wwf
-
'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్‌గా పీవీ సింధు..
గత 18 ఏళ్లగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్ధ 'ఎర్త్ అవర్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024కు గాను'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపికైంది. మార్చి7న అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన సింధు.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అవగహన కల్పించే పనిలో పడింది. తాజాగా సింధుతో పాటు ప్రముఖ మోడల్ దియా మీర్జా, హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ సింగర్ రఘు దీక్షిత్ 'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్లగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘు దీక్షిత్ మాట్లాడుతూ.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్యవరాణాన్ని రక్షించేందుకు మనమందరం ఏకం కావల్సిన సమయం అసన్నమైంది. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అవహగహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తాను. సహజ వనరులు, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరది. కాబట్టి అందరూ గంట సమయం పాటు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగమవుతరాని ఆశిస్తున్నానని" పేర్కొన్నాడు. చాలా సంతోషంగా ఉంది.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది .ఈ ప్రాతిష్టత్మక ఈవెంట్లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు ధన్యవాదాలు. ప్రతీ ఏడాది కూడా నేను ఈ ఎర్త్‌అవర్ కార్యక్రమంలో పాల్గోంటున్నాను. గతం కంటే ఈసారి ఎక్కువమంది ఈ కార్యక్రమంలో భాగమవుతారని ఆశిస్తున్నాను. నా వరకు అయితే ఈ ఏడాది అన్ని లైట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఒక గంట పాటు ఆపివేసి, నా కుటుంబంతో కలిసి క్యాండిల్‌లైట్ డిన్నర్ చేస్తాను. పర్యావరణాన్ని, ఈ భూమిని కాపాడే బాధ్యత మనందరది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను వాడడం మానేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో మేలు చేస్తోంది. ప్రతీ ఏడాది ఒక గంట మాత్రమే కాకుండా ప్రతీ రోజు కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని" దీయా మీర్జా పేర్కొంది. దుల్కర్ సల్మాన్ సైతం ఎర్త్ అవర్ గుడ్‌విల్ అంబాసిండర్‌గా ఎంపికకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తనతో పాటు అందరూ గంట సేపు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగం కావాలని అభిమానులను దుల్కర్ కోరాడు. అస్సలు ఏంటి ఈ ఎర్త్ అవర్? కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు సుమారు 187 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గంట పాటు లైట్లను ఆర్పివేసి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ నాడు ఎర్త్ అవర్ ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందే ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్వహించనుంది. అంటే మార్చి 23న సాయంత్రం 8:30 గంటల నుంచి 9: 30 గంటల వరకు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది. -
ప్రకృతి అనుకూల ఉత్పత్తులకు భారీ మార్కెట్ - డబ్ల్యూఈఎఫ్
న్యూఢిల్లీ: గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తే, 2030 నాటికి ఈ రంగానికి అదనంగా 62 బిలియన్ డాలర్ల మేర వార్షిక మార్కెట్ ఏర్పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. ప్రైవేటు రంగం ప్రకృతి అనుకూల పరిష్కారాలను అనుసరిస్తే 2030 నాటికి అదనంగా (అన్ని రంగాల్లో) 10.1 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ ఏర్పడుతుందని అంచనా వేసింది. గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో నీటి నిర్వహణ, బాధ్యాయుత వనరుల సమీకరణ, ప్రకృతి పరిరక్షణను ప్రస్తావిస్తూ.. ప్రకృతి నష్టం విషయంలో కంపెనీల పాత్రను ఇవి పునర్ వ్యవస్థీకరిస్తాయని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగం వార్షిక టర్నోవర్ 700 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రకృతికి నష్టం కలిగిస్తున్నట్టు వివరించింది. ఒక్క కాస్మొటిక్స్ పరిశ్రమే ఏటా 120 బిలియన్ ప్యాకేజింగ్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. కాస్మోటిక్స్, సబ్సుల్లో ముడి పదార్థంగా వినియోగించే పామాయిల్ కారణంగా 2000–2018 మధ్య అంతర్జాతీయంగా 7 శాతం అటవీ సంపద క్షీణతకు కారణమైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ప్రస్తావించింది. ఈ రకమైన హానికారక విధానాలకు వ్యతిరేకంగా.. గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల పరిశ్రమ ప్రకృతి పరిధిలోనే, ప్రకృతి అనుకూల విధానాలను అనుసరించాల్సిన అవసరాన్ని డబ్ల్యూఈఎఫ్ నివేదిక నొక్కి చెప్పింది. ఈ రంగంలో వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తి 3.4 శాతం మేర ప్రపంచ గ్రీన్గౌస్ గ్యాస్ ఉద్గారాలకు కారణమవుతున్నట్టు వివరించింది. ప్లాస్టిక్‌ను 10–20 శాతం మేర తిరిగి వినియోగించడం ద్వారా 50 శాతం సముద్ర ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించొచ్చని సూచించింది. జీవ వైవిధ్యానికి హాని కలిగించే రిస్క్‌లను అధిగమించే పరిష్కారాలతో అదనంగా 10.1 లక్షల కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని డబ్ల్యూఈఎప్ ఎండీ గిమ్ హువే పేర్కొన్నారు. పురోగతి నిదానం ప్రకృతి పరిరక్షణ పట్ల వ్యాపార సంస్థల్లో అవగాహన పెరుగుతున్నా ఈ దిశగా పురోగతి నిదానంగా ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఫారŠూచ్యన్ గ్లోబల్ 500 కంపెనీల్లో 83 శాతం వాతావరణ మార్పులకు సంబంధించి లక్ష్యాలను కలిగి ఉండగా, ఇందులో కేవలం 25 శాతం సంస్థలే తాజా నీటి వినియోగం లక్ష్యాలను ఆచరణలో పెట్టినట్టుగా తాజా అధ్యయన గణాంకాలను ప్రస్తావించింది. -
ఆ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్‌ది ఆత్మహత్యే
2022, అక్టోబర్ 5న టెక్సాస్‌లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్‌లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు. చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్‌గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001, మెయిల్: roshnihelp@gmail.com -
ఆహార స్వావలంబన విధాన దిశగా...
గత యాభై ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగానికి సగం నశించింది. ఇది పర్యావరణ ప్రళయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవవైవిధ్య వినాశనం అని ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్’ నివేదిక చెబుతోంది. ఇవి మరింత ముదరడానికి ప్రపంచ ఆహార వ్యవస్థే కారణమని కూడా సూచిస్తోంది. దీన్ని బలపరిచే సాక్ష్యం, కుబేరుల జాబితాలోకి ఆహార రంగ వ్యాపారవేత్తలు చేరడం! విరోధాబాస ఏమిటంటే, ఈ సంక్షోభాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను బడా కంపెనీలు సూచిస్తుండటం! ఆహార భద్రత రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునేవారి చేతుల్లోకి మారిపోతోంది. ఈ విపరిణామాలు సంభవించకూడదంటే ఆహార వ్యవస్థ సమూలంగా మారాలి. కొన్నేళ్ల క్రితం నాటి మాట. జర్మనీలోని ఓ నేచర్ రిజర్వ్‌పై ససెక్స్ యూనివర్శిటీ (యూకే) ఓ అధ్యయనం నిర్వ హించింది. దాని ప్రకారం, ఆ ప్రాంతంలోని క్రిమికీటక సంతతి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే... పాతికేళ్ల కాలంలో ఎగిరే కీటకాలు 75 శాతం వరకూ లేకుండా పోయాయి. ఈ పరిణామం ‘పర్యావరణ ప్రళయం’ లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఈ ఫలితాలకు ఆశ్చర్యపోయిన కొందరు శాస్త్రవేత్తలు కొంచెం ఎక్కువ చేసి చెప్పి ఉంటారని వ్యాఖ్యానించడమే కాకుండా... ఒకవేళ అదే నిజమైతే జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే మేలుకొలుపు అవుతుందని కూడా వ్యాఖ్యా నించారు. ఐదేళ్ల తరువాత... ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ‘లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2022’ కూడా ఇలాంటి బాంబే వేసింది. యాభై ఏళ్ల కాలంలో (1970–2018) వన్యప్రాణుల జనాభాలో దాదాపు సగం నశించిపోయిందని 32 వేల జీవజాతులను విశ్లేషించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ తెలిపింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అత్య ధికంగా 94 శాతం జనాభా నశించి పోయింది. మంచినీటిలో బతికే వాటిల్లో 80 శాతం వాటికి నష్టం జరిగింది. ఈ నివేదికలోని ఇతర ఆందోళనకరమైన అంశాలను కాసేపు పక్కనబెడితే భూమి ‘ఆరవ మహా వినాశనం’ ముంగిట్లో ఉందన్న విషయం చాలాకాలంగా తెలుసు. అందుకే ఇది జీవజాతి వినాశనమనీ, మానవ నాగరకతల పునాదులపై జరుగుతున్న దాడి అనీ యూఎస్ నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ పేర్కొనడం అతిశయోక్తి ఏమీ కాదు. నిజానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక సమాజానికి ఒక షాక్ లాంటిది. కానీ చదువుకున్నవారి చాలామంది మనఃస్థితిని బట్టి చూస్తే, ఈ నివేదిక వారిని ఇసుమంత కూడా కదిలించినట్లు కనపడదు. వీరు చెట్లను అభివృద్ధి నిరోధకాలుగా చూస్తూంటారు. రహదారులు, గనులు, పరిశ్రమల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం, లేదా కావాల్సినట్టుగా మార్చుకోవడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పామాయిల్ పంటల కోసం విశాలమైన అటవీ భూములను చదును చూస్తూండటం ఈ ధోరణినే సూచిస్తుంది. అలాగే పచ్చటి అడవులను పప్పుబెల్లాల మాదిరిగా పరాయివారికి పంచేస్తూండటం చూస్తూంటేనే తెలుస్తుంది పర్యావరణానికి మనం ఏమాత్రం మర్యాద ఇస్తున్నామో! ఏటా కోటి హెక్టార్ల నష్టం... ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మనం సుమారు కోటి హెక్టార్ల అటవీ భూమిని కోల్పోతున్నాం. కానీ ‘సీఓపీ’ చర్చల్లో దీనికి హద్దులు వేయాలన్న అంశంపై ఒక్క తీర్మానమూ జరగదు. ప్రపంచం ఎదు ర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవ వైవిధ్య వినాశనం అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఈ రెండు అంశాలు మరింత ముదిరేందుకు ప్రపంచ ఆహార వ్యవస్థ కారణమని కూడా సూచి స్తోంది. ఈ హెచ్చరిక ఉన్నా, వ్యవసాయ రంగంలో మార్పులన్నీ వ్యవసాయం పెద్ద ఎత్తున సాగాలన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సూచించిన విధంగా మాత్రమే మారుతున్నాయి. ‘ద యాక్షన్ గ్రూప్ ఆన్ ఎరోషన్, టెక్నాలజీ అండ్ కాన్సంట్రేషన్ (ఈటీసీ) వంటి అంతర్జాతీయ సంస్థ తయారు చేసిన ఇంకో నివేదిక కూడా ఆహార వ్యవస్థ బిగ్ ఫుడ్, బిగ్ టెక్, బిగ్ ఫైనాన్స్‌లకు చెందిన కంపెనీల చేతుల్లోకి జారిపోతోందని విస్పష్టంగా తెలిపింది. దీనివల్ల రైతులు, జాలర్ల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉంది. నేలను విషతుల్యం చేయడం, నీళ్లను విపరీతంగా వాడేయడం, పర్యా వరణాన్ని కలుషితం చేయడం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం... ఈ క్రమంలో లాభాలు ఆర్జించడమే ఈ బడా కంపెనీల లక్ష్యంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కబళించిన రెండేళ్లలోనే అత్యంత కుబేరుల జాబితాలోకి 62 మంది ‘ఆహార కోటీశ్వరులు’ చేరారు. ఈ కాలావధిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీ ‘కార్గిల్’ లాభాల వాటాలో 64 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని ఇతర ఫుడ్ కంపెనీలు కూడా విపరీతంగా లాభపడ్డాయి. ఈ రెండు నివేదికలూ మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధనాంశాలుగా ఉంచాలి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక చెప్పే విషయానికి వ్యవయాయ రంగంలో జరుగుతున్న వ్యవహారాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పలు ఉదాహరణలతో ఇచ్చిన ఈటీసీ నివేదిక... వ్యవసాయం డిజిటలైజ్ అయితే బోలెడంత సమాచారం సేకరించవచ్చుననీ, ఈ సమాచారం కాస్తా మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల క్లౌడ్ సర్వర్లలోకి చేరిపోయి కొత్తకొత్త బిజినెస్ వ్యూహాల రూప కల్పనకు సిద్ధంగా ఉంటుందనీ చెబుతుంది. ఈ నివేదికను కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఇదెలా జరుగుతోందో అర్థమవుతుంది. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యంలో తరుగుదల అంశాలను చూపి బడా కంపెనీలు వాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధా రిత పరిష్కారాలు సూచిస్తాయి. జన్యుమార్పిడి పంటలు, హైటెక్ విత్తనాల్లాంటివన్నమాట. డిజిటల్ వ్యవసాయం వల్ల లాభాలంటూ ఊదరగొడతాయి. ఇదే క్రమంలో జీవ వైవిధ్య వనరుల పరిరక్షణ పేరు చెప్పి, కృత్రిమ ఆహారాన్ని మన ముందుంచుతాయి. రైతులు, రైతు కూలీలు కనుమరుగు... డిజిటల్ టెక్నాలజీల వల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందను కునేరు! డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఇప్పుడున్న ఆహార వ్యవస్థ విధ్వంసం మాత్రమే జరుగ నుంది. బడా కంపెనీలవన్నీ తప్పుడు పరిష్కారాలని ఈ నివేదిక ద్వారానే స్పష్టమవుతుంది. డ్రోన్లు, సెన్సర్లు, ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధల వల్ల... రైతులు, రైతు కూలీలు క్రమేపీ మరుగున పడిపోతారు. డ్రైవర్ల అవసరం లేని ట్రాక్టర్లు, యంత్రీకరణకు అనువైన పొలాలతో బడా టెక్ కంపెనీలు బడా ఆర్థిక సంస్థల సాయంతో రైతులకు అవసరమే లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆహార భద్రత అనేది రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునే కొందరి చేతుల్లోకి మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విత్తనాల విక్రయాల్లో 40 శాతాన్ని కేవలం రెండు కంపెనీలు నియంత్రి స్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవవచ్చు. ఈ కంపెనీలు పరోక్షంగా ఆహార సరఫరా వ్యవస్థ మొత్తాన్ని నియంత్రిస్తున్నట్లే లెక్క. ఏం పండించాలి, ఎప్పుడు పండించాలి వంటి అంశాలనూ బడా కంపెనీలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అంతేకాదు... ఆహార కంపెనీల సహకారంతో చివరకు పంటల కోతలు ఎలా జరగాలి, మనం ఏం తినాలన్నది కూడా నిర్ణయిస్తాయి. ఈ విపరిణామాలన్నీ సంభవించకుండా ఉండాలంటే ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థ సమూలంగా మారాల్సి ఉంటుంది. సరికొత్త ఆహార వ్యవస్థకు మారడం కూడా వైవిధ్యత, ఆహార సార్వ భౌమత్వం అంశాల ఆధారంగా సాగాలి. అంతేకాదు... ఇది 360 కోట్ల రైతులు, రైతుకూలీలు, మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగాల్సిన మార్పు. జీవ వైవిధ్య పరిరక్షణ, కనీస ఆదాయానికి భరోసా, వాతావ రణ పరంగా వీరికి న్యాయం జరగడం అప్పుడే సాధ్యమవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..
వాషింగ్టన్ డీసిలోని నేచరల్ హిస్టరీ మ్యూజియం గురించి తరగతిగదిలో ఎన్నోసార్లు విని ఉన్నాడు సుయాస్. అక్కడ మొక్కల నుంచి జంతువుల వరకు, శిలల నుంచి శిలాజాల వరకు ఎన్నో కళ్లకు కడతాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. అలాంటి మ్యూజియంను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది సుయాస్ కల. చిత్రమేమిటంటే...పదిహేడేళ్ల వయసులో సుయాస్ తీసిన ఆరు మాసాల పులిపిల్ల ఫొటోను ఆ మ్యూజియంలో సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఈ ఫొటో నేచర్స్ విభాగంలో బెస్ట్ ఫొటోగ్రఫీ ఏషియా అవార్డ్ అందుకుంది. ఎంత సంతోషం! భోపాల్(మధ్యప్రదేశ్)కు చెందిన సుయాస్ కేసరికి చిన్నప్పటి నుంచి వైల్డ్‌లైఫ్‌పై అంతులేని ఆసక్తి ఉండేది. తాను విన్న మృగరాజు, పులి, కుందేలు, నక్క...మొదలైన కథలు జంతుజాలంపై తనకు ఆసక్తిని కలిగించాయి. తన వయసు పిల్లలు టామ్ అండ్ జెర్రీలాంటి కార్టూన్ సీరియల్స్ చూస్తుంటే తాను మాత్రం జంతుజాలం, పర్యావరణానికి సంబంధించిన చానల్స్ చూసేవాడు. తాను చూసిన విశేషాలను స్నేహితులతో పంచుకునేవాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా వేసవి సెలవులకు కోల్‌కతాకు వెళ్లినప్పుడు...బెంగాల్‌లోని జూపార్క్లను చూసేవాడు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తన బాల్యంలో ఒకసారి... ఒక జూలో కటకటాల వెనకాల ఉన్న పులులను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ‘నువ్వు సంతోషంగా ఉన్నావు కాని అవి సంతోషంగా లేవు’ అన్నది అమ్మమ్మ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు సుయాస్. ‘వాటి నివాసస్థలం అడవులు. అక్కడే అవి సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలవు. జూ వాటికి జైలు మాత్రమే’ అని చెప్పింది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి అడవుల్లో జంతుజాలానికి సంబంధించిన జీవనశైలిని తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్ గురించి ఆలోచనల వేరు. చాలా సందర్భాల్లో చిన్నప్పటి ఆసక్తి బాల్యంలోనే ఆగిపోతుంది. అయితే సుయాస్ విషయంలో అలా జరగలేదు. కాలేజీ రోజుల్లో, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా తన ఆసక్తి తనను విడిచి పెట్టలేదు. అందుకే యూఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అడవులను వెదుక్కుంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ... అడవులు ఎన్నో తిరుగుతూ కన్జర్వేటర్లు, ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అడవులన్నీ తిరుగుతున్న క్రమంలో తనకొక విషయం అర్థమైంది. మనుషులు అడవులకు వస్తున్నారు, జంతుజాలం మనుషులను చూస్తుంది...కాని ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. జంగిల్ పర్యటన వినోదానికి మాత్రమే పరిమితమైపోతుంది. అలా కాకుండా అడవిలో ప్రతి జీవి గురించి మనసుతో తెలుసుకోవాలి. అవి మనలో ఒకటి అనుకోవాలి.... ఇలా ఆలోచిస్తూ, తన ఆలోచనకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. రకరకాల జంతువుల గురించి చిన్న చిన్న మాటలతోనే లోతైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఊహించని స్థాయిలో ఫాలోవర్స్! అందులో యూత్ ఎక్కువ. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. అందుకే ‘20 సంవత్సరాల వ్యక్తి దృష్టికోణంలో ‘అడవి’ అనే టాపిక్‌ను తీసుకొని ఫిల్మ్సిరీస్ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్) స్వచ్ఛంద సంస్థ చేయూత ఇచ్చింది. తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయి అనే కారణంతో ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్యప్రదేశ్‌కు వస్తున్న 18 అడవి ఏనుగులపై దాడి చేయడానికి కొందరు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారి నుంచి ఏనుగులను రక్షించడమే కాదు, వారి పంటలు దెబ్బతినకుండా తన బృందాలతో కలిసి కంచెలు ఏర్పాటు చేశాడు సుయాస్. జంతుజాలం సంక్షేమం గురించి అడవంత విశాలమైన పనులు చేయాలనేది సుయాస్ కల. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్ గురించి సొంతంగా వోటీటీ ప్లాట్‌ఫామ్ మొదలుపెట్టాలని! విజయోస్తు సుయాస్. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
వన్య ప్రాణుల కోసం...
‘ఆరెంజ్’ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు రామ్‌చరణ్. అది సినిమా కోసం. ఇప్పుడు నిజంగానే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారారాయన. అయితే చరణ్ ఫొటోగ్రాఫర్ కావడం వెనక ఓ మంచి ఉద్దేశం ఉంది. ప్రకృతిని కాపాడటం కోసం ‘డబ్లూడబ్ల్యూఎఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ 60 ఏళ్లుగా పని చేస్తోంది. ఇటీవలే ఈ సంస్థకు రాయబారిగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఎన్నికయ్యారు. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ కోసం నిధుల సేకరణలో చరణ్ కూడా తన వంతు సాయం చేయనున్నారు. సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్య ప్రాణుల ఫొటోలతో చరణ్ తన కొత్త ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం ఏర్పరచాలన్నది వీరి ఉద్దేశం. ‘‘భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ’’ అన్నారు చరణ్. -
వన్యప్రాణుల సంరక్షణ కోసం.. రాజస్థాన్‌కు ఉపాసన
సాక్షి, హైదరాబాద్: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన 'సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్' అనే పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహకారంతో హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు వెళ్లారు. జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. సామాజిక అంశాలపై ఉపాసన చూపుతున్న శ్రద్ద పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శనివారం రాజస్థాన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రంతంబోర్ నేషనల్ పార్క్ కి వారు వెళ్లారు. కాగా వారు మొదటి రోజు ఉదయం సవాయ్ మధోపూర్ నగరంలోని స్టార్ హోటల్ అయిన తాజ్ వివంతా కి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత వారు చేయబోయే కార్యక్రమానికి వార్మప్ గా ఉండాలని యోగ చేసి మనసును తేలిక పరుచుకున్నారు. హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి ని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్ లు చేసే డిజర్ట్స్, వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. శ్రావ్యమైన మెలోడీస్ , డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్ తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలుగా తర్వాతి రోజుకు వారు ఎదురుచూస్తున్నారు. Bonding with the girls on a mission to #savetigers @ApolloFND @WWFINDIA - spending our Republic Day weekend learning about India’s wildlife ! Jai Hind 🇮🇳 pic.twitter.com/nOjzNTHqcm — Upasana Konidela (@upasanakonidela) January 27, 2019 -
స్కూల్లో WWF తరహా ఫైట్..విద్యార్థి మృతి
-
క్లిక్ చేయండి.. నగరాన్ని గెలిపించండి!
సాక్షి, హైదరాబాద్: మెరుగైన రవాణా వ్యవస్థ, ఐటీ రంగ అభివృద్ధి, హరిత భవనాల నిర్మాణాలు.. వంటి అనేక అంశాలు ఏ నగరంలో మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ దేశాల్లో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) ఆన్లైన్లో ఓ పోటీని నిర్వహిస్తోంది. 14 దేశాల్లోని మొత్తం 34 నగరాలు ఎంపికైన ఈ పోటీలో మన దేశం నుంచి కేవలం 3 నగరాలు మాత్రమే పోటీలు నిలబడ్డాయి. ఇందులో హైదరాబాద్‌కూ చోటు దక్కించుకుంది. మిగిలిన రెండు నగరాలు.. కొచ్చి, కోయంబత్తూర్ నగరాలు. ఈ పోటీ విశేషాలివిగో.. నైపుణ్యం గల ఉద్యోగులు లభించటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నివసించటానికి అనుకూలమైన వాతావరణం, పెరుగుతున్న హరిత భవనాలు, నష్టభయం పెద్దగా లేకపోవటం, విద్యుత్, రోడ్ల అభివృద్ధి, పన్ను రాయితీలు, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాట్లు తదితర కారణాల వల్ల హైదరాబాద్ ఈ పోటీలో నిలిచింది. అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా నగరంలో నిర్మించిన ‘జీవవైవిధ్య సూచి’ హైదరాబాద్‌ను ప్రపంచ దేశాల్లో తలమానికంగా నిలుపుతోంది. ఐటీ పెట్టుబడులు పెరగటం, పునరుత్పాదక శక్తి వినియోగంలో ముందంజలో ఉండటం వల్ల కోయంబత్తూర్.. హరిత భవన నిర్మాణాలుండటం, వాతావరణంలో కార్బన్ శాతం తక్కువగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో కొచ్చి నగరాలు ఈ పోటీలో నిలిచాయి. విజేతల ఎంపిక ఇలా.. రవాణా వ్యవస్థ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, మౌలిక వసతులు, పార్కులు, విశాలమైన ప్రదేశాలు, విద్యుత్, నీటి వినియోగం వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించి ఉత్తమ నగరాన్ని ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఓట్ల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. మార్చి 27న కెనడాలో జరిగే కార్యక్రమంలో ‘నేషనల్ ఎర్త్ అవర్ క్యాపిటల్ అవార్డు’ను అందిస్తారు.