సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే జర్నలిస్ట్‌ల కోసం ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
మూడోసారి అకాడమీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బుధ వారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు అల్లం నారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment