
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,04,796 బియ్యం కార్డులను మంజూరు చేశారు. దేశంలోనే తొలిసారి నిర్ధిష్ట కాల పరిమితిలో అర్హులైన వారికి ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. దరఖాస్తు చేసిన పది పని దినాల్లో అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కార్డుల కోసం గ్రామ సచివాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేస్తున్నారు. దరఖాస్తు వచ్చిన 10 రోజుల్లోగా 18,576 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన 86,220 కార్డులను వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. తిరస్కరిస్తున్న దరఖాస్తులకు కారణాలు కూడా వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment