న్యూఢిల్లీ: గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తే, 2030 నాటికి ఈ రంగానికి అదనంగా 62 బిలియన్ డాలర్ల మేర వార్షిక మార్కెట్ ఏర్పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. ప్రైవేటు రంగం ప్రకృతి అనుకూల పరిష్కారాలను అనుసరిస్తే 2030 నాటికి అదనంగా (అన్ని రంగాల్లో) 10.1 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ ఏర్పడుతుందని అంచనా వేసింది.
గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో నీటి నిర్వహణ, బాధ్యాయుత వనరుల సమీకరణ, ప్రకృతి పరిరక్షణను ప్రస్తావిస్తూ.. ప్రకృతి నష్టం విషయంలో కంపెనీల పాత్రను ఇవి పునర్ వ్యవస్థీకరిస్తాయని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగం వార్షిక టర్నోవర్ 700 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రకృతికి నష్టం కలిగిస్తున్నట్టు వివరించింది. ఒక్క కాస్మొటిక్స్ పరిశ్రమే ఏటా 120 బిలియన్ ప్యాకేజింగ్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది.
కాస్మోటిక్స్, సబ్సుల్లో ముడి పదార్థంగా వినియోగించే పామాయిల్ కారణంగా 2000–2018 మధ్య అంతర్జాతీయంగా 7 శాతం అటవీ సంపద క్షీణతకు కారణమైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ప్రస్తావించింది. ఈ రకమైన హానికారక విధానాలకు వ్యతిరేకంగా.. గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల పరిశ్రమ ప్రకృతి పరిధిలోనే, ప్రకృతి అనుకూల విధానాలను అనుసరించాల్సిన అవసరాన్ని డబ్ల్యూఈఎఫ్ నివేదిక నొక్కి చెప్పింది.
ఈ రంగంలో వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తి 3.4 శాతం మేర ప్రపంచ గ్రీన్‌గౌస్ గ్యాస్ ఉద్గారాలకు కారణమవుతున్నట్టు వివరించింది. ప్లాస్టిక్‌ను 10–20 శాతం మేర తిరిగి వినియోగించడం ద్వారా 50 శాతం సముద్ర ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించొచ్చని సూచించింది. జీవ వైవిధ్యానికి హాని కలిగించే రిస్క్‌లను అధిగమించే పరిష్కారాలతో అదనంగా 10.1 లక్షల కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని డబ్ల్యూఈఎప్ ఎండీ గిమ్ హువే పేర్కొన్నారు.
పురోగతి నిదానం
ప్రకృతి పరిరక్షణ పట్ల వ్యాపార సంస్థల్లో అవగాహన పెరుగుతున్నా ఈ దిశగా పురోగతి నిదానంగా ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఫారŠూచ్యన్ గ్లోబల్ 500 కంపెనీల్లో 83 శాతం వాతావరణ మార్పులకు సంబంధించి లక్ష్యాలను కలిగి ఉండగా, ఇందులో కేవలం 25 శాతం సంస్థలే తాజా నీటి వినియోగం లక్ష్యాలను ఆచరణలో పెట్టినట్టుగా తాజా అధ్యయన గణాంకాలను ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment