Telangana Press Academy chairman
-
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలంతో పాటు హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. శనివారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA) ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ‘తెలంగాణలో 23వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి సంస్థలోనూ ఫిల్మ్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఎలిజెబుల్ పీపుల్‌కి కచ్చితంగా అక్రిడేషన్ ఇప్పిస్తాం. ప్రభుత్వాల నుంచి ఏ సౌకర్యాలు పొందాలన్నా అందరిలోనూ యూనిటీ ఉండాలి. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే. మన ప్రొఫెషన్ విలువ, స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం, ఎథిక్స్ ని ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. జూన్ 6 తర్వాత ఎలిజిబుల్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తాం.ప్రభుత్వాల నుంచి కూడా ఏదీ ఫ్రీగా ఎక్స్ పెక్ట్ చేయొద్దు. భూములనో, ఫ్లాట్‌లనో మార్కెట్ రేటు కాకుండా, మనకంటూ ఓ రేటుకి ఇస్తే దాన్ని కట్టుకుందాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, ఆర్.నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేంద్ర నాయుడు సహా అసోసియేషన్ సభ్యులు.. జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. అల్లం నారాయణ హామీ
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే జర్నలిస్ట్‌ల కోసం ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. మూడోసారి అకాడమీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బుధ వారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు అల్లం నారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అల్లం నారాయణతో మార్నింగ్ వాక్
-
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ పాత్రికేయుడు అల్లం నారాయణ ఈనెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ చాపెల్‌రోడ్డులోని అకాడమీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. బాధ్యతలు స్వీకరించే ముందు అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు. -
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ
21 మందితో కొత్త కార్యవర్గం ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా సీనియర్ సంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు పలు ప్రధాన పత్రికల సంపాదకులను ఇందులో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సమాచార శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లోగా ప్రెస్ అకాడమీ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు కేబినెట్ హోదాతోపాటు అన్ని లాంఛనాలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రెస్ అకాడమీ పనిచేస్తున్న చోటే తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆ అకాడమీ కార్యదర్శిని, సమాచార శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అకాడమీ పాలక మండలి పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు: టంకశాల అశోక్, వి.మురళి, కె.శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మ య్య, కె.శేఖర్‌రెడ్డి, సీఆర్ గౌరీశంకర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, జహీర్ అలీఖాన్, వినయ్‌వీర్, ఎన్.వేణుగోపాల్,ఎం.నారాయణరెడ్డి, కొమరవెల్లి అంజయ్యలతోపాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సమాచార శాఖ నామినీ, తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా వర్సిటీ జర్నలిజం విభాగాల అధిపతులు, దూరదర్శన్ స్టేషన్ డెరైక్టర్, సమాచార శాఖ డెరైక్టర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.