![TDP Leader Attack Volunteer In Vizianagaram District - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/2/TDP-Leader.jpg.webp?itok=-ozqebJy)
వలంటీర్‌పై దాడికి వెళ్తున్న సర్పంచ్ భర్త కొత్తల పోలినాయుడు
పాచిపెంట(విజయనగరం జిల్లా): పాచిపెంట మండలం మిర్తివలస టీడీపీ నాయకుడు, సర్పంచ్ కొత్తల సత్యవతి భర్త పోలినాయుడు గ్రామంలోని వలంటీర్ మండల రమేష్‌పై శుక్రవారం దాడికి పాల్పడ్డారు. మిర్తివలసకు చెందిన కొందరికి కొత్తగా పింఛన్లు మంజూరు కాగా.. ఆ సొమ్ము అందజేసేందుకు సర్పంచ్‌ను, ఎంపీటీసీని, పంచాయతీ కార్యదర్శిని వలంటీర్ ఆహ్వానించారు.
సర్పంచ్ సత్యవతి పంచాయతీ కార్యాలయానికి 2 గంటలు అలస్యంగా రావడంతో, అప్పటికే అక్కడకు చేరుకున్న ఎంపీటీసీ రొంగళి మోహన రవళి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. దీంతో సర్పంచ్ సత్యవతి భర్త పోలినాయుడు వలంటీర్‌ను దుర్భాషలాడారు. ఎంపీటీసీతో పింఛన్ పంపిణీ చేయించేందుకు నువ్వు ఎవడివిరా.. నీ అమ్మ మొగుడు పంచాయతీరా.. అంటూ వలంటీర్‌పై చెప్పుతో దాడికి పాల్పడ్డారు. విధుల్లో ఉన్న వలంటీర్‌పై దాడికి పాల్పడటం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: మన భుజాలపై వారి తుపాకులు!)
Comments
Please login to add a commentAdd a comment