technologh
-
బాస్‌ను తిట్టడానికి.. ఓ కొత్త సర్వీస్
ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్‌కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్‌లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్‌కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్లో సంభాషణ చేస్తాడు.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..ఏజెంట్‌ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. -
యూజర్ ప్రశ్నకు చాట్‌జీపీటీ దిమ్మతిరిగే సమాధానం
టెక్నాలజీ పెరుగుతున్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఆధారపడేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ అసైన్మెంట్లు, హోమ్‌వర్క్, ప్రాజెక్ట్‌లు, రెజ్యుమ్స్, ఆఫీస్ వర్క్ వంటి వాటిని పూర్తి చేయడానికి ఏఐను వాడుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షణీయంగా లేని టిండెర్ బయోను రూపొందించామని చాట్‌జీపీటీని కోరాడు.ఆకర్షణీయంగా లేని టిండెర్ బయో కావాలని అడగడంతో.. చాట్‌జీపీటీ ఒక సమాధానం ఇచ్చింది. దీనిని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన చాలామంది జనం ఏ ప్రశ్నకు అయినా చాట్‌జీపీటీ సమాధానం అందిస్తుందని చెబుతున్నారు.''కంప్లైంట్స్ చేయడం చాలా ఇష్టం. నా 12 పిల్లులను పట్టించుకోని, నా గోళ్ళ క్లిప్పింగ్‌ల సేకరణను తట్టుకోగల వారి కోసం వెతుకుతున్నాను. స్నానం చేయడం కూడా అతిగా ఉంటుందని భావిస్తున్నాను. యూట్యూబ్‌లో కాన్స్పిరసీ థియరీ వీడియోలను చూస్తాను. నేను నా ఎక్స్ గురించి మాట్లాడటం ఆపను. నేను మా అమ్మతో నివసిస్తున్నాను'' అంటూ చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కంప్యూటర్ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత భయానకంగా కూడా ఉంటుందని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు ఇది చాలా నిజంయితీగా ఉంది, చాలా బాగుందని అన్నారు. -
ఫాస్ట్ ఫుడ్‌లా... ఫాస్ట్ బ్రిడ్జి
త్రీడీతో రెడీమేడ్! చెట్టులెక్కగలవా? ఓ నరహరి... పుట్టలెక్కగలవా? అని చెంచులక్ష్మి సినిమాలో ఓ పాటుంది. నారాయణుడి ‘స్కిల్స్’ తెలుసుకునేందుకు లక్ష్మీదేవి సంధించిన ప్రశ్నలన్నింటికీ ఆయన ‘ఓ ఎస్’ అని సమాధానం చెప్పేశాడు. అవే ప్రశ్నలను మీరిప్పుడు రోబోలకు వేశారనుకోండి... అవి కూడా లేటెస్ట్ భగవంతుడి టైప్‌లో యా... వీ క్యాన్! అనేయడం ఖాయం. ఫొటోలో కనిపిస్తోందే.. టెక్నాలజీ.. రోబోలు తమ స్కిల్సెట్కు చేర్చుకున్న సరికొత్త అంశం! ఎంఎక్స్3డీ అనే నెదర్లాండ్స్ కంపెనీ ఒకటి రోబోలు, త్రీడీ ప్రింటింగ్‌లను కలగలిపి.. ఏకంగా బ్రిడ్జీలు కట్టేస్తామని అంటోంది. అనడమే కాదు, ఆమ్స్టర్డ్యామ్ నగరం మధ్యలో ఉన్న కాలువపై ఓ ఉక్కు వంతెనను నిర్మించబోతోంది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకూ ఏవో చిన్న చిన్న వస్తువులను మాత్రమే తయారు చేసుకోవచ్చునని అనుకునే వారు. ఇటీవలి కాలంలో ఈ భావన తారుమారు అవుతోంది. గోడలు కట్టేందుకు మొదలుకొని.. పూర్తిస్థాయిలో ఓ ఇంటిని కట్టేసేందుకు కూడా త్రీడీ ప్రింటింగ్‌ను వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి బ్రిడ్జీ విషయాన్నే తీసుకుంటే ఇందుకోసం ఎంఎక్స్3డీ ఫ్యాక్టరీ రోబోలను ఉపయోగించింది. కాకపోతే వీటికి త్రీడీ ప్రింటింగ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్, ఇతర పరికరాలను జోడించింది. ఒకవైపు నుంచి ఉక్కు, తదితర లోహాలు తీగల రూపంలో రోబో చేతికి వస్తూంటే... అక్కడికక్కడే వాటిని కరిగించి రెడీమేడ్‌గా నిర్దిష్ట రూపంలోకి మారుస్తూంటాయి ఈ రోబోలు. అవసరమైన చోట వెల్డింగ్ కూడా జరిగిపోతూంటుంది. త్రీడీ ప్రింటింగ్ కారణంగా నిర్మాణ ఖర్చు చెప్పుకోదగ్గస్థాయిలో తగ్గుతుందని, అదే సమయంలో లేబర్ ఖర్చులు కూడా పెద్దగా ఉండవని ఎంఎక్స్3డీ అంటోంది.