
Employee Quits Job On Spot: ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ చాలా మంది ఒత్తిడికి ఇదే మూల కారణం. సోషల్ మీడియా ముఖ్యంగా రెడ్డిట్ (Reddit).. ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న బాధలను పంచుకునే కేంద్రంగా మారింది. ఇటీవల CrazieIrish అనే పేరుతో ఉన్న ఒక రెడ్డిట్ యూజర్ తమ టాక్సిక్ బాస్ బూతు మాట అనడంతో స్పాట్‌లో ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు షేర్ చేశారు.
దీని గురించి మరింత వివరణ అడిగినప్పుడు ఆ యాజర్ కామెంట్స్‌లో పూర్తిగా తెలియజేశారు."నేను ఇంటి నుంచి పని చేస్తున్నా. కొత్త కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడానికి సపోర్ట్ కోసం అతనికి (బాస్) కాల్ చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో కంప్యూటర్‌ను సెటప్ చేయనందుకు కోపంగా ఉన్న అతను బూతు మాట (F*** Off) అన్నాడు. దీంతో స్పాట్‌లో జాబ్ వదిలేస్తున్నట్లు చెప్పాను" అని రాసుకొచ్చారు. ఈ ఈమెయిల్‌కు తమకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు.
ఈ రెడ్డిట్ పోస్ట్ షేర్ చేసిన కేవలం 20 గంటల్లోనే 37,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా మంది ఇంటర్నెట్ యాజర్లు కామెంట్ల రూపంలో స్పందించారు. ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు.
So, I Quit My Job
byu/CrazieIrish inantiwork