Gas cylinder supply
-
గ్యాస్ సిలిండర్... గేట్ డెలివరీ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం వంట గ్యాస్ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ విధానంలో మార్పు చేశాయి. డోర్ డెలివరీకి బదులు ‘గేట్ డెలివరీ‘గా మార్చాయి. డోర్ డెలివరీ విధానంలో డెలివరీ బాయ్స్ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరమైనందున ‘గేట్ డెలివరీ’గా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సిబ్బంది, ప్రజలకు రక్షణ కోసం ఐఓసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చేస్తున్నాం. సిబ్బందికి, కస్టమర్ అటెండెంట్లకు స్టెరిలైజ్డ్ గ్లౌజులు, మాస్కులు , శానిటైజర్లు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే వాహనాలకు డిస్ఇన్ఫెక్టెడ్ రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం – ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ హెడ్ ఆర్ శ్రావణ్ ఎస్ రావు మొదట్లోనే ఆదేశించాం గ్యాస్ డెలివరీ బాయ్స్ శానిటైజ్డ్ గ్లౌజులు, మాస్కులు ధరించాలని, ఇళ్లలోకి సిలిండర్లు తీసుకెళ్లకుండా బయటే ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయిల్, గ్యాస్ కంపెనీల రాష్ట్రస్థాయి కమిటీ (ఎస్ఎల్సీ) సమన్వయ కమిటీ సమావేశంలో మొట్టమొదటే సూచనలు ఇచ్చాం. – రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ కోన శశిధర్ ప్రజల కోసమే నిర్ణయం వినియోగదారులు, ప్రజల మేలు కోరే ఈ గేట్ డెలివరీ విధానం. డెలివరీ బాయ్స్‌కు వైరస్ సోకితే శరవేగంగా ఎక్కువమందికి వ్యాపించే ప్రమాదం ఉంది. బాయ్స్‌కు వైరస్ నుంచి రక్షణ కోసం స్టెరిలైజ్డ్ గ్లౌజులు, మాస్కులు సరిపడా ఇచ్చాం. – భారత్ గ్యాస్ ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ -
ఖాళీ ప్రదేశాలకు రైతుబజార్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం గుంపులుగుంపులుగా వస్తున్న దృష్ట్యా, దీన్ని నిరోధించడానికి రైతుబజార్లను విశాల ప్రదేశాలకు, ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు, కళాశాల, పాఠశాల ల ప్రాంగణాల్లో కూరగాయల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే హైదరాబాద్ చింతలబస్తీల్లోని మార్కెట్‌ను పక్కనే ఉన్న రాంలీలా మైదానంలో తరలించారు. సంగారెడ్డిలో సైతం కలెక్టరేట్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల అమ్మకాలు చేపట్టగా, కరీంనగర్ బస్టాండును మార్కెట్‌గా మార్చేశారు.చాలా చోట్ల ఇదేమాదిరి రైతుబజార్లను తరలించి కొనుగోలుదారుల మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన రైతుబజార్లను జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టారు. దీనిద్వారా ఎక్కడివారికి అక్కడే నిత్యావసరాలు అందుబాటులోకి తేవడంతోపాటూ గుంపులను నివారించే చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్‌లపై ఆంక్షలు.. ఇక లాక్డౌన్ పేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బు కింగ్‌లకు డిమాండ్ పెరగడంతో ఆయిల్ కం పెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విని యోగదారులు ఒకటికి మించి ఎక్కువ గ్యాస్ బుకింగ్‌లు చేయకుండా పలు ఆంక్షలు విధించాయి. ఒక బుకింగ్ జరిగాక, రెండో బుకింగ్‌కు కనీసం 14 రోజుల గ్యాప్ ఉండేలా ఆంక్ష లు తెచ్చాయి. ఈ మేరకు హెచ్‌పీ, భారత్‌గ్యాస్, ఇండేన్ గ్యాస్‌లు నిర్ణయం తీసుకున్నా యి. గతంలో కేవలం ఒక్క రోజు తేడాతో రెండో బుకింగ్‌కు సైతం సిలిండర్ సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతుండటం, వినియోగదారులు రెం డుమూడు సిలిండర్లను బుక్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఫలితాలనిస్తా యని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క కేంద్రం ఉజ్వల పథకం కింది లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ బుకింగ్‌లు పెరగడంతో కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. -
నేటి నుంచి గ్యాస్ బంద్
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో మంగళవారం నుంచి వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేసి సమ్మె చేస్తున్నట్లు జిల్లా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, కిషోర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులోని ఓ హోటల్లో ఫెడరేషన్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆలిండియా సంఘం పిలుపులో భాగంగా తాము సమ్మెలోకి వెళుతున్నామన్నారు. డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీర్ఘకాలంగా పరిష్కరించడం లేదన్నారు. పలుమార్లు చర్చించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెలోకి వెళుతున్నట్లు వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్స్పై ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్ పేరుతో డిస్ట్రిబ్యూటర్సపై ఒత్తిడి తెస్తోందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ గైడ్లైన్స 2001లో రూపొందించారన్నారు. మార్కెటింగ్‌లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు లక్షల కొద్దీ అపరాధం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గైడ్లైన్స సరళతరం చేసే వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకూడదని నిర్ణయించామన్నారు. అంతేగాక ఆధార్ సీడింగ్ వల్ల తమపై అదనపు భారం పడిందని, సబ్సిడీ రాకపోయినా వినియోగదారులు తమను బాధ్యులుగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కోశాధికారి భాస్కరయ్య, జిల్లాలోని అన్ని కంపెనీల గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.