లక్షల ప్యాకేజి రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందనేది అందరికి తెలుసు. అయితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఒక 'సాఫ్ట్‌వేర్' ఇంజినీర్ రోజుకి కేవలం ఒక గంట మాత్రమే పనిచేస్తూ ఏకంగా రూ. 1.2 కోట్లు వేతనం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడెవరు? ఎక్కడ పనిచేస్తున్నాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. మనం చెప్పుకుంటున్న యువ సాఫ్ట్‌వేర్ (డెవాన్) గూగుల్ (Google) కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు రోజుకి 1 గంట మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన పనిచేస్తాడు. మిగిలిన సమయం స్టార్టప్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీలో తాను ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు పని చాలా త్వరగా నేర్చుకున్నట్లు, కోడ్‌లను కూడా త్వరగా పూర్తి చేసినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
నిజానికి తనకు వారానికి సరిపడా వర్క్ ఇస్తే దాన్ని మొదటి రోజే దాదాపు పూర్తి చేస్తాడు, ఆ తరువాత మిగిలిన నాలుగు రోజులు కేవలం గంట మాత్రమే పనిచేసి చాలా రిలాక్స్‌గా ఉంటాడు. మొత్తానికి అతనికి ఇచ్చిన వర్క్ మాత్రం టైమ్‌కి పూర్తి చేస్తాడు. ఇచ్చిన టైమ్‌కి పని బాగా చేస్తుండటం వల్ల కంపెనీ ఇతనికి బోనస్ అందించడంతో పాటి రివార్డులు కూడా అందిస్తోంది.
ప్రస్తుతం గూగుల్ కంపెనీలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో ఇతడు కూడా ఒకడు కావడం గమనార్హం. అంతే కాకుండా గూగుల్ సంస్థలో జాబ్ చేయడం చాలా సులభమని చెప్పుకొచ్చాడు. డెవాన్ 1,50,000 డాలర్లను వార్షిక జీతంగా పొందుతున్నాడు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.2 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment