
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన.
ఈ తరుణంలో.. రూబుల్స్‌లో చెల్లింపులకు నిరాకరించిన పోల్యాండ్, బల్గేరియాలకు గాజ్‌ప్రోమ్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేయించారు. రష్యా ఎనర్జీ దిగ్గజం గాజ్‌ప్రోమ్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోల్యాండ్(పీజీఎన్‌ఐజీ), బల్గేరియా(బల్గర్‌గ్యాజ్)లకు పూర్తిగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రూబుల్స్ రూపేణా బకాయిల చెల్లింపుల మూలంగానే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
కిందటి నెలలోనే పుతిన్ ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు చాలా దేశాలు తేలికగా తీసుకున్నాయి. పైగా యూరోప్ దేశాలు తమకు రూబుల్స్ ఎలాగ ఉంటుందో కూడా తెలియదంటూ సెటైర్లు వేశాయి. ఈ తరుణంలో పుతిన్ తొలిసారి గ్యాస్ సరఫరా నిలిపివేయించడం ఇదే ప్రథమం.
ఇక హంగేరీ మాత్రమే రూబుల్స్‌లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో.. పుతిన్ ప్రతీకారంగా ఈ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా దేశాలకు ఇదే పరిస్థితి గనుక ఎదురైతే.. నష్టం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇది రష్యా ఆర్థికంపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment