rs 250 crore
-
బంగారంగా మారిన నగదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన అనంతరం నల్లధనాన్ని తెల్లగా మార్చడం కోసం బ్లాక్‌మనీ హోల్డర్స్ ఒక్కసారిగా బంగారం దుకాణాలకు పరిగెత్తిన సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా తీసుకుని బంగారం వర్తకులు మనీ లాండిరింగ్ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంగారం వర్తకులపై కొరడా ఝళిపించడం ప్రారంభించింది. దేశరాజధాని పరిధిలోని బంగారం వర్తకులపై ఐటీ డిపార్ట్మెంట్ తాజాగా జరిపిన దాడుల్లో లెక్కల్లో తేలని రూ.250 కోట్ల బంగారం విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ జరిపిన దాడుల్లో దేశరాజధానిలో రూ.400 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో తేలని బులియన్ విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. కరోల్ బాగ్, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని నలుగురు బులియన్ డీలర్స్ను శుక్రవారం ఐటీ డిపార్ట్మెంట్ విచారించింది. ఈ విచారణలో గత కొన్ని వారాల్లో రూ.250 కోట్లకు పైగా రద్దయిన నగదును మార్చిపెట్టినట్టు తెలిసింది. ఈ వర్తకులకు సంబంధించిన 12 దుకాణాలు, 8 నివాస ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఇంకా దాడులు నిర్వహిస్తోంది. మొదటగా రూ.250 కోట్ల రద్దయిన నోట్లను వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా బంగారంలోకి మార్చినట్టు గుర్తించామని ఓ సీనియర్ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఈ నలుగురి ట్రేడర్ల దుకాణాలు పాత ఢిల్లీ పరిధిలోని కుచ మహాజని ప్రాంతంలో ఉన్నాయని, మరికొన్ని దుకాణాలు కరోల్ బాగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి బ్యాంకు అకౌంట్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయిన అనంతరం మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వార్తలతో కుచ మహాజని బులియన్ డీలర్స్‌పై మొదటి రైడ్ నిర్వహించామని, ఆ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా గోల్డ్ బార్స్‌ను వీరు విక్రయించినట్టు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. అప్పుడే మనీ లాండరింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయంలో ఈడీ ఇప్పటికే ఇద్దరు బ్యాంకు మేనేజర్లను, ఇద్దరు మధ్యవర్తులను అరెస్టు చేసింది. -
మరో వివాదంలో సల్మాన్ ఖాన్
-
డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.250 కోట్లు
హైదరాబాద్: డ్వాక్రా మహిళా సంఘాలకు మూలధన పెట్టుబడి కింద ప్రభుత్వం రూ. 250 కోట్లు మంజూరు చేసింది. డ్వాక్రా మహిళా సంఘాలకు మూలధన పెట్టుబడి కింద 2015- 16 బడ్జెట్లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పథకాల అమలుకు రూ. 1287 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ. 250 కోట్లను డ్వాక్రా మహిళా సంఘాల మూలధన నిధి పెట్టుబడి కింద వినియోగించుకునేందుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఈమేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రూ.250 కోట్లతో మెగా ఫుడ్ పార్కు
సాక్షి, విజయవాడ : జిల్లాలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 17 మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలని మంగళవారం నిర్ణయించింది. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా దాన్ని కృష్ణాజిల్లాలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఫుడ్ పార్కు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఫుడ్ పార్కు ఏర్పాటుకు రూ.250 కోట్ల వ్యయం... మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు సుమారు రూ.250 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సేకరిస్తారు. రాబోయే 30 నెలల్లో ఫుడ్‌పార్కు ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తారు. ఫుడ్ పార్కులో కనీసం 40 నుంచి 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. కోల్డ్ స్టోరేజ్‌లు, గోదాములు ఏర్పాటు చేసే అవకాశముంది. ఫుడ్ పార్కును జిల్లాలో వెనుకబడిన తిరువూరులో ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు. అక్కడ కాకపోతే మైలవరంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉపయోగాలివీ... రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఫుడ్ పార్కులో ఉన్న గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. పళ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడైపోయే సరకుల్ని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. పళ్లు, కూరగాయలు వంటి పంటలు దిగుబడి అధికంగా ఉన్నప్పుడు వాటి నుంచి జ్యూస్‌లు, ఇతర తినుబండారాలను తయారు చేయించుకుని విక్రయించుకునే సౌకర్యం ఫుడ్ పార్కులలో ఉంటుంది. కూరగాయలు, పండ్లను రైతులు కోసిన తరువాత వాటిని శుభ్రం చేసి, వివిధ సైజుల్లో గ్రేడింగ్ చేసే యంత్రాలను కూడా ఫుడ్ పార్కులలో ఏర్పాటు చేస్తారు. ఇందులో నాణ్యమైన సరకును చక్కగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా విదేశాలకు ఎగుమతి చేసుకునే సౌకర్యం ఉంటుంది. రైతులకు తమ సరకు పాడైపోకముందే విక్రయించుకునేందుకు వీలుగా ఇక్కడే రిటైలర్లు, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే వ్యాపారులు కూడా ఫుడ్ పార్కులకు అనుబంధంగా పనిచేస్తూ ఉంటారు. జిల్లాలో తొలి ఫుడ్ పార్కు... గతంలో నూజివీడు వద్ద మామిడికాయలను ప్రాసెసింగ్ చేసేందుకు ఒక ఫుడ్ పార్కును ఏర్పాటు చేసినా అది కొద్దిరోజులకే మూలన పడింది. చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన శ్రీని మెగా ఫుడ్ పార్కు ఆ ప్రాంత రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. మెగా ఫుడ్‌పార్కు వల్ల రైతులకే కాకుండా వందలాది మంది నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశముంది. -
ఈ వజ్రాల వాచీ రూ. 250 కోట్లు
బేసెల్: కాంతులీనే శ్వేతవర్ణ వజ్రాలు పొదిగిన ఈ గడియారం విలువ తెలిస్తే నిజంగా కళ్లు తిరుగుతాయి. 152 క్యారెట్ల వజ్రాలతో రూపొందించిన దీని విలువ అక్షరాల 250 కోట్ల రూపాయలు. లండన్‌కు చెందిన ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ‘గ్రాఫ్’ దీన్ని స్విట్జర్టాండ్లోని బేసెల్‌లో జరుగుతున్న ప్రపంచస్థాయి వజ్రాల నగల ప్రదర్శనలో అమ్మకానికి పెట్టింది. ‘ది ఫాసినేషన్’ పేరిట పిలుస్తున్న ఈ గడియారాన్ని చేతితోపాటు మెడకు నెక్లెస్ లాకెట్‌లా కూడా ధరించేలా తయారు చేశారు. దీని తయారీకి కొన్ని వేల గంటల సమయం పట్టిందని గ్రాఫ్ వజ్రాల కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ లారెన్స్ గ్రాఫ్ తెలిపారు. ‘వజ్రాలే ఆడవారికి అందమైన మిత్రుల’నే అలనాటి హాలివుడ్ అందాల తార మార్లిన్ మన్రో మాటలను నమ్మినవారు ధరకు వెరవకుండా ఈ గడియారాన్ని చేజిక్కించుకోవచ్చు!