డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిపడా నిధులు లేని కారణంగా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగుల డీఏ పెంపు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మమతా మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు.
చాలకపోతే.. నా తల నరకి తీసుకెళ్లండి
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇకపై డీఏ ఇవ్వడం మా ప్రభుత్వానికి సాధ్యం కాదు. మా దగ్గర డబ్బు లేదు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. ఇంకా ఎంత కావాలి? ప్రభుత్వం ప్రకటించిన డీఏ పట్ల మీరు సంతోషంగా లేకుంటే నా తల నరికి తీసుకెళ్లండి ”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్స్ విధానం వేరువేరుగా ఉంటాయి. మేం వేతనంతో కూడిన 40 రోజుల సెలవులు మంజూరు చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? ’అని మండిపడ్డారు.
ఫిబ్రవరి 15న, అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి.. ఉపాధ్యాయులతో సహా ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు, ప్రాథమిక వేతనంలో 3% డియర్‌నెస్ అలవెన్స్‌గా ప్రభుత్వం ఇస్తోంది. 6వ వేతన సంఘం సిఫారసుల మేరకు సవరించిన డియర్‌నెస్ అలవెన్స్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న డియర్‌నెస్ అలవెన్స్‌తో (డీఏ) పోలిస్తే పెంపుదల చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వ భావించారు. అందుకే పెంపుపై అసంతృప్తితో నిరసనలు చేపట్టారు.
చదవండి: తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఐదుగురు అక్కడికక్కడే..
Comments
Please login to add a commentAdd a comment