womens organizations
-
మహిళా సంఘాలు భేష్
► వరి ధాన్యం కొనుగోలులో ఆదర్శం ► మామడలో రూ. 2 కోట్ల ధాన్యం కొనుగోలు నిర్మల్(మామడ) : రైతులు పండించిన దొడ్డురకం ధాన్యానికి మద్దతు ధరను అందించడంతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు కొనుగోలు చేయడంతో రైతులకు, స్వయం సహాయక సంఘాలకు మేలు జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోళ్లలో మహిళ సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మామడ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 14,289 క్వింటాళ్ల వరి ధాన్యంను ఈ ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చేసి రూ.2 కోట్లకు పైగా మాహిళ సంఘాలు వ్యాపారం చేశారు. ప్రతిఏటా కొనుగోళ్లు.. మండలంలోని 13 గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రెండువేల హెక్టార్లలో చెరువులు, కాలువులు, బోర్ల కింద రైతులు వరి సాగు చేశారు. మండలంలోని పొన్కల్, మామడ, కొరిటికల్, పరిమండల్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించారు. 635 మంది రైతులు వద్ద నుంచి 14,289 క్వింటాళ్ల ధాన్యంను కొనుగోలు చేశారు. రూ.2 కోట్ల14 లక్షల89వేల వ్యాపారం చేశారు. మండలంలో 680 మహిళ సంఘాలు ఉండగా 8160 మంది సభ్యులుగా ఉన్నారు. వరిధాన్యంను కొనుగోలు చేసినందున గ్రామ సమైఖ్య సంఘాలకు కమీషన్ డబ్బులను అందిస్తారు. క్వింటాల వరి ధాన్యంను కొనుగోలు చేస్తే, ఏ గ్రేడ్‌కు క్వింటాల రూ. 32రూపాయలను కమీషన్ గా అందిస్తారు. రూ. 4లక్షల యాభైవేల రూపాయలు ధాన్యంను కొనుగోలు చేసిన వీవో సంగాలకు అందుతుంది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరిధాన్యం విక్రయించేందుకు హమాలి ఖర్చులకు క్వింటాలకు రూ.22 రూపాయలు రైతులు భరించారు. ఇందులో నుంచి క్వింటాలకు రూ. 5రూపాయలు ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఐకేపీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలు ద్వారా కమీషన్ ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ సమైఖ్య సంఘాలకు అందిస్తాం. రైతులకు అందించాల్సిన హమాలీ డబ్బులు అందిన వెంటనే రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. – అరుణ ఐకేపీ, ఏపీఎం మామడ ఎక్కువ కొనుగోళ్లు చేశాం ఈ యేడాది వరి ధాన్యంను మా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేశాం. కమీషన్ డబ్బులు అందితే సద్వినియోగం చేసుకుంటాం. గతంలో కంటే కొనుగోళ్లు ఎక్కువ చేయడం సంతోషంగా ఉంది. కమీషన్ ను అందించాలి. –బుజ్వవ్వ, పొన్కల్, వీవో సంఘ సభ్యురాలు -
రుణమో రామచంద్రా..!
మూడు జిల్లాల్లో నిలిచిన ఎస్‌హెచ్‌జీ రుణాలు 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సింది రూ.763.54 కోట్లు నవంబర్ నాటికి కేవలం రూ.234.22 కోట్ల చెల్లింపులు రుణాల కోసం 33,324 సంఘాల ఎదురుచూపులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు క్యాష్‌లెస్ లావాదేవీలతో కొత్త తిప్పలు సంఘాల తీర్మానంతోనే రుణాలు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆదేశాలు నల్లగొండ : మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వలలో చిక్కుకుని మహిళా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాలకు చెల్లించాల్సిన లింకేజీ రుణాలను బ్యాంకులు నిలిపేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి.. వారిని అన్ని రంగాల్లో బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరవుతుంటాయి. అదే పద్ధతిలో ఈ ఏడాది కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. అప్పటికే జిల్లాల పునర్విభజనలో అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రుణాలివ్వడంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. దీంతోపాటు ప్రభుత్వం విడుదల చేయాల్సిన పావలా వడ్డీ రాయితీ కూడా బ్యాంకుల్లో జమ కాలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా మొండికేశారు. ఇదే క్రమంలో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో రుణాల మంజూరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇదీ పరిస్థితి.... 2016–17కుగాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 43,825 సంఘాలకు రూ. 763.54 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ మేరకు అక్టోబర్ మాసాంతానికి కేవలం 10 ,501 సంఘాలకు రూ.234.22 కోట్లు మంజూరు చేశారు. నిర్ధారించిన లక్ష్యం ప్రకారం బ్యాంకులు నవంబర్ నాటికి 21,898 సంఘాలకు రూ.397.61 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ.. పది వేల సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చాయి. దీంతో 33,324 సంఘాలు రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. మండలాల వారీగా ఇలా.. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలో 737 సంఘాలకు రూ.15.21 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 85 సంఘాలకు రూ.3.47 కోట్లు ఇచ్చారు. మిర్యాలగూడ మండలంలో 1,338 సంఘాలకు రూ.26.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 387 సంఘాలకు రూ.11.28 కోట్లు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో 1313 సంఘాలకు రూ.21.93 కోట్ల రుణాలు ఇవ్వాలి. 262 సంఘాలకు రూ.7.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. చివ్వెంల మండలంలో 765 సంఘాలకు రూ.13.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 69 సంఘాలకు రూ.2.15 కోట్లు ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలంలో 783 సంఘాలకు రూ.12.49 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్దేశించగా.. 166 సంఘాలకు రూ.3.59 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వలిగొండ మండలంలో 1,049 సంఘాలకు రూ.18.59 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 255 సంఘాలకు రూ.7.19 కోట్లు చెల్లించారు. తీర్మానం తప్పనిసరి.. రుణాలు రాక సంఘాలు సతమవుతున్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహి ంచడం కోసం చేపట్టిన చర్యలు సంఘాలను మరింత ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. సంఘం లోని ప్రతి సభ్యురాలికి బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉంటే తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లే కుండా పోయింది. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కు కలిగిన సంఘ సభ్యురాలికి మాత్రమే రుణం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. గతంలో రుణం మంజూరైన సంఘం బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని డ్రా చేసి సభ్యులకు పంచడం చేసేవారు. ప్రస్తుతం నగదు ర హిత లావాదేవీల వైపు మహిళా సంఘాలను మళ్లించాలన్న నిర్ణయంతో కొత్త నిబంధన వి ధించారు. రుణ మంజూరు పొందిన సంఘం సభ్యుల ఆమోదంతో తప్పనిసరిగా తీర్మానం చేయాలి. ఈ పత్రాన్ని బ్యాంకులకు అందజేయాలి. తీర్మాన పత్రంలో సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్లు రాయాలి. దీంతో బ్యాంకర్లు రుణ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత సభ్యులు ఏటీఎం నుంచి నగదు పొందాలి. సభ్యులు మరొకరి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తే చెక్కులు ఉపయోగించుకోవాలి. మొత్తంగా ఇక ముందు బ్యాంకుల నుంచి రుణాలు పొందే సంఘాలు నగదు రహిత లావాదేవీలనే కొనసాగించాలి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్రస్థాయిలో సీసీలకు, ఏపీఎంలకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మాసాలే గడువు... ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగియనుంది. ఈ మూడు నెలల్లో బ్యాంకులు 33,324 సంఘాలకు రూ.529.32 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉంది. నోట్ల రద్దు సమస్య నుంచి బ్యాంకులు ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయిలో బ్యాంకులకు నగదు నిల్వలు చేరుకోలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత స్వల్ప వ్యవధిలో బ్యాంకులు ఏమేరకు రుణ లక్ష్యాన్ని పూర్తిచేస్తాయో వేచిచూడాల్సిందే. -
స్త్రీ నిధి అందేదెన్నడో..?
► జిల్లాలో 52,653 మహిళా సంఘాలు ► స్త్రీ నిధి రుణాల లక్ష్యం రూ.146 కోట్లు ► డ్వాక్రా సంఘాలకు ఇచ్చింది రూ.26 కోట్లే.. ► మహిళల దరి చేరని ప్రభుత్వ పథకాలు ► గ్రామాల్లో అవగాహన కల్పించడంలో అధికారులు వైఫల్యం పర్చూరు : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి.. పురుషులకు దీటు గా చట్టసభల్లో సైతం వారికి సమాన హక్కులు ఉండాలంటూ ప్రతి వేదికపై రాజకీయ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మినహా వారికి ఒరిగిందేమీ లేదు. మహిళలను ఆర్థికంగా చైతన్యవంతుల్ని చేయాలని వారి కాళ్లపై వారు నిలబడేలా స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలు వారి దరి చేరలేదు. ముఖ్యంగా వారికి మహిళా సంఘాల్లో సభ్యులకు ఆపద వస్తే ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పథకం లక్ష్యం కూడా జిల్లాలో నీరుగారుతోంది. ఓవైపు స్త్రీనిధి రుణాల మంజూరు వేగవంతం చేయాలని వెలుగు ఏపీడీలు మండలాల్లో తిరిగి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా రుణాల మంజూరు ముందుకు సాగక పోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపదలో ఆసరాగా ఉండేందుకు.. మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నప్పటికీ అత్యవసర సమయాల్లో సంఘాల సభ్యులకు ఆపద వస్తే ఆసరాగా ఉండేందుకు స్త్రీ నిధి రుణ పథకాన్ని వెలుగు ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈ పథకంలో అర్హత పొందేందుకు సంఘంలో పొదుపు రూ. 4800 ఉంటే రుణం పొందడానికి అర్హత సాధిస్తారు. ఈ పథకంలో ఒక్కో సంఘానికి రూ. 1.5 లక్షలు రుణాలు అందిస్తారు. ఉత్తమమైన గ్రామ సంఘాలకు, ఉత్తమ గ్రూపులకు చెందిన ఇద్దరి నుంచి ముగ్గురు సభ్యుల వరకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు రుణ సదుపాయం పొందవచ్చు. ఇలా ఏడాదికి ఒక్కో మండలానికి రూ. 50 లక్షల రుణ లక్ష్యాన్ని ప్రభుత్వాన్ని నిర్థేశించింది. 2016-17లో 8 నెలలు పూర్తి అవుతున్నా.. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే పూర్తి కావడం గమనార్హం. 2017 మార్చి లోగా ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడం గగనమే.. రుణ మంజూరులో అధికారుల నిర్లక్ష్యం.. జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో మొత్తం 52,653 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు స్త్రీనిధి పథకంపై అవగాహన కల్పించి ఈపథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బుక్ కీపర్లు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. రుణ సదుపాయం కోసం అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. యర్రగొండలపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలానికి రూ. 89.34 లక్షలు, దోర్నాల మండలానికి రూ. 13.5 లక్షలు, దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలానికి రూ. 151.29 లక్షలు, కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు మండలానికి రూ. 23.22 లక్షలు, వెలిగండ్ల మండలానికి రూ. 10.79 లక్షల నిధులు స్త్రీ నిధి రుణం కింద కేటాయించారు. అక్కడి అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామాల్లోని సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వకపోవడం గమనార్హం. నియోజకవర్గం డ్వాక్రా సంఘాల స్త్రీనిధి లక్ష్యం రుణాలు రుణాలు సంఖ్య రూ.లక్షల్లో ఇచ్చినది ఇవ్వాల్సింది. 1. యర్రగొండపాలెం 3806 408.21 31.47 376.74 2. దర్శి 4,620 1078.69 251.1 827.59 3. పర్చూరు 6,223 1953.77 321.2 632.57 4. అద్దంకి 5,554 2044.11 326.31 1717.80 5. చీరాల 2,870 1523.89 496.11 1027.78 6. సంతనూతలపాడు 4,505 1477.38 226.34 1251.04 7. ఒంగోలు 1,743 1188.53 95.98 1092.55 8. కందుకూరు 4,848 951.54 126.35 825.19 9. కొండపి 6,243 940.23 248.21 692.02 10. మార్కాపురం 3,454 1378.41 239.95 1138.46 11. గిద్దలూరు 4,924 1563.2 150.13 1413.07 12. కనిగిరి 3,863 503.86 90.43 413.43 అందరికీ అవకాశం కల్పించాలి స్త్రీనిధి పథకంలో అన్ని సంఘాల సభ్యులకు అవకాశం కల్పించాలి. నిర్దేశించిన గడువులోగా రుణాలు అందించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. రుణాలు సకాలంలో చెల్లిస్తున్న తరుణంలో రుణాలు మంజూరు వేగవంతం చేయాలి. - జ్యోతి జయకుమారి, పర్చూరు మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్యం చేరుకుంటాం 2016-17లో స్త్రీ నిధి పథకానికి సంబంధించి నిర్దేశించిన గడువులోగా తప్పకుండా లక్ష్యం చేరుకుంటాం. ఇప్పటికే దిగువస్థాయిలో అవగాహన కల్పించి వచ్చే ఏడాది మార్చి నాటికి మంజూరైన లక్ష్యం పూర్తి చేస్తాం.- కామేశ్వరరావు, స్త్రీ నిధి డివిజనల్ మేనేజర్ -
మహిళా సంఘాల నిధులకు టోకరా
గతంలో నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తాజాగా గ్రామ సంఘం నిధుల కైంకర్యం సుమారుగా రూ. 4 లక్షలకు ఎసరు టీడీపీ నాయకుడి బరితెగింపు కొంతమంది వ్యక్తుల తీరు కారణంగా లావేరు మండలం బుడతవలస గ్రామం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. గతంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రణస్థలం ఆంధ్రాబ్యాంకు నుంచి ఒకే కుటుంబ సభ్యుల పేరుతో రూ. 40 లక్షలకు పైగా రుణాలు కాజేసిన గ్రామస్థాయి టీడీపీ నాయకుడు తాజాగా గ్రామ సంఘాల నిధులను కూడా సభ్యులకు తెలియకుండా తన సొంత ప్రయోజనాలకు వాడేసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తే దీనికి బాధ్యులనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్: లావేరు మండలం బుడతవలన గ్రామ మహిళా సమాఖ్యకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా సుమారు రూ. 4 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులు కొండ ప్రాంతాల్లో ఉండే గ్రామ సంఘాలకు అందజేయూల్సి ఉంది. ఈ నిధులతో ఆ గ్రామ సంఘం వ్యవసాయ పరికరాలైన నాగళ్లు, నీటి ఇంజన్లు, ఎరువులు, విత్తనాలు వంటివి రైతులకు సరఫరాల చేసి వాటి ద్వారా ఆదాయమార్గాలను పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఈ నిధులను డ్వామా అధికారులు బుడతవలస గ్రామ సమాఖ్య పేరున రణస్థలం ఆంధ్రాబ్యాంకు ఖాతాలో (ఖాతా నంబర్: 04951000072448) రూ. 4,12,000 జమ చేశారు. అరుుతే ఈ నిధులను సభ్యులకు తెలియకుండా టీడీపీ నాయకుడు విత్‌డ్రా చేసినట్టు సమాచారం. ఈ నిధులకు సంబంధించి జూలై 14న రూ.1,95,000 నీలం ఆగ్రోవర్కు కి (247270 నంబరు డీడీని) చెల్లించారు. అలాగే సాయి సంతోష్ ఆగ్రీ వర్కు పేరిట (డీడీ నంబర్ 247269)తో మరో రూ. 95,000, రఘురామ ఆగ్రీవర్కుల పేరిటతో (డీడీ నంబర్ 247271) మరో 40 వేల రూపాయలను చెల్లించారు. తాజాగా ఈనెల 16వ తేదీన రూ. 82,000లు రంగారావు ఆగ్రోవర్కులు పేరిట డీడీని చెల్లించారు. ఈ డీడీలు మొత్తం గ్రామ సామాఖ్య నుంచి రణస్థలం ఆంధ్రాబ్యాంకు ద్వారా చెల్లించినట్టుల రికార్డులు చెబుతున్నారుు. అయితే ఈ డీడీల పేరిట తీసుకున్నవి వ్యవసాయ సామగ్రి కాదు. మహిళా సంఘం పేరుతో కూడా కాదు. బుడతవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి పేరుతో ఉన్నారుు. తీసుకున్నవి కూడా ట్రాక్టర్, ట్రక్కు, దుక్కి, దమ్ము సెట్లు. దీని వెనుక అవినీతి దాగి ఉందనే విమర్శలు వస్తున్నారు. పోర్జరీ సంతకాలు ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామ సంఘం సామగ్రి కొనుగోలు చేయూలంటే ముందుగా గ్రామ సమాఖ్య తీర్మాణం తప్పనిసరి. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. గ్రామ సంఘం తీర్మానంలో ఉన్న సంతకాలు పూర్తిగా పోర్జరీవని, తాము ఇప్పటివరకు ఐడబ్ల్యూఎంపీఈ పథకం కింద వచ్చిన నిధులకు ఎటువంటి తీర్మానం చేయలేదని గ్రామ సమాఖ్య సభ్యులు కె.రమణమ్మ, గృహలక్ష్మి, సత్యవతి, ఆర్.రమణమ్మలు తెలిపారు. గతంలో గ్రామంలో పలు రకాల నిధులు దుర్వినియోగం కావడంతో గ్రామ సమాఖ్య నిధుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అరుుతే తమ సంతకాలను పోర్జరి చేసి సమాఖ్యకు కేటారుుంచిన నిధులను కైంకర్యం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమాఖ్యకు చెందిన నాలుగు లక్షల రూపాయలతో టీడీపీ నాయకుడు ట్రాక్టరును కొనుగోలు చేసి స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారని వాపోయూరు. ఈ అవినీతిలో వెలుగు పథకం సిబ్బంది అరుున ఏపీఎం, సీసీల పాత్ర ఉన్నట్టు సమాచారం. అవినీతికి అండగా టీడీపీ నేతలు బుడతవలసలో అవినీతికి పాల్పడుతున్న టీడీపీ గ్రామస్థారుు నాయకుడికి ఆ పార్టీకి చెందిన పెద్దల ఆండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నారు. గతంలో నకిలీ పాస్ పుస్తకాలతో రూ. 40 లక్షలు రుణాలు తీసుకున్నట్టు రుజువైనా ఇప్పటి వరకూ అధికారులు సంబంధిత వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుసుకోలేదు. టీడీపీ పెద్దల ఒత్తిళ్ల కారణంతోనే వక్రమార్గంలో రుణాలు తీసుకున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఈసారి మహిళా సంఘాలకు చెందిన నిధులను నొక్కేశాడని స్థానికులు మండిపడుతున్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవు ఐడబ్ల్యూఎంపీఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అవసరమైతే రికవరీ చేస్తాం. నిధులు మంజూరు వాస్తవమేనని, అయితే వాటికి బిల్లులు, ఇతర అంశాలు తమకు చేరలేదు. దర్యాప్తు చేస్తున్నాం. -ఆర్.కూర్మనాథ్, డ్వామా పీడీ చర్యలు తీసుకుంటాం గ్రామ సంఘాల నిధుల వినియోగంలో గ్రామ పెద్దలకు సంబంధం లేదు. నిధుల డ్రాపై పూర్తి సమాచారం తెలుసుకుంటాను. దీనిపై విచారణ జరిపించి, అవినీతి వాస్తవమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -జి.సి.కిశోర్‌కుమార్, డీఆర్డీఏ పీడీ -
శానిటేషన్ స్టోర్ల ఏర్పాటు
బ్రహ్మసముద్రం : జిల్లా వ్యాప్తంగా12 మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని వేగవంతం చేయడానికి మహిళా సంఘాల అధ్వర్యంలో మండలకేంద్రాలలో రూరల్ రీటేయిల్,చెయిన్ పద్ధతిన శానిటేషన్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఏం సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో ‘సాక్షి’తో మట్లాడారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతు జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలాలైన,బ్రహ్మసముద్రం, గుమగట్ట, కంబదూరు, ఉరవకొండ, వజ్రకరూరు, గుత్తి, శింగనమల, గుడిబండ, మడకశిర, సోమందేపల్లి, నల్లమాడ, తనకల్లు మండలాల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన బేసిన్లు పైపులు, సిమెంట్, నేలలో వేసేందుకు అవసరమైన సిమెంట్ రింగులు తదితర సామాన్లను లబ్ధిదారులకు అప్పుగా అందించి బిల్లుల మంజూరు సమయాన ఇచ్చిన వస్తువులకు సరిపడా బిల్లును మినహాయించుకొని ఇవ్వనున్నట్లు అయన తెలిపారు. ఈ ప్రకియ వల్ల పనులు వేగవంతం అవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలను సీసీలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రతిమండలంలోను ఆగస్టు15లోపు ఒక గ్రామంలో సంపూర్ణ స్వచ్ఛభారత్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో హెచ్డీ రామేశ్వరరెడ్డి, ఎపీఏం సాంబశివుడు, జననీమండలసమాఖ్య అధ్యక్షురాలు పుష్పావతి పాల్గొన్నారు. -
పల్లెల్లో బెల్టు పాటలు
గ్రామాల్లో అనధికార మద్యం షాపులకు వేలం రూ. లక్షలు పలుకుతున్న వైనం మద్యం సిండికేట్లు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహారం పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు మహిళా సంఘాల ఆందోళన బెల్టు షాపులన్నీ తొలగిస్తాం.. మద్యాన్ని నియంత్రిస్తాం.. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అనేక హామీల్లో ఇదొకటి. అధికారంలోకి వచ్చాక అన్ని హామీల్లాగే దీన్ని కూడా తుంగలో తొక్కేశారు. నియంత్రణ మాట దేవుడెరుగు ఇప్పుడు బెల్టు షాపు లేని గ్రామమే లేదు. ఇవి ఏర్పాటు చేయడమే ఒక నేరమైతే వాటికి దర్జాగా వేలం పాటలు కూడా నిర్వహించేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక చాలా చోట్ల అధికార పార్టీ నేతలు ఉండటంతో అధికారులు కూడా చేతులు కట్టుకొని కూర్చున్నారు. చోడవరం : గ్రామాలు మద్యం మత్తులో తేలుతున్నాయి. ఇప్పుడు ఏగ్రామంలో చూసినా బెల్టుషాపులకు వేలం పాటల సందడే కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే బెల్టులు తీసేసి, మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత మద్యంపై రూ.వేల కోట్ల ఆదాయం పెంచడమే ధ్వేయంగా విధానాలు రూపొందించారు. గతంలో ఉన్న లెసైన్సు మొత్తాన్ని ఈ ఏడాది భారీగా పెంచడం, అదనంగా లెసైన్సులు ఇవ్వడం, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో 3 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ లెసైన్సు మద్యం దుకాణాలు వెలిశాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి లెసైన్డ్ మద్యం షాపులు లేని ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ విధానం చట్టవిరుద్ధమైనా వాటిని పట్టించుకునే ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ల కన్నుసన్నల్లోనే ఉండటంతో పట్టించుకునే నాధుడే లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. కల్తీ.. అధిక ధరలు: ఈ పరిస్థితిలో ప్రస్తుతం బెల్టుషాపుల కోసం గ్రామాల్లో జోరుగా వేలం పాటలు సాగుతున్నాయి. గత ఏడాది గ్రామానికి ఒకటి ఉంటే ఈ సారి రెండు, కాస్త పెద్ద గ్రామమైతే మూడు బెల్టుషాపులు కూడా పెడుతున్నారు. గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉన్న కొందరు గ్రామ పెద్దలతో గ్రామానికి కొంత సొమ్మును ఇచ్చి, ఎవరు ఎక్కువ పాటపాడితే వారికే బెల్టుషాపు ఇచ్చేలా ఈ వ్యవహారం సాగుతోంది. బెల్టుషాపుల వల్ల మద్యం అమ్మకాలు పెంచి లాభాలు ఆర్జించేందుకు మద్యం వ్యాపారులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. బెల్టు షాపుల్లో లూజుగా మద్యాన్ని విక్రయిస్తుండటంతో కల్తీ కూడా జోరుగా జరుగుతోంది. బ్రాండెడ్ మద్యంలో చీఫ్ లిక్కర్, నీళ్లు కలుపుతున్నారు. పైగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. లక్షల్లో వేలం పాట: ఇటీవల కాలంలో లెసైన్సు దుకాణాల్లో అమ్మకాల కంటే గ్రామాల్లో బెల్టు షాపుల అమ్మకాలే ఎక్కువగా ఉండటంతో సిండికేట్లు బెల్టుల నిర్వహణలో పోటీపడుతున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో బెల్టుషాపుల వేలం రూ.లక్షల్లో జరుగుతోంది. చోడవరం మండలం పీఎస్‌పేటలో ఒక బెల్టు షాపునకు గత ఏడాది రూ.2.60 లక్షల వేలం జరగగా ఈ ఏడా ది తాజాగా జరిగిన పాటలో ఏకంగా రూ.3.5 లక్షలకు పాడుకున్నారు. ఇదే తరహాల్లో ప్రతి గ్రామంలోనూ రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు బెల్టు వేలం జరుగుతోంది. ఒక్కో మండలంలో ఏటా బెల్టు వేలం పాట రూ.కోటికి పైగా జరుగుతోంది. గత ఏడాది రూ.40 వేలు ఉన్న బెల్టుషాపు ఈ ఏడాది రెట్టింపైంది. ప్రభుత్వం చీఫ్లిక్కర్ను మార్కెట్లోకి తేవడంతో బెల్టుషాపులకు మంచి గిరాకీ వచ్చింది. ఒక్క చోడవరం నియోజకవర్గంలోనే 290కి పైగా బెల్టుషాపులు ఉన్నాయంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఎన్ని వందల షాపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. లెసైన్సు షాపులు లేని గ్రామాల్లో సైతం బెల్టుషాపుల పుణ్యమా అని విచ్చలవిడిగా మద్యం దొరకడంతో గ్రామీణ యువత ఎక్కువ శాతం మద్యానికి బానిసలు అవుతున్నారని ఇటీవల ప్రజాసంఘాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బెల్టుషాపులు పెడితే అరెస్టులు చేస్తామని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు గత ఏడాది పెట్టిన కేసులు కనీసం 5 శాతం కూడాలేకపోవడం వారి నిబద్ధతకు అద్దంపడుతోందని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. -
మహిళ కంట్లో ‘ఇసుక’
వ్యాపారంలో మహిళా సంఘాలు అప్పులపాలయ్యూరుు. అధికార పార్టీ పెద్దలు రూ.కోట్లు వెనకేసుకుంటే నిబంధనలకు లోబడ్డ ఈ సంఘాలకు రుణభారమే మిగిలింది. రోజుకో విధానం మార్చుతూ సర్కారు గందరగోళం చేసింది. ర్యాంపుల నిర్వహణ కింద వెచ్చించిన మొత్తాలను చెల్లించాలంటూ మూడు మహిళా సంఘాలు కోర్టుకెక్కాయి. బకాయిలు చెల్లించడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. * ఇసుక వ్యాపారంలో మహిళాసంఘాలు అప్పులపాలు * కోర్టును ఆశ్రయించిన కొన్ని సంఘాలు * ఇసుక కోసం డీడీలు తీసిన వారిది అదే పరిస్థితి శ్రీకాకుళం టౌన్: వంశధార.. నాగావళి నదుల్లో 34చోట్ల ఇసుక తవ్వకాలను ప్రభుత్వం మహిళాసంఘాలకు అప్పగించింది. ఏడాదిపాటు వాటితోనే అమ్మకాలు సాగించాలని సంఘాలతో పెట్టుబడులు పెట్టించింది. ర్యాంపుల వరకు రోడ్లు వేయించింది. తర్వాత యంత్రాలను సహితం అద్దెకు తెచ్చుకోమని చెప్పింది. ఒక్కోప్రాంతంలో ఒక్కో సంఘం ఈ బాధ్యతలను తీసుకుంది. తీరా బ్యాంకుల్లో ఉన్న సొమ్మున పెట్టుబడి పెట్టాక కొన్ని చోట్ల ర్యాంపులు ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల వ్యాపారమే జరగలేదు. దీనికితోడ 17 ర్యాంపుల్లో వ్యాపారం మొదలయ్యూక అధికార పార్టీ నేతల పెత్తనం ఆరంభమైంది. తాజాగా అసలు ర్యాంపులను మహిళా సంఘాల నుంచి తప్పించింది. మైనింగ్ అధికారులకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాలు విస్తుపోయాయి. టీడీపీ ప్రభుత్వం ఇసుకపై సరైన విధానం అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు అవస్థలు పడ్డారుు. తొలుత మొదట మహిళా సంఘాలకు తవ్వకాలను కట్టబెట్టారు. వారి నుంచి ఇసుక పొందాంటే మీసేవా కేంద్రాల్లో డీడీలు చెల్లించి తర్వాత ర్యాంపుల వద్ద వాటిని అందజేస్తే తప్ప ఇసుక సరఫరా జరిగేది కాదు. కొన్నాళ్లు నదిలోని ఇసుకను రేవులనుంచి డంపింగ్ యార్డులకు చేరవేసి అమ్మకాలు జరిపేవారు. అలా అమ్మకానికి ఉంచిన రూ.36లక్షల విలువైన ఇసుక ఇప్పటికీ పలాస వద్ద కుప్పలుగా పడిఉంది. ఇసుక ఉచితమనేసరికి కొనేవారు లేక కుప్పలు తెప్పలుగా వదిలేశారు. ఆ ఇసుక కోసం మహిళా సంఘాలు రూ.36లక్షలు ఖర్చు చేశాయి. దీనికి తోడు కొన్ని చోట్ల ర్యాంపుల నిర్వహణకు పెట్టుబడులు పెట్టారు. ఇసుక తవ్వకుండా వాటిని నిలుపుదల చేశారు. జిల్లాలో 34 ర్యాంపులకు గతంలో అనుమతిస్తే నిర్వహణ కింద స్వయంశక్తి సంఘాలు సొంత సొమ్ము వెచ్చించాయి. యంత్రాల అద్దెలతో పాటు ర్యాంపుల వరకు వేసిన రోడ్లు, ఇతర అవసరాలకు రూ.లక్షల్లోనే ఖర్చుచేశాయి. అయితే పెట్టుబడులు చేతికందకుండానే పాలసీ మారిపోయింది. పోనీ ఇసుక అమ్ముదామంటే జన్మభూమి కమిటీలు పెత్తనం చేస్తున్నాయి. దీంతో ఇసుక నిర్వహణకు ముందుకు వచ్చిన కొన్ని సంఘాలు అప్పులపాలైయ్యాయి. 17 సంఘాలకు సుమారు రూ.60 లక్షలకు పైగా బకాయిలున్నాయి. వీటన్నింటికి అధికారుల దగ్గర సమాధానం కరువవుతోంది. ఆమదాలవలస నియోజక వర్గానికి చెందిన తోటాడ, అక్కివరం, సింగూరు ర్యాంపుల్లో కూడా మహిళా సంఘాలు చేతులు కాల్చుకున్నాయి. రూ.9లక్షలు ఖర్చు పెట్టాక ఇసుక విధానం మారిపోయింది. దీంతో సంఘాలు నష్టపోయాయి. ఈ నిధులు ఎవరిస్తాంటూ ఆ మూడు గ్రామాలకు చెందిన స్వయంశక్తి సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మరోపక్క ఇసుక కోసం వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2.20కోట్లుచెల్లించారు.. డీడీలు చెల్లించి మూడునెలలు గడిచినా ఇంతవరకు చెల్లింపులు జరగక పోవడంతో ఇసుక వ్యాపారులు కాళ్లు అరిగేలా డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మహిళాసంఘాలకు పెట్టబడుల మొత్తాలు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం యోచిస్తోందని డీఆర్డీఏ పీడీ తనూజారాణి సాక్షికి చెప్పారు. -
కూతుళ్లు పుట్టారని వేధిస్తున్నాడు..
ముగ్గురు కూతుళ్లు పుట్టారని ఓ ప్రబుద్ధుడు భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగి పోయిన భార్య ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లావణ్య(30)కు పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు కూతుళ్లు పుట్టారు. దీంతో భర్త ఆమెను మానసికంగా, శారికకంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేని లావణ్య మహిళా సంఘాల సాయంతో ఈ రోజు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. -
సభకు నమస్కారం
► ఆర్భాటంగా ‘కాపు’ రుణమేళా ► అంతంత మాత్రంగానే హాజరైన లబ్ధిదారులు ► జనం లేకపోవడంతో అధికారుల టెన్షన్ ► కాపు నేతలకు ఫోన్ చేసి హడావుడి ► మహిళా సంఘాల సభ్యులు, ముస్లింలు, విద్యార్థుల తరలింపు ► నేతలు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన వైనం అనంతపురం టౌన్ : ‘ఇప్పటికే ఆలస్యమైంది. సభకు నమస్కారం చేసి రెండు నిమిషాలు మాట్లాడండి. వీలైతే నిమిషంలో ముగిస్తే మంచిది’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పదేపదే నాయకులను కోరగా... జనం కూడా అచ్చం ఆయనలాగే ఆలోచించారు. సభ నుంచి ఒక్కొక్కరు జారుకున్నారు. శనివారం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ మైదానంలో కాపు రుణమేళాను ఆర్భాటంగా నిర్వహించారు. అయితే.. ఆశించిన స్థాయిలో స్పందన కన్పించలేదు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ గంట ఆలస్యమైంది. జన సమీకరణ కోసం ఒక రోజు ముందు నుంచే అటు అధికారులు, ఇటు టీడీపీకి చెందిన కాపు నేతలు నానా తంటాలు పడ్డారు. అయినప్పటికీ శనివారం ఉదయం సభ ప్రారంభానికి ముందు ఆశించిన స్థాయిలో జనం కన్పించలేదు. పరువుపోతుందని భావించిన అధికారులు.. కాపు నేతలకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. తాము ఇప్పుడేమీ చేయలేమని వారు చేతులెత్తేయడంతో చివరకు జన సమీకరణ బాధ్యతను అధికారులే తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 2,460 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. వారిలో కూడా చాలా మంది సభకు రాలేదు. దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా రావాలని, రెండో దశలో రుణాలు ఇప్పిస్తామని కాపు నేతలు హామీలు గుప్పించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మహిళా సంఘాల సభ్యులు, మైనార్టీలు, విద్యార్థులను సభకు తరలించారు. తప్పనిసరిగా రావాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని హుకుం జారీ చేయడంతో తాము వచ్చినట్లు కొందరు మహిళలు ‘సాక్షి’కి తెలిపారు. వారినైతే సభ వరకు రప్పించగలిగారు గానీ చివరి వరకు కూర్చోబెట్టలేకపోయారు. మంత్రులు ప్రసంగిస్తుండగానే ఎవరికి వారు వెళ్లిపోయారు. చివరి దాకా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే మిగిలారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అటు ప్రజలు సందర్శించకపోగా.. మంత్రులు కూడా పట్టించుకోలేదు. సభ చివరలో కొందరు లబ్ధిదారులకు మంత్రులు చెక్కు, రుణ మంజూరు పత్రాలు అందించారు. వారంతా టీడీపీ నేతల అనుచరులు, కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. కాపు సంక్షేమమే ధ్యేయం కాపు రుణమేళాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పార్థసారథి, హనుమంతరాయ చౌదరి, ఈరన్న, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్ , మేయర్ స్వరూప, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య, డెరైక్టర్ రాయల్ మురళి, వేణుగోపాల రాయుడు మాట్లాడారు. కాపుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల హామీలను చంద్రబాబు దశలవారీగా అమలు చేస్తున్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశామని, తొమ్మిది నెలల్లో నివేదిక అందగానే రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్ జగన్ తీరు సరిగా లేదని ఆరోపించారు. సభలో కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
గంగదేవి పల్లి స్పూర్తితో
ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఊరూ శుభ్రంగా ఉంటుంది. ఈ సూత్రాన్నే ఆ గ్రామస్తులు పాటించారు. వారికి అధికారుల సాయం అందింది. ఊరూవాడా కదిలింది....ఆ పల్లె కళకళలాడింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్ గ్రామం ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామ మహిళలు.. ఇటీవల గంగదేవిపల్లి, హాజిపల్లి గ్రామాలను సందర్శించి వచ్చారు. తమ గ్రామం కూడా వాటిలాగే పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు. అనుకోవడమే ఆలశ్యం... శ్రమదానంతో ఊరంతా శుభ్రం చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టారు. గ్రామంలో బుధవారం 200 మంది మహిళలు శ్రమదానం చేశారు. వీధులు, రోడ్లను శుభ్రం చేశారు. వీరికి పురుషులు కూడా కలిశారు. ఎవరి ఇంటి ముందు రోడ్లను వారే నిత్యం శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రమదానానికి రాని వారికి జరిమానా వేశారు. ఇకమీదట ప్రతినెలా 14వ తేదీన ఊరంతా శ్రమదాన దినంగా పాటించాలని నిర్ణయించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేసిన ఈ గ్రామానికి ప్రభుత్వం కూడా చేయూత నిచ్చింది. మరుగుదొడ్లు మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఒకే సారి 170 మరుగుదొడ్ల నిర్మాణం మొదలైంది. వీటి నిర్మాణం కోసం మహిళా సంఘాలు సిమెంట్ ఇటుకలను గ్రామంలోనే తయారు చేస్తున్నారు. -
మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ
కర్నూలు (అర్బన్) : రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పి. విజయకుమార్ చెప్పారు. మంగళవారం ఆయన కర్నూలులో స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఒడిశాలో భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జలాశయాలు కళకళలాడుతున్నాయన్నారు. కోస్తాంధ్ర, గోదావరి బెల్ట్‌లో కూడా పంటలు బాగానే ఉన్నాయని చెప్పారు. నెల్లూరు, ప్రకాశంతోపాటు రాయలసీమ నాలుగు జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, 43 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గాను 13 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారని తెలిపారు. ఆగష్టు 15వ తేదీ వరకు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోతే రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాల్సి ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని తంగడంచె భూముల్లో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు. -
ఏయ్.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి?!
సాక్షి, విజయవాడ బ్యూరో: సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన మహిళా సంఘాల నేతలపై చంద్రబాబు పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి’ అంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. దీనిపై వారు అభ్యంతరం తెలపడంతో క్షమాపణలు చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వామపక్ష మహిళా సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సు తర్వాత మహిళలంతా ర్యాలీగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారించి సీఎం వద్దకు 10 మందిని అనుమతించారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని, దీనివల్ల వారు ఇబ్బంది పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం నేత ఎం.లక్ష్మి చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల జేబులో వేసుకోవడానికి ఎంతంటే అంత డబ్బులు ఇవ్వలేమని, ఉపాధి కోసమే డబ్బు ఇస్తామని చెప్పారు. ఇతర నేతలు ఇసుక ర్యాంపుల్లో మహిళలకు 25 శాతం వాటా రావాల్సివున్నా రావడంలేదని, రూ.150 కూలి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దీంతో సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఏయ్ ఎక్కువమాట్లాడుతున్నావేంటి.. నువ్వు నాకు చెప్పాలా’ అని లక్ష్మిపై విరుచుకుపడ్డారు. మిగిలిన నేతలు అభ్యంతరం చెప్పడంతో... సీఎం క్షమాణలు చెప్పారు. అనంతరం గుడి, బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు పెడుతున్నారని, దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా... ఎక్కడున్నాయో చూపించాలని గద్దించారు. రామకృష్ణాపురం బుడమేరు వంతెన దగ్గరే బెల్టుషాపు ఉందని దీంతో ఏపీ మహిళా సమాఖ్య నేత చెప్పగా... దాని సంగతి చూస్తానంటూ వెళ్లిపోయారు. తాము మాట్లాడుతుండగానే సీఎం వెళ్లిపోవడంపై మహిళా సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు బయటకు పంపించివేశారు. ప్రగతిశీల మహిళా సంఘం నేత లక్ష్మి మాట్లాడుతూ... ఇలాంటి సీఎంను ఎప్పుడూచూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.250 కోట్లు
హైదరాబాద్: డ్వాక్రా మహిళా సంఘాలకు మూలధన పెట్టుబడి కింద ప్రభుత్వం రూ. 250 కోట్లు మంజూరు చేసింది. డ్వాక్రా మహిళా సంఘాలకు మూలధన పెట్టుబడి కింద 2015- 16 బడ్జెట్లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పథకాల అమలుకు రూ. 1287 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ. 250 కోట్లను డ్వాక్రా మహిళా సంఘాల మూలధన నిధి పెట్టుబడి కింద వినియోగించుకునేందుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఈమేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘అభయ’మేదీ!
►అభయహస్తం లబ్ధిదారులు : 11,525 మంది ►నెలవారీగా చెల్లించాల్సింది : రూ.57.62 లక్షలు ►నాలుగు నెలలుగా పెండింగ్ : రూ.2.30 కోట్లు నిలిచిపోయిన అభయహస్తం పింఛన్లు పంపిణీపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం పథకం ఉందో.. లేదో.. తెలియని పరిస్థితి నాలుగు నెలలుగా మహిళల ఎదురుచూపు రోజుకో రూపాయి చొప్పన పోగేసి ‘అభయ హస్తం’ ప్రీమియం చెల్లిస్తున్న మహిళలు.. అసలు పథకం కొనసాగుతుందో లేదోనన్న డైలమాలో పడ్డారు. ప్రభుత్వం అభయహస్తం పింఛన్లపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం పథకం కొనసాగింపుపై అనుమానాలను పెంచుతోంది. ప్రస్తుతం ‘ఆసరా’ పథకంపై హడావుడి చేస్తున్న ప్రభుత్వం.. గతం నుంచీ కొనసాగుతున్న అభయహస్తంపై నిర్లక్ష్యం చూపుతోంది. పథకం ప్రారంభమైన 2009 నుంచి ప్రీమియం చెల్లిస్తున్న మహిళల్లో 60 ఏళ్లు నిండిన వారు 4 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. చేవెళ్ల : మహిళా సంఘాల సభ్యులకు బీమా, వృద్ధాప్యంలో పింఛన్ పథకాన్ని వర్తింపజేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సంఘాలలోని సభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసింది. సంఘంలోని ప్రతి సభ్యురాలు ప్రీమియం చెల్లించుకుంటూ పోతే 60 ఏళ్లు నిండిన తర్వాత కనిష్టంగా రూ.500 పింఛన్ అందజేయాలనేది పథకం ఉద్దేశం. వయసును బట్టి ప్రతి సభ్యురాలు సంవత్సరానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ. 365 చెల్లిస్తేనే వీరు ఈ పింఛన్‌కు అర్హులవుతారు. రూ.365తో పాటుగా సర్వీస్ చార్జీగా అదనంగా రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే అభయహస్తం పథకాన్ని అమలుచేస్తారు. సామాజిక పింఛన్లు పొందుతున్న వారు సైతం మహిళా సంఘ సభ్యులుగా ఉంటే వారికి అభయహస్తంలో లబ్ధిదారులుగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీఓ ఏదీ రాకపోవడంతో అధికారులు సైతం అయోమయంలో పడ్డారు. సంఘంలో సభ్యురాలై ఉండి ప్రస్తుతం రూ. 500 పింఛన్ పొందుతున్న వారికి అభయహస్తం పథకం నుంచి మరో రూ.500 కలిపి ఇస్తారో.. లేదోనన్న అంశంపై మీమాంస నెలకొంది. అయితే ఆధార్ సీడింగ్ చేపడుతున్నామని, అది పూర్తయితే పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా పింఛన్లు లేవు.. జిల్లా వ్యాప్తంగా అభయహస్తం లబ్ధిదారులు 11,525 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ.57.62 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒక్క చేవెళ్ల డివిజన్ పరిధిలోనే ఈ లబ్ధిదారుల సంఖ్య 1,724. ఇప్పటికీ సుమారు 1,400 మంది లబ్ధిదారుల వివరాలు ఆధార్‌సీడింగ్ పూర్తిచేసినట్టు తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పొందుతున్నవారి వివరాలు సేకరించారు. అభయహస్తం పింఛన్ వస్తున్నవారు.. మరోసారి పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించడం లబ్ధిదారులను గందరగోళంలోకి నెట్టింది. ఆసరా పింఛన్లు పంపిణీచేసిన ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులను మాత్రం పట్టించుకోకపోవడంతో ఏ ‘ఆసరా’ లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. తమకు అభయహస్తం పింఛన్ ఇప్పించాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. త్వరగా పింఛన్లు మంజూరుచేసి తమను ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆధార్ సీడింగ్ కొనసాగుతోంది: మంజులవాణి, ఐకేపీ, ఏపీఓ అభయహస్తం లబ్ధిదారుల ఆధార్‌సీడింగ్ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరికొన్ని సూచనలు చేసింది. ఆన్లైన్లో కూడా వీరి వివరాలు నమోదు చేస్తున్నాం. మరో వారం పదిరోజులలో పింఛన్లను అందించే అవకాశం ఉంది. -
రూ.కోట్లలో ఖర్చు.. రూ. లక్షల్లో లెక్కలు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకోవడానికి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించారు. గెలుపు కోసం తొక్కాల్సిన అడ్డదారులు అన్నీ తొక్కారు. ఇదే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా గుర్తింపు ముద్ర వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు లోబడి ఎన్నికల్లో ఖర్చు చేయాలి. ఇది ఎన్నికల సంఘం నిబంధన. వాస్తవంగా అయితే అభ్యర్థులు అంతే ఖర్చు చేయాలి. కానీ వారు చేసిన ఖర్చు అంచనా వేస్తే కళ్లు తిరగాల్సిందే. కొన్ని చోట్ల కోట్లు దాటడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు రూ.90 కోట్లు దాటినట్లు పరిశీలకుల అంచనా. అత్యంత ఖరీదైన ఎన్నికలు సాధారణంగా ఎన్నికలంటేనే ఖరీదైన వ్యవహారం. ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులు ఈసారి ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోటీ ఆధారంగా అభ్యర్థులు ఓట్ల కోసం కోట్లు కుమ్మరించారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లోనైతే రూ.కోట్లు ఖర్చయినా సరే కచ్చితంగా మనం గెలవాలంతే అంటూ అభ్యర్థులు మొండి పట్టుదలతో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. అభ్యర్థుల రోజువారీ ఖర్చు చూస్తే కనీసం రోజుకు అభ్యర్థుల వెంబడి 100 మందికిపైగా ఉండి ప్రచారం చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం అంతా అభ్యర్థి ఖాతాలోనే. రోజూ వీరికి పెట్టే ఖర్చు దాదాపు రూ.30 వేలు. పదిహేను రోజుల్లో కనీసం వీరి కోసం దాదాపు రూ.7 లక్షలు దాటింది. ఇక మద్దతుదారులు ప్రచారం చేయడానికి అద్దె వాహనాలు, ప్రచార వాహనాలు, కళాబృందాల ఖర్చు అదనం. రోడ్‌షో, బహిరంగ సభల ఏర్పాట్ల ఖర్చు కన్నా, ఆ కార్యక్రమాలకు జనాలను తరలించేందుకు పెట్టిన ఖర్చు రెట్టింపుగా ఉంటుంది. సభకు ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 చొప్పున చెల్లించి జనాలను తరలించారు. ఇలా సభల కోసం 3 వేల నుంచి 5 వేల వరకు జనాలను తరలించారు. ఈలెక్కన వీరందరు పెట్టిన ఖర్చు రూ.50 లక్షలుపైనే ఉంటుంది. రూ.కోట్ల కట్టలతో ఓట్ల కొనుగోలు ఇక అన్నింటినీ మించి ఓట్ల కొనుగోలుకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు. చాలా మంది అభ్యర్థులు తమ పరిధిలోని యువజన సంఘాల ఓట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో యువజన సంఘానికి రూ.5 వేల వరకు అందజేశారు. ఒక నియోజకవర్గంలో సుమారు 200 యువజన సంఘాలు ఉంటాయి. ఈ లెక్కన రూ.10 లక్షలు చాలా నియోజకవర్గాల్లో యువజన సంఘాలకు ఆయా పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు మహిళా సంఘాలు, కుల సంఘాలు, అభివృద్ధి కమిటీలకు తాయిలాలు, విందులు, వినోదాలు అదనం. ఓటరు అడుగుతున్నాడు కాబట్టి ఇస్తున్నామని అభ్యర్థి, అభ్యర్థి ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నామని ఓటరు ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేశారు. ఎన్నికలకు ఒక రోజు ముందు మద్యం ఏరులై పారింది. గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక మద్యం బాటిల్, రూ.500 చొప్పున అందించారు. ఆ ఒక్క రోజులోనే అభ్యర్థి రూ.లక్షల్లో ఖర్చు చేయడం గమనార్హం. రూ.కోట్లలో ఖర్చు.. రూ.లక్షల్లో లెక్కలు.. ప్రసుత్తం ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉండే ఏకైక అర్హత డబ్బులు ఖర్చు చేయడమే. పార్టీలు కూడా ఎంత ఖర్చు పెడుతారో నిర్ధారణకు వచ్చాకే టిక్కెట్లు కేటాయించే సంస్కృతి పెరిగింది. రూ.కోట్లు సులువుగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు లెక్కలు మాత్రం రూ.లక్షల్లో చూపిస్తున్నారు. ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని దాటితే గెలిచినా వేటు వేసే అవకాశం ఉండడంతో, లెక్కల్లో పిసినారితనం ప్రదర్శిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఖర్చును చూసిన ఓటరు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించారని ఆశ్చర్యపోతున్నారు. ఇంత డబ్బు ఖర్చు చేసినా తమను ఓటరు దయ తలుస్తాడో లేదోననే గుబులు అభ్యర్థుల్లో మొదలైంది. ఏదేమైనా ఈ డబ్బు ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపిందో ఫలితాలు వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అద్దె వాహనాల్లో ఖర్చుల అంచనా.. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రోజు కనీసం 20 వాహనాలను తన మద్దతు దారులకు ఇచ్చి నియోజకవర్గంలో ప్రచారానికి పంపించారు. ఒక్కో వాహనానికి అద్దె రూ.1000, మద్దతు దారులకు రోజు రూ.3 వేలు చెల్లించారు. ఇలా ఒక వాహనానికి రూ.4 వేలు వెచ్చించారు. ఇలా పదిహేను రోజుల నుంచి లెక్కిస్తే ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారు. ఇక ఎంపీ అభ్యర్థుల ఖర్చులకొస్తే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గలేదని తెలుస్తోంది.