నెల్లూరు(పొగతోట): ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు కష్టకాలం రానుం ది. ధాన్యం కొనుగోలు చేయడానికి మి ల్లర్లు ముందుకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో రైతులు పండిం చిన ధాన్యాన్ని ఇళ్ల వద్దనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే సృష్టిస్తోంది. లెవీ సేకరణలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. వచ్చే సీ జన్‌లో 25 శాతం మాత్రమే లెవీ సేకరిం చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇది రైతుల పాలిట శాపంగా మారనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మద్దతు ధర లభించే అవకాశాలు లేవని అంటున్నారు.
పండించిన ధాన్యానికి గి ట్టుబాటు ధర రాక, ఇళ్ల వద్ద నిల్వ చేసుకునే అనుకూలత లేక తీవ్రంగా నష్టం జ రుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏటా రైతులు పండించిన ధా న్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. రై తుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి 75 శాతం లెవీ రూపంలో ప్రభుత్వానికి సరఫరా చేస్తారు. మిగిలిన 25 శాతాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకుంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 25 శాతం మాత్రమే లెవీ సేకరించాల్సి ఉంది. ఈ కారణంగా మిల్లర్లు రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి సాధ్యం కాదు. జిల్లాలో ప్రతి ఏడాది 5 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పండిస్తారు.
పండించిన వరిని అధిక శాతం మంది రైతులు కల్లాల్లోనే విక్రయిస్తారు. పొలాల్లో అరబెట్టి ఇంటికి తీసుకువచ్చి ధర వచ్చిన తరువాత విక్రయించే రైతుల సంఖ్య చాలా తక్కువ. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. అయినప్పటికీ మిల్లర్లు, దళారులు కుమ్మక్కై ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుంటారు. దీని వలన రైతులు నష్టపోతున్నారు. ఈ రూపంలోనే రైతులు కోట్ల రూపాయాలు నష్టపోతున్నారు. 75 శాతం లెవీ సేకరణ సమయంలోనే మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేసే మిల్లరు ఇప్పుడు లెవీ తగ్గించడంతో రైతుల నడ్డివిరిచే అవకాశాలే ఎక్కువ.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాముల సౌకర్యం లేనందున లెవీ 25 శాతానికి పరిమితం చేయడమంటే తాము నష్టాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుందని మిల్లర్లు అంటున్నారు. గుజరాత్‌లో ప్రభుత్వం లెవీ సేకరించడం లేదు. అదే పద్ధతిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఈ పద్ధతి అమలు చేయడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో గోధుమలు అధికంగా పండిస్తారు. మన రాష్ట్రంలో ఆ స్థానం వరిది. లెవీ సేకరణ తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయో ప్రమాదం ఉంది.
లెవీని 75 శాతంగా నిర్ణయించాలి :
లెవీ సేకరణను తగ్గించడంతో మిల్లర్లు, రైతులు నష్టపోయో అవకాశం ఉంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 25 శాతం లెవీ సరఫరా చేసి మిగిలిన 75 శాతం లోకల్‌గా విక్రయించుకోలేం. ధాన్యాన్ని నిల్వ చే యడానికి గోదామలు లేవు. లెవీ సేకరణ ను పెంచాలి. ఓపెన్ మార్కెట్‌కు అవకాశాం కల్పిస్తే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తాం. - సుబ్రమణ్యంరెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్
ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేస్తాం :
లెవీ సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేస్తాం. వచ్చే సీజన్ నుంచి 25 శాతం లెవీ సేకరిస్తాం. రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపడతాం.
- శాంతకుమారి,డీఎస్‌ఓ
లెవీ కోత ..రైతుకు మోత
Published Mon, Sep 1 2014 4:45 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement