కర్ణాటక: కరోనా వైరస్ రాకతో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. సామాజిక దూరం, శానిటైజర్లు, మాస్క్‌ల వాడకం.. ఇలా ఇవన్నీ దాదాపు ఏడాదిన్నరకు పైగా మనుషుల జీవితంలో భాగమయ్యాయి. ఈ క్రమంలో కరోనా కేసులతో పాటు మాస్క్‌ల వాడకం కూడా పెరుగుతోంది. అయితే మార్కెట్‌లో దొరుకుతున్న మాస్క్‌లు కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి వదిలేయడం, పర్యావరణ హితం కాకపోవడం వల్ల వ్యర్థాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పర్యావరణ హితమైన మాస్క్‌ను తయారు చేశాడు.
ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఇప్పట్లో మాస్క్‌ల వాడకం ఆపలేం కనుక పర్యావరణ హితమైన మాస్క్‌లతో కర్ణాటక లోని మంగళూరుకు చెందిన నితిన్ వాస్ మన ముందుకు వచ్చాడు. ఒక దళసరి పేపర్ మధ్యలో టమాటా, తులసి, దోసకాయ, క్యాప్సికం వంటి విత్తనాలను పెట్టి మాస్క్‌లు రూపొందించాడు. వీటిని వాడేసిన తర్వాత నేల మీద పడేస్తే…అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. నితిన్ వాస్‌కు వచ్చిన ఈ అద్భుత ఐడియాకు మంగళూరులోని పేపర్ సీడ్ అనే సంస్థ సాయం అందించింది. అతని ఆలోచనలకు అనుగుణంగా పేపర్ సీడ్ మాస్కులు తయారు చేస్తోంది. ఇవి ఒక్కసారి వాడి పడేయాల్సిన మాస్క్‌లని, పేపర్‌తో రూపొందించినవి కాబట్టి… ఒకసారే వినియోగించాలని చెప్పింది. ప్రస్తుతానికి ఇలాంటివి ప్రయోగాత్మకంగా 400 మాస్క్‌లు తయారు చేశామని, ఇవి విజయవంతమైతే.. ఇలాంటివి మరిన్ని తయారుచేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
( చదవండి: నిజామాబాద్‌లో దారుణం.. మున్సిపల్ సిబ్బందిపై దాడి! )
Comments
Please login to add a commentAdd a comment