సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా తమ ఇళ్ళు కూల్చివేయవద్దంటూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యనగర్, కొత్తపేటలో పలు ఇళ్ళ ముందు హైకోర్టు స్టే బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లోని 400 మంది ఇళ్ల యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం మా ఇళ్లు ఇవ్వం అంటూ బాధితులు ఇటీవల ఆందోళన కూడా నిర్వహించారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు నోటీసులిచ్చారు. దీంతో ఆయా కట్టడాల యజమానులు కోర్టుకు వెళ్లి కూల్చివేలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నారు.
ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా
Comments
Please login to add a commentAdd a comment