ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్ని రోజులు హైబ్రిడ్ వర్క్‌తో తలమునకలైన ఉద్యోగులు.. ఇప్పుడు తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు సంస్థలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌ల మధ్య జరుగుతున్న సంభాషణలు నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి.
ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చనేది సంస్థల అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా రిమోట్ వర్క్‌తో టీం లీడర్‌లు, బాస్‌లు ఉద్యోగులతో వర్క్ చేయించుకోవడం తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగులు ట్రెండ్‌కు తగ్గట్లు స్నేహితులతో ఎలా మెలుగతారో.. బాస్‌లతో సైతం అదే తరహాలో సంభాషిస్తున్నారు. ఆ సంభాషణలే బాసిజం చూపించే బాస్‌లకు అస్సలు నచ్చడం లేదు. హర్టవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఉద్యోగి శ్రేయాస్.. బాస్ సందీప్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను మీరూ చూసేయండి
తాజాగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న శ్రేయాస్ అనే యువతికి ఆమె బాస్ సందీప్ ఓ వర్క్ అలాట్ చేశాడు. ఆ వర్క్ పూర్తయ్యిందా అంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్‌కు శ్రేయాస్ ఇలా రిప్లయి ఇచ్చింది.
"హే.. నో,నాట్ ఎట్" అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ బాస్‌కు కోపం తెప్పించింది. దీంతో సందీప్ స్పందించాడు.
హాయ్ శ్రేయాస్ నేను మీ బాస్‌ను నన్ను 'హే' అని పిలవొద్దు. ఉద్యోగులు బాస్‌తో మాట్లాడేందుకు కొన్ని పద్దతులుంటాయి. నీకు నా పేరు గుర్తు లేకపోతే హాయ్ అని మెసేజ్ చేయ్. దీంతో పాటు "డ్యూడ్", "మ్యాన్", "చాప్", "చిక్" అని కూడా పిలవొద్దు. అంటూ ఉద్యోగికి వాట్సాప్ మెసేజ్ ఫార‍్వర్డ్ చేశాడు. అంతే ఆ రిప్లయికి ఉద్యోగి శ్రేయాస్ స్పందిస్తూ.."మంచిది. నేను మీతో వాట్సాప్ చాట్ చేస్తున్నాను. తప్పితే లింక్డిన్, మెయిల్ చేయలేదు. మిమ్మల్ని కించ పరచలానే ఉద్దేశ‍్యం నాకు లేదు. నేను ప్రొఫెషనల్‌గా మీతో మాట్లాడాను అని బాస్‌కు చెప్పింది".ఆ వాట్సాప్ సంభాషణను ఉద్యోగి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్‌లో పోస్ట్ చేయడం,అది కాస్త వైరల్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment