రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి
హిమాయత్‌నగర్(హైదరాబాద్): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మీడియాలో వస్తున్న మార్పులతో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోనున్నదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్‌గా ఉద్యోగ విరమణ చేసిన కె.రవికాంత్‌రెడ్డి, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, కోశాధికారి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజే‹Ù, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్‌లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది.
సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కేఎన్, హరి, సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు, ఇతర సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్‌లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. అర్హులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలన్నారు.
రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్‌లైన్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, వై.నరేందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment