Stay High Court
-
కూల్చడం కుదరదు.. ఇళ్లకు ‘స్టే’ బోర్డులు
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా తమ ఇళ్ళు కూల్చివేయవద్దంటూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యనగర్, కొత్తపేటలో పలు ఇళ్ళ ముందు హైకోర్టు స్టే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని 400 మంది ఇళ్ల యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం మా ఇళ్లు ఇవ్వం అంటూ బాధితులు ఇటీవల ఆందోళన కూడా నిర్వహించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు నోటీసులిచ్చారు. దీంతో ఆయా కట్టడాల యజమానులు కోర్టుకు వెళ్లి కూల్చివేలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
నిర్మలకు ఊరట దర్యాప్తుపై హైకోర్టు స్టే
బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై బుధవారం హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటివరకూ అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసుకుంది. -
పెద్దపల్లి పురపోరుకు బ్రేక్!
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల విభజన సరిగా జరుగలేదని రంగంపల్లి గ్రామానికి చెందిన వేములరాజు, కాసు మహేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రంగంపల్లిలోని 10, 11, 12వార్డుల్లో ఉండాల్సిన ఓటర్లు 2 కి.మీల దూరంలోని ఎల్లమ్మచెరువుకట్ట కింద కాలనీల్లోని 32 వార్డులో చేర్చడాన్ని సవాలుచేస్తూ హైకోర్టు న్యాయవాది చింతలఫణి అవనిరెడ్డి హైకోర్టులో రిట్ వేశారు. దీనిపై న్యాయమూర్తి నర్సింగరావు విచారణ జరిపి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయాలంటూ ఉత్వర్వులు జారీ చేశారు. నాలిగింటిపై స్టే.. ముందుగా సుల్తానాబాద్ నుంచి మొదలైన తిరుగుబాటు వ్యవహారం, హైకోర్టు నుంచి స్టే తీసుకరావడంపెద్దపల్లి వరకు చేరింది. రామగుండంలో ఇదేమాదిరిగా వార్డుల విభజన సక్రమంగా లేదని కాంగ్రెస్‌పార్టీ నాయకులు కొందరు కోర్టుకు వెళ్లారు. రామగుండం ఎన్నికనూ హైకోర్టు నిలిపివేసింది. మంథనిలోను కొందరూ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పెద్దపల్లిలో వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని కోర్టుకు వెళ్లడంతో పెద్దపల్లిపైనా స్టే విధించడంతో జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా ఎన్నికలపై అనుమానాలు పెరిగాయి. ఇప్పటికే హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలపై కొందరూ కోర్టుకు వెళ్లగా ఇప్పుడు ఎక్కడిక్కడ మున్సిపాలిటీల వారీగా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసిన ఇక్కడస్థానికంగా ఎక్కడిక్కడ హైకోర్టుకు ఫిర్యాదులు వెళ్లడంతో స్టే విధించారు. దీంతో ఇక ఎన్నికలు జరుగడం ఇప్పట్లో అనుమానమేనంటున్నారు. అన్నింటిపై ఒకేసారి తీర్పు... రాష్ట్రంలో సుమారు 60 చోట్ల నుంచి అభ్యంతరాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. ఒక పెద్దపల్లి జిల్లాలోనే నాలుగు, ఉమ్మడి కరీంనగర్లో ఎనిమిది మున్సిపాలిటీలపై హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. అన్ని మున్సిపాలిటీలో కూడా వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందనేది పిటిషనర్ల వాదన. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి స్టే ఇప్పించాం. పెద్దపల్లిలో చాలా అద్వానంగా ఇష్టానుసారంగా వార్డుల విభజన, ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరిగింది. హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నింటిపై ఒకే సమయంలో తీర్పు రానుంది. అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం. – అవనిరెడ్డి, హైకోర్టు అడ్వకేట్ -
భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఆయ న అరెస్ట్‌పై 2 వారాలపాటు స్టే విధించింది. న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తనపై నంద్యాల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అకస్మాత్తుగా మరణించారని, ఆ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నాగిరెడ్డి అరెస్ట్‌పై రెండు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మోగిన నగారా
►ఈ నెల 7న జడ్పీ చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నిక ►6న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలకు.. ►ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ►ఆ ‘ఏడు’ మండలాల జడ్పీటీసీలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు ►అక్కడ ఎంపీపీ ఎన్నిక కూడా లేనట్టే ►39 మండలాలకే ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ► కూనవరం, చింతూరు, వీఆర్‌పురం ఎన్నికల బాధ్యత తూర్పుగోదావరి కలెక్టర్‌కు అప్పగింత ►భద్రాచలం, బూర్గంపాడు ఎంపీపీలు పెండింగ్ ►జడ్పీలో మారనున్న పార్టీల బలాబలాలు ►రిజర్వేషన్ యథాతథం ►రసకందాయంలో జిల్లా రాజకీయం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఎట్టకేలకు జిల్లా, మండల పరిషత్‌ల పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన రెండున్నర నెలల తర్వాత జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 7న జడ్పీ పాలకవర్గానికి (జడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యులు), 6న జిల్లాలోని 39 మండల పరిషత్‌ల పాలకవర్గాలకు (ఎంపీపీ, వైస్‌చైర్మన్, కో- ఆప్షన్ సభ్యులు) ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ ఎన్నికల నుంచి పోలవరం ముంపు ప్రాంతం కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలాలను మినహాయించారు. ఈ మండలాల జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో పాల్గొనే అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే జిల్లాలోని పూర్తి మండలాన్ని మాత్రమే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా పరిగణిస్తామని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఆ ఏడు మండలాల్లో కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా ఉభయగోదావరి జిల్లాల్లో కలిసినందున సెక్షన్ 178 ప్రకారం ఈ మండలాలను ఎన్నికల నుంచి మినహాయిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీపీ ఎన్నికల కోసం వెలువరించిన ఉత్తర్వుల్లో జిల్లాలోని 39 మండలాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది. మిగిలిన ఏడు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక మిగిలిన వాటిలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కలిసినందున ఆయా మండల పరిషత్‌ల పాలకవర్గాలకు ఎన్నిక జరిపే బాధ్యతను ఆ జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పాక్షికంగా గోదావరి జిల్లాల్లో కలిసి మిగిలిన భాగం మన జిల్లాలో ఉండే భద్రాచలం, బూర్గంపాడు మండలాల పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారు. కోర్టు కేసుల ఉపసంహరణ.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరినా, జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది మార్చి 10న నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితా లు మే 13న వెలువడ్డాయి. అనంతరం జూన్ 26న తెలంగాణ వ్యాప్తంగా జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక జరగగా, మన జిల్లాలో మాత్రం నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి, జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినందున జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికలకు మళ్లీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ విజయగాంధీ తదితరులు కోర్టును ఆశ్ర యించడంతో జూన్13న హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. ఆ తర్వాత కేసు ఉపసంహరించుకోవడంతో, మిగిలిన పిటిషన్లను కూడా జూలై 24న కోర్టు కొట్టివేసింది. దీంతో జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల ఎన్నికకు మార్గం సుగమం అయింది.