సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.
వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తి
అనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.
టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్
టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment