ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్‌కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్‌లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.
ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.
కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్‌కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్‌లో సంభాషణ చేస్తాడు.
ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..
ఏజెంట్‌ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment