భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే | High Court stays arrest of bhuma .. | Sakshi
Sakshi News home page

భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే

Published Tue, Dec 2 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే

భూమా అరెస్ట్‌పై.. హైకోర్టు స్టే

సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్‌సీ, ఎస్‌టీ కేసులో ఆయ న అరెస్ట్‌పై 2 వారాలపాటు స్టే విధించింది. న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తనపై నంద్యాల పోలీసులు ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అకస్మాత్తుగా మరణించారని, ఆ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నాగిరెడ్డి అరెస్ట్‌పై రెండు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement