ప్రభుత్వ పథకాలు పేదలకే చెందాలని పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ కోనశశిధర్ పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండలం వైకోడూరులో జరిగిన పల్లెపిలుపు కార్యక్రమంలో ఆయన ప్రజా సమస్యలపై స్పందించారు.
వై కోడురు (ఎర్రగుంట్ల), న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలు పేదలకే అందాలని.. పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. గురువారం సాయంత్రం వై కోడురు గ్రామంలోని గ్రామ సచివాలయంలో సర్పంచ్ సునంద అధ్యక్షతన పల్లెపిలుపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు కోన శశిధర్ మాట్లాడుతూ గ్రామానికి వైద్యాధికారులు వస్తున్నారా లేదా.. గర్భణీలకు టీకాలు వే స్తున్నారాలేదా.. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు ఎలా ఉన్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో కచ్చితంగా పౌష్టికాహారం అందించాలన్నారు. గ్రామంలో డ్రైనేజి సమస్య ఉందని సర్పంచ్ సునంద జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం రూ.5లక్షలను మంజురు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న చింతపండు, కారంపొడిలలో నాణ్యత లేదని గ్రామ ప్రజలు సభ దృష్టికి తెచ్చారు. వాటిని కలెక్టర్ పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపించి నాణ్యతను పరిశీలిస్తామని జాయింట్ కలెక్టరు నిర్మల తెలిపా రు. కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలుపగా.. సంబంధిత ఉన్నతాధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ బదులిచ్చారు.
చిన్నారులతో కలెక్టర్...
ఎమ్మా చిన్నారి నీ పేరు ఏమిటి.. ఏం చదువుతున్నావని గ్రామంలో ఉన్న పావని, అక్షయ, మైథాలిమానస అనే చిన్నారులను కలెక్టర్ కోన శశిధర్ ఆప్యాయంగా పలకించారు. పాఠశాలలో సమస్యలున్నాయా.. అయ్యవార్లు సక్రమంగా వస్తున్నారా.. లేదా.. అని ఆరా తీశారు. టీచర్లు బాగా చెబుతున్నారని ఆ చిన్నారులు సమాధానం ఇచ్చారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని కొందరు విద్యార్థులు కలెక్టరు దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన స్పందించి తహశీల్దార్, ఎంపిడీఓలు పాఠశాలను తనిఖీ చేసి రిపోర్డును ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను చర్చించారు.
ఈ కార్యక్రమంలో జేసీ నిర్మల, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేసు, డిఆర్‌డీఏ పీడి వెంకట సుబ్బయ్య, హౌసింగ్ పీడీ సాయినాధ్, డీఈఓ ఆంజయ్య, కడప ఆర్డిఓ హరిత, ఐసిడిఎస్ పీడీ లీలావతి, సీఈఓ మాల్యాద్రి, సీపీఓ తిప్పయస్వామి, సోషియల్ వేల్ఫేర్ జెడీ ప్రసాదు, డీఎంహెచ్‌ఓ ప్రభుదాస్, డ్వామా పీడీ బాలసుబ్ర మణ్యం, డిపిఆర్‌ఓ జయమ్మ, ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి , తహశీల్దార్ ఎస్‌ఎం ఖాసీం, ఎంపీడీఓ జయసింహ, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ డీఈ నాగరాజు, ఏఈ గోపాల్‌క్రిష్ణ, సీడీపీఓ శ్రీమతమ్మ, ఆర్‌డ బ్ల్యూఎస్ డీఈ ప్రసన్నకుమార్, ఐకెపి ఏరియా కోఆర్టినేటర్ వసంతకుమారి, ఏఎస్‌డబ్ల్యూఓ చింతామణి, విద్యుత్ ఏడీఈ మాల్లారెడ్డి, ఏఈ శ్రీనివాసులు, సింగిల్‌విండో ప్రెసిడెంట్ దాసరి రాజారెడ్డి, మాజీ సర్పంచ్ శివారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పథకాలు పేదలకే
Published Fri, Jan 31 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement