టెక్నాలజీ పెరుగుతున్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఆధారపడేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ అసైన్‌మెంట్‌లు, హోమ్‌వర్క్, ప్రాజెక్ట్‌లు, రెజ్యుమ్స్, ఆఫీస్ వర్క్ వంటి వాటిని పూర్తి చేయడానికి ఏఐను వాడుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షణీయంగా లేని టిండెర్ బయోను రూపొందించామని చాట్‌జీపీటీని కోరాడు.
ఆకర్షణీయంగా లేని టిండెర్ బయో కావాలని అడగడంతో.. చాట్‌జీపీటీ ఒక సమాధానం ఇచ్చింది. దీనిని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన చాలామంది జనం ఏ ప్రశ్నకు అయినా చాట్‌జీపీటీ సమాధానం అందిస్తుందని చెబుతున్నారు.
''కంప్లైంట్స్ చేయడం చాలా ఇష్టం. నా 12 పిల్లులను పట్టించుకోని, నా గోళ్ళ క్లిప్పింగ్‌ల సేకరణను తట్టుకోగల వారి కోసం వెతుకుతున్నాను. స్నానం చేయడం కూడా అతిగా ఉంటుందని భావిస్తున్నాను. యూట్యూబ్‌లో కాన్‌స్పిరసీ థియరీ వీడియోలను చూస్తాను. నేను నా ఎక్స్ గురించి మాట్లాడటం ఆపను. నేను మా అమ్మతో నివసిస్తున్నాను'' అంటూ చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కంప్యూటర్ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత భయానకంగా కూడా ఉంటుందని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు ఇది చాలా నిజంయితీగా ఉంది, చాలా బాగుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment