హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది.
అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్‌టీఎస్‌బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment