శానిటేషన్‌ స్టోర్ల ఏర్పాటు | Sanitesan stores | Sakshi
Sakshi News home page

శానిటేషన్‌ స్టోర్ల ఏర్పాటు

Published Wed, Jul 20 2016 1:05 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Sanitesan stores

బ్రహ్మసముద్రం : జిల్లా వ్యాప్తంగా12 మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని వేగవంతం చేయడానికి మహిళా సంఘాల అధ్వర్యంలో మండలకేంద్రాలలో రూరల్‌ రీటేయిల్,చెయిన్‌ పద్ధతిన శానిటేషన్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఏం సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో ‘సాక్షి’తో మట్లాడారు.
 
ఈసందర్బంగా అయన మాట్లాడుతు జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలాలైన,బ్రహ్మసముద్రం, గుమగట్ట, కంబదూరు, ఉరవకొండ, వజ్రకరూరు, గుత్తి, శింగనమల, గుడిబండ, మడకశిర, సోమందేపల్లి, నల్లమాడ, తనకల్లు మండలాల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన బేసిన్‌లు పైపులు, సిమెంట్, నేలలో వేసేందుకు అవసరమైన సిమెంట్‌ రింగులు తదితర సామాన్లను లబ్ధిదారులకు అప్పుగా అందించి బిల్లుల మంజూరు సమయాన ఇచ్చిన వస్తువులకు సరిపడా బిల్లును మినహాయించుకొని ఇవ్వనున్నట్లు అయన తెలిపారు.
 
ఈ ప్రకియ వల్ల పనులు వేగవంతం అవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలను సీసీలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రతిమండలంలోను ఆగస్టు15లోపు ఒక గ్రామంలో సంపూర్ణ స్వచ్ఛభారత్‌ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో హెచ్‌డీ రామేశ్వరరెడ్డి, ఎపీఏం సాంబశివుడు, జననీమండలసమాఖ్య అధ్యక్షురాలు పుష్పావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement