మహిళ సమాఖ్య నిధులతో టీడీపీ నాయకుడు కొనుగోలు చేసిన ట్రాక్టరు
మహిళా సంఘాల నిధులకు టోకరా
Published Wed, Aug 24 2016 1:01 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
గతంలో నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు
తాజాగా గ్రామ సంఘం నిధుల కైంకర్యం
సుమారుగా రూ. 4 లక్షలకు ఎసరు
టీడీపీ నాయకుడి బరితెగింపు
కొంతమంది వ్యక్తుల తీరు కారణంగా లావేరు మండలం బుడతవలస గ్రామం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. గతంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రణస్థలం ఆంధ్రాబ్యాంకు నుంచి ఒకే కుటుంబ సభ్యుల పేరుతో రూ. 40 లక్షలకు పైగా రుణాలు కాజేసిన గ్రామస్థాయి టీడీపీ నాయకుడు తాజాగా గ్రామ సంఘాల నిధులను కూడా సభ్యులకు తెలియకుండా తన సొంత ప్రయోజనాలకు వాడేసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తే దీనికి బాధ్యులనే ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీకాకుళం పాతబస్టాండ్: లావేరు మండలం బుడతవలన గ్రామ మహిళా సమాఖ్యకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా సుమారు రూ. 4 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులు కొండ ప్రాంతాల్లో ఉండే గ్రామ సంఘాలకు అందజేయూల్సి ఉంది. ఈ నిధులతో ఆ గ్రామ సంఘం వ్యవసాయ పరికరాలైన నాగళ్లు, నీటి ఇంజన్లు, ఎరువులు, విత్తనాలు వంటివి రైతులకు సరఫరాల చేసి వాటి ద్వారా ఆదాయమార్గాలను పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఈ నిధులను డ్వామా అధికారులు బుడతవలస గ్రామ సమాఖ్య పేరున రణస్థలం ఆంధ్రాబ్యాంకు ఖాతాలో (ఖాతా నంబర్: 04951000072448) రూ. 4,12,000 జమ చేశారు. అరుుతే ఈ నిధులను సభ్యులకు తెలియకుండా టీడీపీ నాయకుడు విత్‌డ్రా చేసినట్టు సమాచారం.
ఈ నిధులకు సంబంధించి జూలై 14న రూ.1,95,000 నీలం ఆగ్రోవర్కు కి (247270 నంబరు డీడీని) చెల్లించారు. అలాగే సాయి సంతోష్ ఆగ్రీ వర్కు పేరిట (డీడీ నంబర్ 247269)తో మరో రూ. 95,000, రఘురామ ఆగ్రీవర్కుల పేరిటతో (డీడీ నంబర్ 247271) మరో 40 వేల రూపాయలను చెల్లించారు. తాజాగా ఈనెల 16వ తేదీన రూ. 82,000లు రంగారావు ఆగ్రోవర్కులు పేరిట డీడీని చెల్లించారు. ఈ డీడీలు మొత్తం గ్రామ సామాఖ్య నుంచి రణస్థలం ఆంధ్రాబ్యాంకు ద్వారా చెల్లించినట్టుల రికార్డులు చెబుతున్నారుు. అయితే ఈ డీడీల పేరిట తీసుకున్నవి వ్యవసాయ సామగ్రి కాదు. మహిళా సంఘం పేరుతో కూడా కాదు. బుడతవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి పేరుతో ఉన్నారుు. తీసుకున్నవి కూడా ట్రాక్టర్, ట్రక్కు, దుక్కి, దమ్ము సెట్‌లు. దీని వెనుక అవినీతి దాగి ఉందనే విమర్శలు వస్తున్నారు.
పోర్జరీ సంతకాలు
ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామ సంఘం సామగ్రి కొనుగోలు చేయూలంటే ముందుగా గ్రామ సమాఖ్య తీర్మాణం తప్పనిసరి. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. గ్రామ సంఘం తీర్మానంలో ఉన్న సంతకాలు పూర్తిగా పోర్జరీవని, తాము ఇప్పటివరకు ఐడబ్ల్యూఎంపీఈ పథకం కింద వచ్చిన నిధులకు ఎటువంటి తీర్మానం చేయలేదని గ్రామ సమాఖ్య సభ్యులు కె.రమణమ్మ, గృహలక్ష్మి, సత్యవతి, ఆర్.రమణమ్మలు తెలిపారు. గతంలో గ్రామంలో పలు రకాల నిధులు దుర్వినియోగం కావడంతో గ్రామ సమాఖ్య నిధుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అరుుతే తమ సంతకాలను పోర్జరి చేసి సమాఖ్యకు కేటారుుంచిన నిధులను కైంకర్యం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమాఖ్యకు చెందిన నాలుగు లక్షల రూపాయలతో టీడీపీ నాయకుడు ట్రాక్టరును కొనుగోలు చేసి స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారని వాపోయూరు. ఈ అవినీతిలో వెలుగు పథకం సిబ్బంది అరుున ఏపీఎం, సీసీల పాత్ర ఉన్నట్టు సమాచారం.
అవినీతికి అండగా టీడీపీ నేతలు
బుడతవలసలో అవినీతికి పాల్పడుతున్న టీడీపీ గ్రామస్థారుు నాయకుడికి ఆ పార్టీకి చెందిన పెద్దల ఆండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నారు. గతంలో నకిలీ పాస్ పుస్తకాలతో రూ. 40 లక్షలు రుణాలు తీసుకున్నట్టు రుజువైనా ఇప్పటి వరకూ అధికారులు సంబంధిత వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుసుకోలేదు. టీడీపీ పెద్దల ఒత్తిళ్ల కారణంతోనే వక్రమార్గంలో రుణాలు తీసుకున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఈసారి మహిళా సంఘాలకు చెందిన నిధులను నొక్కేశాడని స్థానికులు మండిపడుతున్నారు.
ఎంతటి వారైనా చర్యలు తప్పవు
ఐడబ్ల్యూఎంపీఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అవసరమైతే రికవరీ చేస్తాం. నిధులు మంజూరు వాస్తవమేనని, అయితే వాటికి బిల్లులు, ఇతర అంశాలు తమకు చేరలేదు. దర్యాప్తు చేస్తున్నాం.
-ఆర్.కూర్మనాథ్, డ్వామా పీడీ
చర్యలు తీసుకుంటాం
గ్రామ సంఘాల నిధుల వినియోగంలో గ్రామ పెద్దలకు సంబంధం లేదు. నిధుల డ్రాపై పూర్తి సమాచారం తెలుసుకుంటాను. దీనిపై విచారణ జరిపించి, అవినీతి వాస్తవమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
-జి.సి.కిశోర్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ
Advertisement