లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు | 4 killed in Israeli strike on building in Beirut | Sakshi
Sakshi News home page

లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు..నలుగురు మృతి

Sep 30 2024 7:17 AM | Updated on Sep 30 2024 7:38 AM

4 killed in Israeli strike on building in Beirut

బీరుట్‌:లెబనాన్‌పై ఇ‍జ్రాయెల్‌ దాడుల తీవ్రత పెంచింది. ఇప్పటివరకు హెజ్బొల్లా తీవ్రవాదులు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్‌ తాజాగా సోమవారం(సెప్టెంబర్‌30) తెల్లవారుజామున బీరుట్‌ పట్టణం లోపల జనావాసాలపైనా విరుచుకుపడింది.

బీరుట్‌లోని కోలా జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో నలుగురు పౌరులు మృతిచెందారు.బీరుట్‌ తర్వాత బెక్కా ప్రాంతంలో దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ వెల్లడించిన విషయాన్ని లెబనాన్‌ పత్రికలు ప్రచురించాయి. కాగా,ఆదివారం లెబనాన్‌ నుంచి తమ దేశం వైపు దూసుకొచ్చిన ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం. 

ఇదీ చదవండి: లెబనాన్‌ నిరాశ్రయులు..10 లక్షలు

Advertisement
 
Advertisement
Advertisement