్షీట్ల మాయాజాలంతో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు రాగా, కౌలు రైతుల ముసుగులోనూ అదే స్థాయిలో అవినీతి జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందన్న సందేహం రాకమానదు. ట్రక్షీట్ల భాగోతాన్ని ఇప్పటికే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ధాన్యం తెచ్చిన రైతులకు మాత్రమే కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇవ్వవల్సిన ట్రక్షీటులు, నేరుగా మిల్లర్ల చేతికి వెళ్లాయి. ఈ ట్రక్‌షీట్ ప్రక్రియకొచ్చే ముందు మరో భాగోతం చోటుచేసుకుంటుంది. సాధారణంగా రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ఐకేపీ, రెవెన్యూ, సివిల్సప్లై సిబ్బంది ట్రక్ షీట్‌ను రాస్తారు. ట్రక్ షీట్ ప్రకారం ధాన్యాన్ని సంబంధిత మిల్లుకు కేటాయిస్తారు. ఆ మిల్లు యజమాని ధాన్యాన్ని అన్లోడ్చేసుకుని ఎకనాలెడ్జ్మెంట్ (ఏసీకే) ఇస్తారు. దీంతో పాటు ట్రక్‌షీట్‌ను పట్టాదారు పాసు పుస్తకం రశీదును, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్‌ను, ఆధార్ కార్డును జిరాక్సులు తీసుకుని, కొనుగోలు చేసిన లోడుల వివరాలను కొనుగోలు కేంద్రం సిబ్బంది జిల్లా కార్యాలయానికి తీసుకువెళితే జిల్లా మేనేజర్ అక్కడ బల్క్‌గా చెక్ రాసి బ్యాంకుకు ఇస్తే బ్యాంకులో రైతుల ఖాతాలకు సొమ్ము జమ అవుతుంది. అదే కౌలు రైతులైతే భూమికి సంబంధించిన అసలు యజమాని పట్టాదారు పుస్తకం జిరాక్స్‌తో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్‌లను అందజేయాల్సి ఉంది. వాటితో పాటు వీఆర్ఓ సంతకం చేసిన సాగు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలు కేంద్రానికి ఇవ్వవల్సి ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని సదరు కౌలు రైతులకు కొనుగోలు కేంద్రాలు ట్రక్షీట్లు జారీ చేస్తాయి. తదననుగుణంగా సరఫరా చేసిన సరుకు మేరకు నిధులు జమ చేస్తారు. అయితే, కౌలు రైతుల ముసుగులో మిల్లర్లు పెద్ద మోసానికి దిగారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న కొందరు రైతులకు చెందిన పట్టాదారు పుస్తకాల జిరాక్సు కాపీలను తీసుకుని వాటికి పలుకుబడితో గాని, కాసులు విసిరిగాని చేజిక్కించుకుంటున్న సాగు ధ్రువీకరణ పత్రాలను జోడిస్తున్నారు. ట్రక్షీట్ల మాయాజాలంతో ప్రభుత్వాన్ని ఎలాగైతే బురిడి కొట్టిస్తున్నారో, అదే విధంగా ఈ సాగు ధ్రువీకరణ పత్రాల్ని పట్టుకుని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. పూరించకుండానే ఆ పత్రాలను కొందరు వీఆర్వోలు మిల్లర్ల చేతిలో పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వెనుక సంబంధిత అధికారుల హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా జారీ చేస్తున్న సాగు ధ్రువీకరణ పత్రాలతో మిల్లర్ల పంట పండుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు చెలరేగిపోతున్నారు. పలువురు వీఆర్ఓలు గుడ్డిగా ఇచ్చేసిన సాగు ధ్రువీకరణ పత్రాలను జత చేసి, తమ బంధువులను కౌలు రైతులుగా చూపించి, వారికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డు జిరాక్సు పత్రాలను జత చేస్తున్నారు. ఈ వివరాలనే తమ వద్ద ఉన్న ట్రక్ షీట్లతో నింపి బిల్లులను పంపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని పరిశీలించకుండానే అన్లైన్ చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు గోల్మాల్ అయ్యాయనే ఆరోపణలు వినిపించినా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెద్దతంతే... ట్రక్షీట్లు, సాగు ధ్రువీకరణ పత్రాల మాయ వెనక పెద్ద తంతే నడుస్తోంది. ధాన్యం కొనుగోలు చేసినట్టు, అవి మిల్లర్లకు చేరినట్టు, వాటిని మరపట్టి ఇస్తున్నట్టు చూపిస్తున్నప్పటికీ లోపాయికారీగా మరో తతంగం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకొచ్చిన పీడీఎస్(కిలో రూపాయి బియ్యం) బియ్యంలో చాలా వరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. వాటినే వ్యాపారుల ద్వారా కొందరు మిల్లర్లు సేకరించి, కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యానికి బదులగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చేస్తున్నట్టు వాదనలు ఉన్నాయి. దీనికి ఊతమిచ్చినట్టు సాక్షాత్తు కలెక్టర్, జేసీల సమక్షంలో మంగళవారం జరిగిన ఆహార సలహా సంఘం సమావేశంలో మిల్లర్ల చేస్తున్న రీసైక్లింగ్ వ్యవహారాన్ని కొందరు ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలు, ట్రక్‌షీట్, -
ట్రిక్ షీట్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నదాత కష్టం దళారుల పాలు కాకూడదు. అందుకే దళారీ వ్యవస్థను నిర్మూలించాలనే ధాన్యం కొనుగోలు చేపడుతున్నాం. అంటూ ఊదరగొట్టిన అధికారులే ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో అక్రమాలకు ఆజ్యం పోశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు.. అడ్డదారులు తొక్కేందుకు మిల్లర్లకు మార్గాలను ఉపదేశించినట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో కూర్చున్నా.. అన్న చందాన మిల్లర్లు కూడా రెచ్చిపోయారు. అక్రమాలకు అధికారులే గేట్లెత్తారా? ట్రక్షీట్ల మాయాజాలంతో కోట్లాది రూపాయలు చేతులు మారా యా? అంటే జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలే బలపడుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 167 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేపట్టారు. మహిళలకే ఈ కొనుగోలు బాధ్యతలు అప్పగించామని చెబుతున్న అధికారులు చూసీ చూడనట్టు వదిలేయడంతో పాటు మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేయడానికి వారికి అనువైన పరిస్థితులు కల్పించారు. దీంతో కొనుగోలులో అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది.ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటినుంచి మిల్లర్‌కు పంపించి డబ్బులు రైతులకు అందేందుకు కీలకమైన ట్రక్ షీట్ల వ్యవహారాన్ని సంతల్లో చీటీల్లా నచ్చినట్టు పంచేశారు. దీంతో పలువురు మిల్లర్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే ముందుగా తమ గుర్తింపు కార్డును తీసుకుని కొనుగోలు కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. రైతు తెచ్చిన గుర్తింపు కార్డును నమోదు చేసుకుని ఎంత మేర ధాన్యం తెస్తాడో తెలుసుకుని ఆ మేరకు రైతుకు గోనెసంచులు ఇస్తారు. అనంతరం ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఐకేపీ, రెవెన్యూ, సివిల్‌సప్లైస్ సిబ్బంది ట్రక్ షీట్‌ను రాస్తారు. ట్రక్ షీట్ ప్రకారం ధాన్యాన్ని సంబంధిత మిల్లుకు కేటాయిస్తారు. ఆ మిల్లు యజమాని ధాన్యాన్ని అన్లోడ్చేసుకుని ఏసీకే(ఎకనాలెడ్జ్మెంట్)ఇస్తారు. దీంతో పాటు ట్రక్‌షీట్‌ను, పట్టాదారు పాసు పుస్తకం రశీదు, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు తీసుకుని కొనుగోలు కేంద్రం సిబ్బంది జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్తే అక్కడ బల్క్‌గా జిల్లా మేనేజర్ చెక్ రాసి బ్యాంకుకు ఇస్తారు. ఆ తరువాత బ్యాంకులో రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. (దీనిని ఇప్పుడు మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లోనే ఆన్లైన్ చేస్తూ మార్పులు తీసుకువచ్చారు.) అయితే ధాన్యం కొనుగోలు ఈ విధంగా డ్వాక్రా మహిళలు చేస్తే పారదర్శకంగా జరిగి ఉండేదేమో! సంతల్లో చీటీల్లా.. పటిష్టమయిన వ్యవస్థతో ట్రక్ షీట్లను ముద్రించి లెక్క ప్రకారం కొనుగోలు కేంద్రాలకు అందించి అక్కడ సక్రమ పద్ధతి ద్వారా ట్రక్ షీట్లను రాయాల్సి ఉంది. కానీ ట్రక్షీట్లను సీరియల్ నంబర్లు లేకుండానే ముద్రించారు. అంతటితో ఆగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన ట్రక్ షీట్ల పుస్తకాలను మిల్లర్ల చేతికి అందించినట్టు తెలిసింది. సీరియల్ నంబర్లు లేవన్న విషయం తెలుసుకుని వాటి ముసుగులో కొందరు మిల్లర్లు మరికొన్ని పుస్తకాలను ఇష్టారీతిన ముద్రించి వాడుకున్నట్టు తెలిసింది. ఇలా ట్రక్ షీట్లు మిల్లర్ల చేతికి వెళ్లిపోవడంతో మిల్లర్లు బయట ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు జరిపినట్టు నకిలీ బిల్లులు తయారు చేసి వాహనాలతో పాటు పంపించేస్తే సంబంధిత అధికారులు వాటిపైనే సంతకాలు చేసి నకిలీ రైతుల పేరున బిల్లులు చేసేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడేస్తే వాటిని తీసుకుని లాభాలను దిగమింగి కొంత నగదును రైతుల చేతుల్లో పెట్టారు. మరికొందరు మిల్లర్లు తమ బంధువుల పేరున ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు సేకరించి కౌలు రైతులంటూ ఖాతాల్లో డబ్బులు వేయించుకున్నారు. ఇలా జిల్లాలో దాదాపు రూ.330 కోట్ల లావాదేవీలు జరగ్గా దొంగ ట్రక్షీట్ల ద్వారా నాలుగో వంతు మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. సీరియల్ నంబర్లు లేకుండా ట్రక్షీట్లు ఎలా ముద్రించారు? ముద్రించిన ట్రక్షీట్లు మిల్లర్ల చేతికి ఎలా వెళ్లాయి? సీరియల్ నంబర్ లేదన్న ముసుగులో అనధికారికంగా ఎన్ని ట్రక్షీట్ల పుస్తకాలు ముద్రించారన్నది తేలాల్సి ఉంది. -
విజయనగరం భేష్
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కితాబు ఇచ్చింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ క్వాలిటీ కంట్రోల్ రాష్ట్ర మేనేజర్ జీసీ మల్లారెడ్డి,ఏజీఎం పి.సుధాకరరావు, టెక్నికల్ అధికారి ఏఆర్ఎన్ బాబులు పాల్గొని తాము సందర్శించిన ప్రాంతాల్లో గుర్తించిన అంశాలు, లోటుపాట్లను వివరిస్తూ ఆ శాఖ ఎం.డి.కి నివేదిక ఇచ్చారు. దీనిపై సివిల్ సప్లైస్ ఎం.డి. పేరిట జిల్లాకు నివేదిక చేరింది. ఇందులో గుర్తించిన ప్రకారం..జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిబంధనలు పాటిస్తున్నాయని రిపోర్టు ఇచ్చారు. సరిపడా సిబ్బందితో ఈ కేంద్రాలు నడుస్తున్నాయని రాశారు. గోనె సంచులు పంపిణీ చేయడంలోనూ, తూకం పరికరాల పంపిణీ చేయడంతో పాటు అవసరమైన కేంద్రాల్లో తేమ యంత్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే జిల్లాలో సమస్యలను కూడా చెప్పుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని కూలీలు తమ కూలి డబ్బులు త్వరగా ఇవ్వాలని కోరినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. కూలీలకు డబ్బులు త్వరగా ఇస్తే కేంద్రాలు జోరుగా నడుస్తాయని కూలీలే చెప్పినట్టు రిపోర్టులో రాశారు. శ్రీకాకుళం జిల్లాలో 40 కిలోల బస్తాలకు బదులుగా 70 నుంచి 80 కిలోల బస్తాలను వేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేసిన తేమ యంత్రాలు నాణ్యతలోపించాయని తేల్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళలు, పీఏసీఎస్ సిబ్బందికి ఇంకా శిక్షణ అవసరమని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన దగ్గరనుంచి బ్యాగులు కట్టడం, తరలించడం, మిల్లులకు అప్పగించడం వంటి విషయాల్లో ఇంకా అస్పష్ట విధానాన్ని అవలంబిస్తున్నారని, దీనిని మార్చుకోవాల్సి ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ రెండు జిల్లాల్లో పర్యటించిన కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని ఆ శాఖ ఎం.డి. ఆయా జిల్లాలోని పౌరసరఫరాల కలెక్టర్లకు సూచించారు. రెండు జిల్లాల ధాన్యం శాంపిళ్ల రిపోర్టు : రెండు జిల్లాల్లో పర్యటించిన తనిఖీ బృందం అధికారులు శ్రీకాకుళంలో ఏడు కొనుగోలు కేంద్రాలు, విజయనగరంలో ఐదు కొను గోలు కేంద్రాలనుంచి పది చొప్పున శాంపిళ్లను సేకరించి వాటిని ప్రయోగశాలలో పరీక్షించి వాటి నాణ్యత నివేదికను పంపించారు. దీని ప్రకారం విజయనగరం జిల్లాలోని ధాన్యం నాణ్యత ఫరవాలేదని , శ్రీకాకుళంలోని నాణ్యత తక్కువ ఉందని నివేదిక ఇచ్చారు. రెండు జిల్లాల్లోనూ హుద్‌హుద్ తుపాను ప్రభావం ఉందని తెలిపారు. తాము శాంపిల్స్ తీసుకున్న రైతుల పేర్లు, అడ్రస్‌లతో పాటు వారిచ్చిన ధాన్యంలో తేమ, రాళ్లు, చెత్త, ధూళి, నూక శాతం వంటి వివరాలను నివేదించారు. -
కొనుగోలు కేంద్రాల్లో దైన్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్:జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ కేం ద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 74 కేంద్రాలు ప్రారంభం కాగా 450 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధాన్యం తక్కువ ధర పలక డం, రవాణా చార్జీలు రైతులే భరించాల్సి ఉండటం రైతులకు ఇబ్బందికరంగా మారింది. పైగా బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులు జరుపుతుండటంతో రుణ ఖాతాలకు ఈ నగదును బ్యాంకర్లు జమ చేస్తారన్న భయంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మేందుకు ముందుకు రావడంలేదు. అలాగే కొనుగోలు కేంద్రాల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో ఈ ఏడాది వంద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 74 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉన్న సమయంలో ఈ నెల 24 నుంచి వీటిలో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 450 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి వేశారు. అయితే హుద్‌హుద్ తుపాను, ఆ తర్వాత సుడిదోమ కారణంగా చాలావరకు పంట దెబ్బతింది. వీటన్నింటినీ తట్టుకొని సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో కనీసం మూడు లక్షల టన్నులైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది 50 వేల టన్నులు కూడా కొనుగోలు చేసే అవకాశం లేదు. ధరలోనూ తేడాలే ఈ ఏడాది క్వింటాలు ధాన్యం ఎ-గ్రేడుకు రూ.1400, సాధారణ రకానికి రూ.1360 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిలో 17 శాతం వరకు తేమ, పొల్లు ధాన్యం ఇతర లోపాల పేరుతో ధర తగ్గించేస్తున్నారు. చెల్లింపుల్లోనూ బ్యాంకు అకౌంట్లు ఇతరత్రా కారణాలతో కాలయాపన చేస్తున్నారు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరా సంస్థ జిల్లా మేనేజర్ జె.సీతారామారావు వద్ద ప్రస్తావించగా ఇంకా కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరిగిందని తెలిపారు. కొనుగోళ్లపై దృష్టిపెట్టామని, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
లెవీ కోత ..రైతుకు మోత
నెల్లూరు(పొగతోట): ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు కష్టకాలం రానుం ది. ధాన్యం కొనుగోలు చేయడానికి మి ల్లర్లు ముందుకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో రైతులు పండిం చిన ధాన్యాన్ని ఇళ్ల వద్దనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే సృష్టిస్తోంది. లెవీ సేకరణలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. వచ్చే సీ జన్‌లో 25 శాతం మాత్రమే లెవీ సేకరిం చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇది రైతుల పాలిట శాపంగా మారనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మద్దతు ధర లభించే అవకాశాలు లేవని అంటున్నారు. పండించిన ధాన్యానికి గి ట్టుబాటు ధర రాక, ఇళ్ల వద్ద నిల్వ చేసుకునే అనుకూలత లేక తీవ్రంగా నష్టం జ రుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏటా రైతులు పండించిన ధా న్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. రై తుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి 75 శాతం లెవీ రూపంలో ప్రభుత్వానికి సరఫరా చేస్తారు. మిగిలిన 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 25 శాతం మాత్రమే లెవీ సేకరించాల్సి ఉంది. ఈ కారణంగా మిల్లర్లు రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి సాధ్యం కాదు. జిల్లాలో ప్రతి ఏడాది 5 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పండిస్తారు. పండించిన వరిని అధిక శాతం మంది రైతులు కల్లాల్లోనే విక్రయిస్తారు. పొలాల్లో అరబెట్టి ఇంటికి తీసుకువచ్చి ధర వచ్చిన తరువాత విక్రయించే రైతుల సంఖ్య చాలా తక్కువ. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. అయినప్పటికీ మిల్లర్లు, దళారులు కుమ్మక్కై ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుంటారు. దీని వలన రైతులు నష్టపోతున్నారు. ఈ రూపంలోనే రైతులు కోట్ల రూపాయాలు నష్టపోతున్నారు. 75 శాతం లెవీ సేకరణ సమయంలోనే మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేసే మిల్లరు ఇప్పుడు లెవీ తగ్గించడంతో రైతుల నడ్డివిరిచే అవకాశాలే ఎక్కువ. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాముల సౌకర్యం లేనందున లెవీ 25 శాతానికి పరిమితం చేయడమంటే తాము నష్టాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుందని మిల్లర్లు అంటున్నారు. గుజరాత్లో ప్రభుత్వం లెవీ సేకరించడం లేదు. అదే పద్ధతిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఈ పద్ధతి అమలు చేయడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో గోధుమలు అధికంగా పండిస్తారు. మన రాష్ట్రంలో ఆ స్థానం వరిది. లెవీ సేకరణ తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయో ప్రమాదం ఉంది. లెవీని 75 శాతంగా నిర్ణయించాలి : లెవీ సేకరణను తగ్గించడంతో మిల్లర్లు, రైతులు నష్టపోయో అవకాశం ఉంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 25 శాతం లెవీ సరఫరా చేసి మిగిలిన 75 శాతం లోకల్‌గా విక్రయించుకోలేం. ధాన్యాన్ని నిల్వ చే యడానికి గోదామలు లేవు. లెవీ సేకరణ ను పెంచాలి. ఓపెన్ మార్కెట్‌కు అవకాశాం కల్పిస్తే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తాం. - సుబ్రమణ్యంరెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేస్తాం : లెవీ సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేస్తాం. వచ్చే సీజన్ నుంచి 25 శాతం లెవీ సేకరిస్తాం. రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపడతాం. - శాంతకుమారి,డీఎస్ఓ