మహిళా సంఘాలు భేష్‌ | Women's groups bhes | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలు భేష్‌

Published Fri, Feb 3 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

మహిళా సంఘాలు భేష్‌

మహిళా సంఘాలు భేష్‌

► వరి ధాన్యం కొనుగోలులో ఆదర్శం
► మామడలో రూ. 2 కోట్ల ధాన్యం కొనుగోలు

నిర్మల్‌(మామడ) : రైతులు పండించిన దొడ్డురకం ధాన్యానికి మద్దతు ధరను అందించడంతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు కొనుగోలు చేయడంతో రైతులకు, స్వయం సహాయక సంఘాలకు మేలు జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోళ్లలో మహిళ సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మామడ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 14,289 క్వింటాళ్ల వరి ధాన్యంను ఈ ఖరీఫ్‌ సీజన్ లో కొనుగోలు చేసి రూ.2 కోట్లకు పైగా మాహిళ సంఘాలు వ్యాపారం చేశారు.

ప్రతిఏటా కొనుగోళ్లు..
మండలంలోని 13 గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రెండువేల హెక్టార్‌లలో చెరువులు, కాలువులు, బోర్‌ల కింద రైతులు వరి సాగు చేశారు. మండలంలోని పొన్కల్, మామడ, కొరిటికల్, పరిమండల్‌ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించారు. 635 మంది రైతులు వద్ద నుంచి 14,289 క్వింటాళ్ల ధాన్యంను కొనుగోలు చేశారు. రూ.2 కోట్ల14 లక్షల89వేల వ్యాపారం చేశారు.  మండలంలో 680 మహిళ సంఘాలు ఉండగా 8160 మంది సభ్యులుగా ఉన్నారు. వరిధాన్యంను కొనుగోలు చేసినందున గ్రామ సమైఖ్య సంఘాలకు కమీషన్  డబ్బులను అందిస్తారు. క్వింటాల వరి ధాన్యంను కొనుగోలు చేస్తే, ఏ గ్రేడ్‌కు క్వింటాల రూ. 32రూపాయలను కమీషన్ గా అందిస్తారు. రూ. 4లక్షల యాభైవేల రూపాయలు ధాన్యంను కొనుగోలు చేసిన వీవో సంగాలకు అందుతుంది.  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరిధాన్యం విక్రయించేందుకు హమాలి ఖర్చులకు క్వింటాలకు రూ.22 రూపాయలు రైతులు భరించారు. ఇందులో నుంచి క్వింటాలకు రూ. 5రూపాయలు ప్రభుత్వం రైతుల అకౌంట్‌లలో జమ చేస్తుంది.

ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం
ఐకేపీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలు ద్వారా కమీషన్  ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ సమైఖ్య సంఘాలకు అందిస్తాం. రైతులకు అందించాల్సిన హమాలీ డబ్బులు అందిన వెంటనే రైతుల అకౌంట్‌లలో జమ అవుతాయి. – అరుణ ఐకేపీ, ఏపీఎం మామడ

ఎక్కువ కొనుగోళ్లు చేశాం
ఈ యేడాది వరి ధాన్యంను మా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేశాం. కమీషన్ డబ్బులు అందితే సద్వినియోగం చేసుకుంటాం. గతంలో కంటే కొనుగోళ్లు ఎక్కువ చేయడం సంతోషంగా ఉంది. కమీషన్ ను అందించాలి. –బుజ్వవ్వ, పొన్కల్, వీవో సంఘ సభ్యురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement