
భాగ్యనగర్‌కాలనీ: పనిఒత్తిడి కారణంగా ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దయాల్‌గూడ ఎలైట్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న భగవాన్ నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితమే వివాహమైంది.
అయితే ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగవాన్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు తెలిసిన వారి వద్ద విచారించినా ఫలితం లేదు. దీంతో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment