హైదరాబాద్: డ్వాక్రా మహిళా సంఘాలకు మూలధన పెట్టుబడి కింద ప్రభుత్వం రూ. 250 కోట్లు మంజూరు చేసింది. డ్వాక్రా మహిళా సంఘాలకు మూలధన పెట్టుబడి కింద 2015- 16 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పథకాల అమలుకు రూ. 1287 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ. 250 కోట్లను డ్వాక్రా మహిళా సంఘాల మూలధన నిధి పెట్టుబడి కింద వినియోగించుకునేందుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఈమేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.